కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్ జోడీగా తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథాంశంతో అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. ఇందులోని లిరిక్స్‌తో విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మొదటి పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగగా తాజాగా విడుదలైన ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.
యుద్ధభూమిలో కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ కనిపిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment