హైదరాబాద్‌లో శ్రీదుర్గ బార్‌పై కేసు నమోదు.. | Case Has Been Registered On Sri Durga Bar And Restaurant In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో శ్రీదుర్గ బార్‌పై కేసు నమోదు..

Published Sun, May 3 2020 4:49 PM | Last Updated on Sun, May 3 2020 5:17 PM

Case Has Been Registered On Sri Durga Bar And Restaurant In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎల్‌ఎన్‌ నగర్‌లోని దుర్గ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. మొత్తం 26 మద్యం బాటిల్స్‌ను అధికారులు సీజ్‌ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వైన్‌ షాప్‌లు, బార్‌లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక రేట్లకు అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement