సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్‌రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు.
బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్ బాషా
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు.
మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్‌ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని అంజాద్ బాష ప్రశంసించారు.
రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్
వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్‌సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment