భీమిని (ఆదిలాబాద్): అక్రమంగా రవాణా చేస్తున్న రూ.1.50 లక్షల విలువైన మద్యాన్ని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. భీమిని మండలం వీగామ్ గ్రామం వద్ద ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న మద్యం వెలుగు చూసింది. అనుమతి లేకపోవడంతో మద్యాన్ని సీజ్ చేసి బెల్లంపల్లి జూనియర్ సివిల్‌జడ్జి కోర్టుకు స్వాధీనం చేశారు.