ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. RRR నటుడు వైరల్‌ కామెంట్‌ | RRR Actor Edward Sonnenblick Identifies Only One Hero | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు హీరోలు ఎవరో నాకు తెలియదు.. నాకు తెలిసింది ఒక్కడే: RRR నటుడు

Published Tue, Jan 9 2024 1:15 PM | Last Updated on Wed, Jan 17 2024 7:53 PM

RRR Actor Edward Sonnenblick Identifies Only One Hero - Sakshi

ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్.. దక్షిణ కాలిఫోర్నియాలో జన్మించి నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై షిఫ్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయనకు హీందీ కూడా వచ్చు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు రావడంతో ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రంలో ఆయనకు ఛాన్స్‌ దక్కింది.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతి కానుకగా పాన్‌ ఇండియా రేంజ్‌లో జనవరి 12న వడుదల కానుంది. కానీ తెలుగులో మాత్రం సంక్రాంతి తర్వాత విడుదల అవుతుందని మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటులు సినిమా ప్రమోషన్స్‌లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అమెరికన్‌ నటుడు 'ఎడ్వర్డ్ సోన్నెన్‌ బ్లిక్' కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌లో ఆయన బ్రిటిష్ అధికారిగా నటించాడు. గతంలో కూడా RRR చిత్రంలో ఎడ్వర్డ్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. రాజన్న, షిర్డీ సాయి, కేసరి, సామ్ బహదూర్, మణికర్ణిక వంటి పాపులర్‌ చిత్రాల్లో ఆయన నటించాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న 'ఎడ్వర్డ్ సోన్నెన్‌ బ్లిక్' కోలీవుడ్‌ హీరోల గురించి పలు విషయాలు షేర్‌ చేశాడు. ధనుష్‌ కాకుండా ఈ హీరోలు తెలుసా.. ? అని ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. అజిత్‌, సూర్య, విజయ్‌ ఫోటోలను అతని ముందు ఉంచగా... విజయ్‌ను మాత్రమే సరిగ్గా ఆయన గుర్తించాడు. 2005లోనే విజయ్‌ నటించిన చిత్రాన్ని చూశానని ఎడ్వర్డ్ చెప్పాడు. అతనిలో మంచి టాలెంట్‌ ఉందని అప్పుడే అనుకున్నానని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోలీవుడ్‌లో విజయ్‌ ఫ్యాన్స్‌ ఈ అంశాన్ని తెగ వైరల్‌ చేస్తున్నారు. తమ హీరో రేంజ్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement