గ్లాసు సారా రూ.20..! | Illegal Liquor Sales In Vizianagaram District | Sakshi
Sakshi News home page

గ్లాసు సారా రూ.20..!

Published Mon, Dec 9 2019 11:00 AM | Last Updated on Mon, Dec 9 2019 11:00 AM

Illegal Liquor Sales In Vizianagaram District - Sakshi

సారా తరలింపు ఇలా​ ‍ - సారా మత్తులో జోగుతున్న భర్తను చూస్తూ విలపిస్తున్న గిరిజన మహిళ, పక్కనే ఉన్న పిల్లలు

సాలూరు: రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధానికి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించింది. మద్యం ధరలు పెంచి అమ్మకాలకు కట్టడివేసింది. ఇప్పుడు.. ఈ నిర్ణయాన్ని సారా వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. సారా ధరలను అమాంతం పెంచేశారు. ఇన్నాళ్లూ  రూ.10 పలికిన గ్లాసు సారా ఇప్పుడు రూ.20కి పెంచేశారు. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుని గిరిజన గ్రామాల్లో గుట్టు చప్పుడుగా విక్రయిస్తున్నారు. తెలిసిన వారికి, నిరి్ధష్ట వేళల్లో (ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య, రాత్రి కూడా అదే సమయంలో) మాత్రమే అమ్మకాలు సాగిస్తున్నారు.

వలంటీర్లకు బెదిరింపులు
గ్రామాల్లో అక్రమ బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నా, సారా విక్రయాలపై  పోలీసులు, ప్రొహిబిషన్‌ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఈ సమాచారాన్ని వలంటీర్లే అధికారులకు చేరవేస్తున్నారని బెల్ట్‌షాపులు, సారా విక్రయదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాచిపెంట మండలంలోని గురివినాయుడుపేట గ్రామంలో ఈ విషయంపై వలంటీర్లుపై బెదిరింపులు రాగా వారు పోలీసులను ఆశ్రయించారు. వలంటీర్లకు అండగా ఎస్‌ఐ గంగరాజు నిలబడి చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని, వలంటీర్లపై బెదిరింపులకు పాల్పడితే  సహించేది లేదని సదరు బెల్ట్‌షాప్‌ నిర్వాహకులకు హెచ్చరించారు.  పట్టణంలోని ఓ వార్డులో ఈ మాదిరి సంఘటనలే జరిగాయి. అయితే, పోలీసులు మాత్రం దాడులు కొనసాగిస్తున్నారు. గతనెల 18న  పాచిపెంట మండలం కంకణాపల్లి   సమీపంలో సారా బట్టీలపై దాడులుచేసి సుమారు  2  వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పద్మాపురం, చాపరాయివలస  తదితర గ్రామాల్లో దాడులు చేసి విక్రయదారులపై  కేçసులు నమోదు చేశారు.

ఒడిశా నుంచి దిగుమతి...  
సారా ముడిసరుకు అమ్మోనియా, నల్ల బెల్లం తదితర పదార్థాలు ఒడిశా నుంచి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. పాచిపెంట మండలానికి ఒడిశా నుంచి లారీ ట్యూబ్‌లలో సారాను తీసుకువస్తున్నారు. కొందరు వ్యాపారులు మా త్రం నల్లబెల్లాన్ని నిశిరాత్రి వేళ సాలూరు పట్ట ణం నుంచి తరలిస్తున్నట్టు భోగట్టా. తయారైన సారాను పాచిపెంట మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు పరిసర ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లోను, సాలూరు మండలంలోని నార్లవలస, కురుకూటి, కందులపదం, తోణాం, సారి క  తదితర  పంచాయలీల్లోని  పలు గ్రామాల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం.

సారాకు బలవుతున్న మధ్య, పేదతరగతి కుటుంబాలు..  
సారా తయారీలో అమ్మోనియం అధిక శాతం వినియోగించడం, మత్తు ఎక్కించే పదార్థాలు వాడుతున్నారు. ఇది తాగిన వారు కొద్ది సేపటికే స్పృహ కోల్పోతున్నారు. నెలల్లోపై అనారోగ్యానికి గురవుతున్నారు. సారాకు ఎక్కువుగా పేద, మధ్యతరగతి కుటుంబాలవారు బలవుతున్నార ని వైద్యులు చెబుతున్నారు. కొందరు తక్కువ వయసులోనే మరణిస్తున్నారని, సారాకు దూరంగా ఉండాలని కోరుతున్నారు.  

అవగాహన కల్పిస్తున్నాం..
సారా తయారీ, విక్రయాలు చేయవద్దని జాగృతి కార్యక్రమం ద్వారా  ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. తరుచూ దాడులు జరుపుతూ బెల్లం ఊటలను ధ్వంసం చేస్తున్నాం. నిబంధనల మేరకు  కేసులు నమోదు  చేస్తున్నాం. 
– ఎం.విజయలక్ష్మి,సాలూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సీఐ (94409 02374)

 ధ్వంసం చేశాం..
ఇటీవల కంకణాపల్లి సమీపంలో సారా బట్టీలపై  దాడులు  చేశాం.  2 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశాం. పద్మాపురం, చాప రాయివలస తదితర  గ్రామాల్లోనూ వరుస దాడులు చేశాం. గురివినాయుడుపేటలో   అక్రమ  మద్యం విక్రయాల సమాచారం వలంటీర్లే ఇస్తున్నారని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలియడంతో గ్రామంలో అవగాహన కలి్పంచాం. హెచ్చరికలు జారీ చే శాం. సారా తయారు చేసినా, విక్రయించినా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.  
– గంగరాజు, ఎస్‌ఐ, పాచిపెంట  (91211 09474)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement