Illegal liquor
-
నందమూరి బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం
-
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం
-
ప్లీజ్ సార్.. ఒక్క బాటిల్..!
-
వామ్మో మందుబాబుల గుండె ఆగిపోతుందేమో
-
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
» కృష్ణాజిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలో టీడీపీ నేత తులసీమోహన్ నివాసంలో అక్రమంగా నిల్వచేసిన రూ.79 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడైన ఆయన నివాసంలో 1,210 బాక్సుల్లో ఉన్న 58,080 మద్యం బాటిళ్లను అధికారులు జప్తుచేశారు.» ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మరో టీడీపీ నేత భీమ వెంకటేశ్వరరావు నివాసంలో అక్రమంగా నిల్వచేసిన రూ.12.48 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...ఇవీ సెబ్ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం వివరాలు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు, సెబ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృతంగా జరుపుతున్న సోదాల్లో ఇప్పటివరకు రూ.28.83 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా టీడీపీ నేతలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నవే. ఇవి ఇప్పటివరకు పోలీసులు, సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం నిల్వలు మాత్రమే. కానీ, పోలీసుల కళ్లుగప్పి ఇప్పటికే భారీగా అక్రమ మద్యాన్ని టీడీపీ ముఠా రాష్ట్రంలోకి తరలించేసింది. అంటే.. టీడీపీ ఎంత భారీస్థాయిలో రాష్ట్రంలోకి అక్రమ మద్యాన్ని కుమ్మరిస్తోందన్నది తేటతెల్లమవుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు ఇప్పటికే నల్లధనాన్ని గుట్టలు గుట్టలుగా కుమ్మరిస్తున్న చంద్రబాబు.. ఓటర్లను చిత్తు చేసేందుకు అక్రమ మద్యాన్ని కూడా భారీగా పారిస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీగా కుట్రను అమలుచేస్తున్నారు.పొరుగు రాష్ట్రాల నుంచి రూ.వేయి కోట్ల అక్రమ మద్యం.. మద్యం ద్వారా ఓటర్లను చిత్తుచేయాలన్న కుతంత్రాన్ని అమలుచేసే బాధ్యతను కూడా బాబే తన భుజానికెత్తుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ పూర్తి పారదర్శకంగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దుచేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటుచేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని డిస్టిలరీలు, ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ అంతా ఈసీ పర్యవేక్షణ కిందకు వచ్చాయి. విజయవాడలో ఎక్సైజ్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. డిస్టిలరీలు, బ్రూవరీలు, బెవరేజస్ కార్పొరేషన్‌కు చెందిన మద్యం డిపోలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా మద్యం సరఫరా, విక్రయాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సమకూర్చలేమని భావించిన బాబు.. పొరుగు రాష్ట్రాలపై కన్నేశారు. తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ పెద్దల అండదండలతో ఈ కుట్రకు తెరతీశారు. తక్కువ ధర ఉండే నాసిరకరమైన గోవా మద్యాన్ని భారీగా అక్కడి నుంచి తెప్పించారు. ఇలా దాదాపు రూ.వేయి కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. మద్యం మత్తుతో చిత్తుచేయండి..ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే తన కుంతంత్రాన్ని చంద్రబాబు మరోసారి తెరపైకి తెచ్చారు. పేద, దిగువ మధ్య తరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన మద్యం మాయోపాయానికి పాల్పడుతున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న ఓటర్లు ఈ సమయంలో విచక్షణా శక్తిని కోల్పోయి మద్యం మత్తులో ఉండేట్లు చేయాలన్నది ఆయన పన్నాగం. ప్రధానంగా మహిళా ఓటర్లు వైఎస్సార్సీపీకి పూర్తి అనుకూలంగా ఉండటం చంద్రబాబును హడలెత్తిస్తోంది. దాంతో పురుషులను గోవా మద్యం మత్తులో ముంచి వారితో మహిళలను బెదిరించి.. వేధించైనా సరే టీడీపీకి అనుకూలంగా మలచుకోవాలన్నది ఆయన ఎత్తుగడ. అందుకోసం నియోజకవర్గాల వారీగా పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అక్కడ అక్రమ మద్యాన్ని పంపిణీ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వీటిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఇక ఏఏ నియోజకవర్గాలకు ఏమేరకు మద్యం సరఫరా చేయాలి.. అందుకు ఏఏ మార్గాల్లో దానిని తరలించాలి.. ఎక్కడెక్కడ నిల్వచేయాలి.. ఎన్నికలకు మూడ్రోజుల ముందు మండలాలు, పంచాయతీలకు ఎలా చేర్చాలి.. అన్నదానిపై పకడ్బందీగా స్కెచ్ వేశారు. సాధారణంగా.. పోలింగ్ కోసం బూత్ కమిటీలను నియంమించడం అన్ని రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహమే. కానీ, చంద్రబాబు అందుకు అదనంగా కేవలం మద్యం పంపిణీకి ప్రత్యేకంగా కమిటీలను నియమించడం గమనార్హం. రాష్ట్రంలోకి రూ.వెయ్యికోట్ల నాసిరకం మద్యం..నాసిరకమైన గోవా మద్యం తాగితే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని తెలిసినా స రే.. పోయేవి సామాన్యుల ప్రాణాలే కదా అన్న రీతిలో చంద్రబాబు ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఆ విధంగా తెప్పించిన రూ.వేయి కోట్ల విలువైన గోవా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల మీదుగా.. కర్ణాటక నుంచి శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల మీదుగా ఏపీలోకి తరలించారు. అప్పటికే స్టాక్ పాయింట్లుగా గుర్తించిన టీడీపీ నేతల నివాసాలు, వ్యాపార సంస్థల గిడ్డంగుల్లోకి వాటిని చేర్చారు. పోలింగ్‌కు ఎక్కువ సమయం లేనందున ఆ గిడ్డంగుల నుంచి మండలాలు, పంచాయతీల వారీగా పంపిణీ మొదలుపెట్టారు. -
ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత?
మైసూర్: ఎన్నికలు మొదలయ్యాయంటే.. బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ నాయకులు తమవంతు ప్రయత్నాలు భారీగానే చేస్తారు. ఇప్పటికే దేశం మొత్తం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. భారీ నగదు, లేదా లిక్కర్ తరలించడం చట్టరీత్యా నేరం. పలు ప్రాంతాల్లో లెక్కకు మించిన డబ్బు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో భారీ లెవల్లో ఇల్లీగల్ లిక్కర్ పట్టుబడినట్లు తెలుస్తోంది. చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మైసూర్ జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం ఆకస్మికంగా సందర్శించింది. ఈ ఆపరేషన్‌లో మైసూర్ డివిజన్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో ఈ భారీ అక్రమ మద్యం నిల్వలు ఘటన పెద్ద సంచలంగా మారింది. ఇప్పటికే సుమారు 14 వేలకు పైగా బాక్సులు కేరళకు చేరుకున్నాయని, 7,000 బాక్సులు మాత్రమే సోదాల్లో కనుగొన్నారని తెలుస్తోంది. అక్రమ రవాణా & హోర్డింగ్ వంటి వాటికి పాలపడిన కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. Based on a tip-off, excise department officials made a high-stakes raid on United Breweries Limited in Nanjangud taluk of #Mysuru, unearthing an astonishing stash of illegal liquor valued at a jaw-dropping Rs. 98.52 crore. This shocking discovery, coinciding with the fervor of… pic.twitter.com/Q1QjgA4Hbb — Karthik K K (@Karthiknayaka) April 4, 2024 -
అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాగానే బెల్టుషాపుల్ని రద్దు చేస్తామని, అక్రమ మద్యం ప్రభావాన్ని ఉక్కుపాదంతో అణచివే స్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయం కోసం బీఆర్ఎస్ సర్కారు గ్రామగ్రామనా ఇష్టారాజ్యాంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఇప్పటికే దివాళా తీసిందని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ చేతికి చిప్ప మిగులుతుందని ప్రజలకు అర్ధం అయిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభు త్వాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వికా రాబాద్ జిల్లా పరిగికి చెందిన వన్నె ఈశ్వరప్పతో పాటు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు కిషన్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోతారని ప్రజలకు తెలుసునని, 2014, 2018లో అమ్ముడుపోయిన విషయం ప్రజలకు గుర్తుందని చెప్పారు. కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్ బలిపశువులు కేసీఆర్ ఆటలో రేవంత్, హరీశ్‌రావు బలి పశువులు కాబోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీశ్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అని సీఎం పదవి కోసమే ఆ ఇద్దరూ కొట్టుకుంటున్నారనే టాక్ నడుస్తోందన్నారు. కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదన్నారు. ‘ౖకాంగ్రెస్ లిస్ట్ ఇంకా ప్రగతి భవన్ లో ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30 మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోదముద్ర వేసినాక ఢిల్లీకి పోతది. పాపం రేవంత్ రెడ్డికి తెల్వదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎట్లైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నయ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో హరీషన్న, కాంగ్రెస్‌లో రే వంతన్న బలిపశువులు కాబోతున్నరు.’’ అని పే ర్కొన్నారు. డా. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ రెడ్డిలకు లేదన్నారు. రాజకీయంగా బీసీల అభ్యున్నతికి బీజేపీనే పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. -
తెలుగు తమ్ముళ్ల మద్యం దందా
నంద్యాల: మద్యం అక్రమ రవాణాను టీడీపీ నాయకుల వదులుకోలేకపోతున్నారు. తరచుగా పోలీసులకు పట్టుబడుతున్నా వారి తీరు మారడం లేదు. ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈనెల 5వ తేదీన ప్యాపిలి పట్టణానికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బోరెడ్డి అభిలాష్ రెడ్డి తన ఐదుగురు అనుచరులతో కలిసి బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమ మద్యంతో సెబ్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా బండారు రవి తప్పించుకు పోయారు. గత ఏప్రిల్ నెలలో అనంతపురం జిల్లా మడకశిర పోలీసులకు కూడా అభిలాష్‌రెడ్డి కారులో కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇతనిపై సెబ్ పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై తిరిగొచ్చి మళ్లీ అక్రమ మద్యం దందానే కొనసాగిస్తున్నాడు. రిమాండ్‌కు తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ఎస్ రంగాపురం వద్ద సెబ్ పోలీసుల కళ్లు గప్పి ఈనెల 5వ తేదీన తప్పించుకుపోయిన బండారు రవి డోన్ మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇతను మంగళవారం సెబ్ పోలీసులకు పట్టుబడటంతో రిమాండ్‌కు తరలించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు తెలుగుతమ్ముళ్లు అక్రమ మద్యం వ్యాపారంలో కొనసాగుతుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌తో పాటు అనేక మంది ఆ పార్టీ నాయకులు ఉడుములపాడు గ్రామంలో కల్తీ మద్యం తయారు కేంద్రాన్ని నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చింత చచ్చినా పులుపు చావదనే చందంగా ఆ పార్టీ నాయకులు తమ పాత పద్ధతులను మానుకోక పోవడంపై స్థానిక ప్రజలు అసహ్యించుకుంటున్నారు. -
చేతి పంపు నుంచి బకెట్ల కొద్ది మద్యం.. ఎక్కడో తెలుసా?
భోపాల్: ఎక్కడైనా చేతి పంపు కొడితే తాగు నీరు రావడం సహజమే. కానీ చేతి పంపులో నుంచి మద్యం రావటం ఎప్పుడైనా చూశారా? అవునండీ.. అది నిజమే. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలో చేతి పంపు కొట్టగానే అందులోంచి మద్యం వచ్చింది. నాటుసారా తయారు చేసే ముఠా మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. నాటుసారా తయారీపై సమాచారం మేరకు గునా జిల్లాలోని భన్‌పుర గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో కనిపించిన ఈ దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రామ శివారులోని ఇళ్లకు కొద్ది దూరంలో నాటుసారా నింపిన డ్రమ్ములను భూమిలోపల పాతిపెట్టారు. వాటికి పైపును అమర్చడం ద్వారా నేల పైన చేతి పంపును ఏర్పాటు చేశారు. దాన్ని చేత్తో కొడుతూ క్యాన్లలో మద్యాన్ని నింపి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఇటీవల దాడి చేసిన పోలీసులు సారా మాఫియా అతి తెలివి చూసి నివ్వెరపోయారు. అక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ నాటుసారా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రమ్ముల కొద్దీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ భూమిలో దాచిపెట్టిన నాటుసారా డ్రమ్ములకు చేతి పంపు ఏర్పాటు చేశారు. పోలీసులు చేతిపంపును కొట్టడంతో నాటుసారా పైకి వచ్చింది. లిక్కర్‌ను తీసుకునేందుకు వారు చేతిపంపును ఉపయోగిస్తున్నారు. దానిని ప్లాస్టిక్ క్యాన్లు, కవర్లలో నింపి డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.’ అని గునా ఎస్పీ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. शराब माफिया का दिमाग हैंडपम्प से निकली शराब गुना के भानपुरा का मामला #Guna #HandPump #Viral #Trending pic.twitter.com/eRm8H1t1wN — LALIT K PRAJAPATI (@prajapatilalit) October 11, 2022 ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..) -
ప్రకాశం జిల్లాలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన పోలీసులు
-
88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..
రాయచోటిటౌన్: అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!) -
నడిగడ్డ.. నకిలీ లిక్కర్ అడ్డా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్ రీసైక్లింగ్‌తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ముఠా పట్టుబడిందిలా.. రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కహాల్) లోడ్‌తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్‌ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్ డబ్బా, 50 ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాల కాటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్‌గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బాబుగౌడ్ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. 8 మంది అరెస్టు.. నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజుగౌడ్ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కీలక ప్రజాప్రతినిధి అండతో..! నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి స్పిరిట్.. గుట్టుగా బెల్టుషాపులకు.. గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కాహాల్) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్ ఈ స్పిరిట్ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్‌గౌడ్, లోకేశ్ గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు ఆ స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్‌షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్‌షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు. నకిలీ మద్యం తయారీ ఇలా.. కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్ లిక్కర్ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. -
బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28వ తేదీన మొదటి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 3, ఏడవ తేదీల పోలింగ్‌తో ఈ ఎన్నికలు ముగుస్తాయి. నవంబర్ పదవ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 2005 నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్న జేడీయూ నాయకుడు నితీష్ కుమార్‌కు ఈసారి ప్రజా వ్యతిరేకత పెరిగింది. మద్య నిషేధ చట్టం (బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం –2016)ను ప్రవేశ పెట్టడం కూడా ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకొస్తున్న స్మగ్లర్లకన్నా మద్యం సేవించిన వారిని, మద్యం కలిగి ఉన్న ప్రజలను అరెస్ట్ చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2020, ఆగస్టు నెల వరకు 1580 రోజుల్లో రోజుకు సగటున 190 మంది చొప్పున 3,06 ,000లక్షల మంది మద్యం ప్రియులను రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. వారిలో 66, 657 మంది ఎక్సైజ్ సిబ్బంది కూడా ఉన్నారు. (లాలూకి బెయిల్.. నితీష్‌కు ఫేర్వల్ ) మద్య నిషేధ చట్టం కింద అరెస్టయిన 3,06 లక్షల మందిలో 90 శాతం మంది దళితులు, మహా దళితులే ఉన్నారు. రాష్ట్రంలోకి ఏరులై పారుతున్న అక్రమ మద్యాన్ని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్న బిహార్ అధికారులు అన్యాయంగా వాటిని మూడింతలు ఎక్కువ ధరలకు మద్యం కొంటున్న వినియోగ దారులను అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా పాశవికమైన ఈ మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఆరేజేడీ, మూడు వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేస్తోంది. నితీష్ కుమార్ జేడీయూతో కలసి బీజేపీ పోటీ చేస్తోంది. మద్యం ప్రియులు బాహాటంగా నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని నితీష్ విమర్శలు గుప్పిస్తున్నారు. (ఉల్లి ధరలపై వినూత్న నిరసన ) -
భారీగా అక్రమ మద్యం పట్టివేత
సాక్షి, గుంటూరు : ఇతర రాష్ర్టాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నిందితులను పోలిసులు అరెస్ట్ చేశారు. శావల్యాపురం మండలం కారుమంచిలో భారీగా మద్యం పట్టుబడింది. గ్రానైట్ లారీల ద్వారా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, గోవా రాష్ట్రాల నుంచి తెచ్చిన 4,764 బాటిళ్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.13.58 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అక్రమ మద్యం, ఇసుకపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుపై పీడీ చట్టం ప్రయోగిస్తామన్నారు. ప్రజలు సహకరించి అక్రమమద్యంపై సమాచారం ఇవ్వాలని కోరారు. (త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్) -
ఎస్ఐ సాహసం
-
పులివెందుల ఎస్ఐ సాహసం
సాక్షి, పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందుల ఎస్ఐ విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని ఎస్ఐ గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా పట్టుకున్నారు. పులివెందులలోని రాఘవేంద్ర థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన ఆపిఉన్న ఓ వాహనంలో అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వాహనాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలో ఉన్నవారు కారును ముందుకు, వెనక్కి నడుపుతూ వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ కారు పైకి ఎక్కి గట్టిగా పట్టుకునేందుకు యత్నించినా, కారులో ఉన్న దుండగులు మాత్రం ఆగకుండా రెండు కిలోమీటర్లు వరకూ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అయినా ఎస్ఐ గోపీనాథ్ రెడ్డి ఏమాత్రం పట్టు సడలకుండా కారు ముందు భాగంవైపు అద్దాన్ని పట్టుకునే ఉన్నారు. మరోవైపు ఇంకో పోలీసు వాహనంలో అక్కడకు చేరుకున్న సిబ్బంది మద్యం ముఠాను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ ధైర్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి. దుండగుల్ని అదుపులోకి తీసుకుని, 80 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. -
బీజేపీ నేత అంజిబాబు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది. కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసింది. -
సారాకు బై.. ప్రగతికి జై..
-
టీడీపీ నేతల హైడ్రామా
-
టీడీపీ నేత ఇంట్లో అక్రమ మద్యం పట్టివేత
సాక్షి, కృష్ణా: టీడీపీ నాయుకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని కాటూరులో ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో అక్రమ మద్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఆ నేత ఇంట్లో నుంచి 105 మద్యం బాటిళ్లను స్వాధినం చేసుకున్నట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. ఇక అక్రమ మద్యం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఉయ్యూరులో టీడీపీ నేతలు హైడ్రామా సృష్టించారు. పోలీసు స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు బోడె ప్రసాద్, వైవిబి రాజేంద్రప్రసాద్ ధర్నాకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ.. మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో శ్రీదుర్గ బార్‌పై కేసు నమోదు..
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎల్ఎన్ నగర్‌లోని దుర్గ బార్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. మొత్తం 26 మద్యం బాటిల్స్‌ను అధికారులు సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వైన్ షాప్‌లు, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక రేట్లకు అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. -
కారులో మద్యం బాటిల్స్ పట్టుకున్న కలెక్టర్
సాక్షి, ఆదిలాబాద్ : పట్టణ ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అందులో ఆదిలాబాద్ పట్టణంలోనే ఏడుగురికి కరోనా సోకడంతో రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలో ఆంక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వయంగా గల్లీ గల్లీ తిరుగుతూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ లోని వినాయక్ చౌక్‌లో కలెక్టర్ పర్యటించి వాహనాలు తనిఖీ పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో భాగంగా తలమాడుగు మండలంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ గా పనిచేస్తున్న భీమన్న వాహనంలో పోలీసులు మద్యం సీసాలు గుర్తించారు. లాక్డౌన్ సందర్భంగా మద్యం షాపులు బంద్ కొనసాగుతున్న తరుణంలో 8 క్వార్టర్ బాటిల్స్ తో దొరకడంతో భీమన్న కారును పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు. -
కారులో మద్యం బాటిల్స్ పట్టుకున్న కలెక్టర్
-
సీసెడు తాగినందుకే సోయి తప్పుతున్నారు
జిల్లా కేంద్రంలోని ఓ కల్లు దుకాణంలో కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందాడు. కల్తీ కల్లు తాగడం వల్లే అతడు మరణించాడని బంధువులు ఆందోళన చేశారు. కల్లు విక్రయదారులు వారిని సముదాయించి, కొంత పరిహారం చెల్లించి, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. సమీపంలోని మరో కల్లు దుకాణం నిర్వాహకులనుంచి కూడా కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు సమాచారం.. కన్న కూతురిపైనే అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ తండ్రికి సంబంధించిన ఘటన ఇటీవల మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ప్రతిరోజూ మత్తుపదార్థాలు కలిపిన కల్లును సేవించడం, తన కుటుంబ సభ్యులకు కూడా తెచ్చి ఇవ్వడం చేసేవాడని తెలిసింది. జరిగిన దారుణానికి కల్తీకల్లు సేవించడం కూడా కారణమేనని భావిస్తున్నారు . సాక్షి, కామారెడ్డి : జిల్లాలో 22 కల్లు డిపోలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో రెండు కల్లు తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణంలో 14 కల్లు దుకాణాలు ఉండగా చుట్టు పక్కల గ్రామాల్లోని కొన్ని కల్లు దుకాణాలకు సైతం జిల్లా కేంద్రంలోని కల్లు తయారీకేంద్రాలనుంచే కల్లును సప్లయ్ చేస్తున్నారు. ఈత, తాటి చెట్ల నుంచి తీసే కల్లును నామమాత్రంగా కలుపుతారు. క్లోరోఫాం, డైజోఫాంలాంటి మత్తు పదార్థాలను కలుపుతూ కల్తీ కల్లు తయారు చేసి, విక్రయిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. కల్లు విక్రయాలను పెంచుకోవడానికి మత్తు పదార్థాలను ఎక్కువ మొత్తంలో కలిపి అమ్ముతున్నారని తెలుస్తోంది. హైడోస్ కల్లుకు జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాలకు పెట్టింది పేరు.. దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, సిరిసిల్లరోడ్, అంగడిబజార్, హైదరాబాద్ రోడ్, చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో కల్తీకల్లు విక్రయాలు ఎక్కు వగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా దుకాణాల్లోనూ కల్తీ కల్లు అమ్ముతున్నారు. వీధిన పడుతున్న కుటుంబాలు కల్తీకల్లు కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కల్లుకు బానిసలవుతూ ఎంతోమంది కుటుంబాలను పట్టించుకోవడం లేదు. పొద్దంతా పని చేయగా వచ్చే డబ్బులను కిక్కు కోసమే ఖర్చు చేస్తున్నారు. దీంతో కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గొడవలు నిత్యం పోలీస్ స్టేషన్ల వరకు వస్తున్నాయి. కొన్ని ఆత్మహత్యలు, హత్యలకు మత్తుపదార్థాలతో కల్తీ చేసిన కల్లే కారణమవుతుండడం గమనార్హం. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు.. కామారెడ్డిలో విక్రయిస్తున్న కల్లులో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు విక్రయాలు పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇలాంటి హైడోస్ కల్లును సేవిస్తూ ఎంతో మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే కనిపిస్తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారు ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే కల్తీ కల్లు విక్రయాలను అడ్డుకోవడం లేదని తెలుస్తోంది.