కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్‌లోకి వచ్చేసింది. కానీ తెలుగులో విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు విడుదల కావడమే అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. తాజాగా కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు.
కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ వారు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. కానీ తెలుగులో ధునుష్‌కు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి కెప్టెన్ మిల్లర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు.
నేడు విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. 1930ల బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. సినిమాలో సెట్టింగ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో జివి ప్రకాష్ బిజిఎమ్ మరో లెవెల్ అని విమర్శకులు అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అని, సెకండాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ఎఫైర్ అని అంటున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు.
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
Comments
Please login to add a commentAdd a comment