Malika Garg
-
పల్నాడులో 144 సెక్షన్ ముగిసింది
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేశ్ బి. లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఎస్పీ మలికా గార్గ్, జేసీ శ్యాంప్రసాద్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని, శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో ఆ నిబంధన ఎత్తేశామని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు మాత్రం పోలీసుల అనుమతి తప్పనిసరి అని అన్నారు. కౌంటింగ్ తరువాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ సమయంలో గొడవలతో జిల్లాకు మచ్చ పడినప్పటికి, కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి జిల్లాకు తిరిగి మంచిపేరు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో 13,739 మంది సిబ్బంది, కౌంటింగ్‌లో 2,136 మంది పాల్గొన్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో 86.5 శాతం ఓటింగ్ నమోదు చేసిన ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు.దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్ కౌంటింగ్ ముగిసిన తరువాత జిల్లాలో అక్కడక్కడా గొడవలు జరుగుతున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. గత రెండు రోజుల్లో గొడవలకు దిగిన వారిపై 46 కేసులు నమోదు చేసి, 140 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రభుత్వ భవానాలపై రంగులు, విగ్రహాలు నచ్చకపోతే స్థానిక సంస్థలలో తీర్మానాలు చేసి అధికారికంగా మార్చాలని, చట్టాలను చేతుల్లోకి తీసుకోరాదన్నారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. గ్రామాలలో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గొడవలు జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలింగ్ సమయంలో జిల్లాలో 168 కేసులు నమోదు చేసి 1,338 మందిని అరెస్ట్ చేశామని, త్వరలో ఛార్జిïÙట్లు వేసి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. -
పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
-
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్‌లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్‌పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్‌లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించం
ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో ఏ పార్టీ వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. 20 రోజుల క్రితం వేరే కేసులో ఒంగోలు తాలూకా పోలీసులు తనిఖీ చేస్తుంటే అక్కడ నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు బయటపడ్డాయని, అప్పటి నుంచి వేగంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. తనతో పాటు కలెక్టర్ ఏఎస్ దినే‹Ùకుమార్‌తో కూడా ఈ కేసు విషయంపై బాలినేని స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా, చివరకు తన అనుచరులున్నా సరే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని కూడా బాలినేని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రాబల్యం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా పోలీస్ అధికారులకు తెచ్చివ్వాలని సూచించారు. అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే మాత్రం సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ‘కేసులో వేలకొలది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 130 డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో నకిలీవి ఎన్ని, అసలు డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయో అటు రెవెన్యూ, ఇటు రిజి్రస్టేషన్ల శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం, మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. తొలుత దర్శి డీఎస్పీతో సిట్ ఏర్పాటు చేశామని, కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంగోలు ఏఎస్పీ కే.నాగేశ్వరరావుకు కేసును అప్పగిస్తూ అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. -
హలో.. జాగ్రత్త!
ఒంగోలు టౌన్: మోసపూరిత టోల్‌ఫ్రీ నంబర్లతో కస్టమర్ సపోర్ట్ స్కాములపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మలికా గర్గ్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి సమాచారం కోసమైనా గూగుల్ సెర్చ్ చేస్తున్న ఈ రోజుల్లో మోసగాళ్లు తెలివిగా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారని తెలిపారు. వివిధ సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు, సర్వీస్ సెంటర్ వివరాల కోసమే కాకుండా వివిధ కస్టమర్ కేర్ నంబర్ల కోసం కూడా గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధరణంగా మారిందన్నారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు వివిధ బ్యాంకులు, ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లను పోలిఉండేలా ఫేక్ వెబ్సైట్లను తయారు చేసి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టిస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్యపై కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సేకరించి క్షణాల్లోనే డబ్బు దోచేస్తున్నారని వివరించారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రతగా ఉండాలన్నారు. ఈ జాగ్రతలు పాటించండి ► ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు సంబంధించిన యాప్ లేదా అధికారిక సైట్లో మాత్రమే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేయాలి. ► గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో లేదా ట్రూ కాలర్ లాంటి యాప్స్‌లో కస్టమర్ కేర్ సంప్రదింపుల కోసం సెర్చ్ చేయవద్దు. ► కాల్ సెంటర్ నుంచి ఎవరైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్లు, పిన్, ఓటీపీలు అడిగితే పొరపాటున కూడా ఇవ్వరాదు. బ్యాంకింగ్ సంస్థలు ఎప్పుడూ మీ వివరాలను అడగవు. ►రీఫండ్ వస్తుందని కొన్ని కాల్‌సెంటర్ల నుంచి ఓ లింక్ పంపించి దానిపై క్లిక్ చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ, పాస్వర్డ్ తదితర వివరాలు నమోదు చేయాలని అడిగితే అసలు చేయవద్దు. ► ఈ తరహా సైబర్ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. -
రూ.2.14 కోట్ల విలువైన మద్యం బాటిళ్ల ధ్వంసం
ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను బుధవారం ఎస్పీ మలికాగర్గ్ సమక్షంలో ధ్వంసం చేశారు. ఒంగోలు నగరం దక్షిణ బైపాస్‌లోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన కింద అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ మొత్తంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. మొత్తం రూ.2.14 కోట్ల విలువైన 42,810 బాటిళ్లను ధ్వంసం చేశారు. (క్లిక్: 88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..)