
చెక్కు అందజేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు.
ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’
Comments
Please login to add a commentAdd a comment