మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా: మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ధారూరు మండలానికి చెందిన కిషన్, బాబూనాయక్, కమానాయక్, తారాబాయి, తిర్మలయ్యలు సమీప తండాలలో అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. తహశీల్దార్ శ్రీనివాస్ సమక్షంలో వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. తహశీల్దార్ శ్రీనివాస్ నిందితులకు రూ.లక్ష చొప్పున పూచీకత్తు తీసుకుని విడుదల చేశారు.