రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం | Ongole: Seized Liquor Bottles Worth Rs 2 Crore Crushed Under Road Roller | Sakshi
Sakshi News home page

రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం

Published Thu, Jun 16 2022 4:21 PM | Last Updated on Mon, Jun 27 2022 4:34 PM

Ongole: Seized Liquor Bottles Worth Rs 2 Crore Crushed Under Road Roller - Sakshi

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్‌ సమక్షంలో ధ్వంసం చేశారు.

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్‌ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లు, ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్‌: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement