రామ్‌చరణ్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో! | Shiva Rajkumar To Play Key Role In Ram Charan, Buchi Babu's Upcoming Movie | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ సినిమాలో శివరాజ్‌ కుమార్‌.. తొలిసారి అలాంటి పాత్రలో!

Published Sat, Jan 6 2024 12:29 PM | Last Updated on Sat, Jan 6 2024 1:19 PM

Shivarajkumar Play Key Role In Ram charan, Buchi Babu Sana Upcoming Movie - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందనే టాక్‌ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ను సంప్రదించింది యూనిట్‌. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా శివ రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

అయితే టాలీవుడ్‌ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మెంటర్‌గా శివరాజ్‌ కుమార్‌ కనిపించబోతున్నారట. ఈ స్పోర్ట్స్ డ్రామాలో శివన్న  గురువు లాంటి పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆయన పాయింటాఫ్ వ్యూలోనే ఫ్లాష్ బ్యాక్ లో కథ ఓపెన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement