Seized Liquor Bottles Crushed Under Road Roller In Rayachoti - Sakshi
Sakshi News home page

88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..

Published Wed, Jun 15 2022 3:40 PM | Last Updated on Mon, Sep 5 2022 1:41 PM

Seized Liquor Bottles Crushed Under Road Roller In Rayachoti - Sakshi

రోడ్డు రోలర్‌తో మద్యం సీసాల ధ్వంసం

రాయచోటిటౌన్‌: అక్రమ మద్యంపై పోలీస్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.  గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. 

అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని  తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్‌స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్‌ అధికారులు, ఎక్సైజ్‌ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్‌: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement