money looted
-
దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం!
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్ ఆన్లైన్లో పోకర్(పేకాట) గేమ్ ఆడి 1 మిలియన్ యూరోలు(భారత కరెన్సీలో దాదాపు రూ. 9 కోట్లు) పోగొట్టుకోవడం ఆసక్తి రేపింది. తన డబ్బు పోగొట్టుకోవడంతో నెయ్మర్ కన్నీటిపర్యంతం అవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొడ కండరాల గాయంతో మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటున్న నెయ్మర్ ఇంట్లోనే ఉంటుండడంతో పోకర్ గేమ్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్మర్ బుధవారం రాత్రి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో భాగంగా రూ. 9 కోట్లు పోగొట్టుకున్నాడు. అంతే తన డబ్బులు పోయాయంటూ లబోదిబో మన్న నెయ్మర్ గుక్కపట్టి ఏడుస్తుండగా వెనకాల టైటానిక్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. అయితే కాసేపటికే ఏడుపు మొహం నుంచి నవ్వు మొహంలోకి మారి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా కేవలం సరదా కోసమే అంటూ క్యాప్షన్ జత చేశాడు. పేకాటలో డబ్బులు పోవడం, రావడం సహజం. ఒకసారి పోతే.. మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులు రావడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత గేమ్‌లో నెయ్మర్ తాను పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన నెయ్మర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీలతో కలిసి నెయ్మర్ పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Neymar é o rei do entretenimento até fazendo live slk, o cara é foda kkkkkkkkkkkkkkkkk pic.twitter.com/EGV6C5ygP0 — Portal do Neymar 🇧🇷 | Fan account (@portaldonjr) March 28, 2023 చదవండి: అమెరికాను గెలిపించిన సాయితేజ రెడ్డి -
మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని హఫీజ్ ఇంట్లోకి మార్చి 5న(ఆదివారం) రాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.25 వేల డాలర్ల (పాకిస్థాన్ రూపాయిలో 25 డాలర్ల విలువ దాదాపు రూ.2 కోట్లు)లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. దొంగతనం జరిగే సమయంలో సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. ఈ ఆల్‌రౌండర్ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గురించి వాళ్ల అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 392 మ్యాచ్‌లు ఆడి 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డేలు, టి20ల్లో కొనసాగాడు. హఫీజ్ 2019 వరల్డ్ కప్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. -
'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'
లెజెండరీ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైన సంగతి తెలిసిందే. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టగా.. షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం డబ్బులు మాయం చేసిన సంస్థపై కోర్టులో కేసు వేయగా విచారణ కొనసాగుతుంది. తాజాగా బోల్ట్ తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై స్పందించాడు. కోట్ల రూపాయలు నష్టపోవడంతో బోల్ట్ మానసికంగా కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బోల్ట్ ఆ వార్తలను ఖండించాడు. ''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యను. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని చెప్పుకొచ్చాడు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
లింక్డిన్లో యువతి బయోడేటా.. ఉద్యోగం వస్తుందనుకుంటే నోటీసు వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నగర యువతి జాబ్ పోర్టల్ లింక్డిన్ ద్వారా సైబర్ నేరగాళ్ల వల్లోపడింది. వైద్య రంగంలో ఉద్యోగం పేరుతో నమ్మించిన సైబర్ నేరగాడు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. వీటిని వినియోగించి పలువురిని రూ.38 లక్షల మేర ముంచాడు. మరోపక్క బాధితురాలికి ‘కస్టమ్స్ కథ’ చెప్పి రూ.2.36 లక్షలు కాజేశాడు. బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న యువతి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుని... కార్వాన్ ప్రాంతంలో ఉన్న యువతి తన బయోడేటాను లింక్డిన్లో అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన సైబర్ నేరగాడు లండన్‌లో పని చేస్తున్న ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ చేశాడు. బయోడేటా పరిశీలించానని, వైద్య రంగంలో ఉద్యోగమంటూ ఎర వేశాడు. అడ్వాన్స్‌గా జీతం డిపాజిట్ చేయడానికంటూ ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్ ఖాతా వివరాలు సంగ్రహించాడు. మాయ మాటలు చెప్పి ఆమె చెక్ బుక్, డెబిట్ కార్డులు ఢిల్లీ చిరునామాకు కొరియర్ చేయించుకున్నాడు. సాంకేతిక కారణాల పేరుతో బ్యాంకునకు లింకై ఉన్న ఫోన్ నెంబర్ సైతం మార్పించి తనది జోడించేలా చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక మందిని వివిధ పేర్లతో మోసం చేసిన ఈ సైబర్ నేరగాడు వారితో డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి ఈ యువతి ఖాతా వాడాడు. తన వద్ద ఉన్న కార్డుతో ఏటీఎంల నుంచి డ్రా చేసేసుకున్నాడు. బాధితురాలి ఫోన్ నెంబర్ కూడా లింకై లేకపోవడంతో ఈ వివరాలేవీ ఆమెకు తెలియలేదు బెంగళూరు పోలీసుల నోటీసులు చూసి... ఓ సందర్భంలో తాను భారత్‌కు వస్తున్నానని, కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలో డైరెక్టర్‌గా నియమిస్తానంటూ సందేశాలు పంపాడు. ఇలా ఆమెను నమ్మించి మరో కథకు శ్రీకారం చుట్టాడు. ఓ రోజు తాను వస్తున్నానని, తనతో పాటు డబ్బు తీసుకువస్తున్నానని ఓ పెట్టె ఫొటో పంపాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులుగా కొందరు ఫోన్లు చేశారు. ఫలానా వ్యక్తి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో లండన్ నుంచి రావడంతో పట్టుకున్నామని చెప్పారు. అతడిని వదలిపెట్టడానికి ట్యాక్స్ కట్టాలంటూ అందినకాడికి వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఓ దశలో అతడు కూడా ఫోన్లో మాట్లాడి డబ్బు గుంజాడు. ఇలా రూ.2.36 లక్షలు చెల్లించిన తర్వాత ఆమెకు బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఆమె పేరుతో కన్న కెనరా బ్యాంక్ ఖాతాలో రూ.38 లక్షల లావాదేవీలు జరిగాయని, వాటిని డిపాజిట్ చేసిన వాళ్లు సైబర్ నేరాల బాధితులని, దీంతో ఖాతా ఫ్రీజ్ చేశామని అందులో ఉంది. దీని ప్రకారం ఆమెనూ నిందితురాలిగా పరిగణించాలని భావించారు. ఈ నోటీసులు చూసిన తర్వాత తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. -
భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేశ్ యాదవ్‌ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్‌కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్‌ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్లో ఉమేశ్ యాదవ్ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా' -
సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం
క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సైబర్ క్రైమ్ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్లైన్ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్ మెయిల్ స్కామ్ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్ మెయిల్ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు మెయిల్ చేశారట. ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్‌తోనే సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్‌ను టీజ్ చేసిన రోహిత్ శర్మ Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం
జమైకా దిగ్గజ అథ్లెట్.. ఒలింపియన్ ఉసెన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి. గార్డన్ తెలిపారు. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్ అకౌంట్లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్ తరపు లాయర్ గార్డన్ వెల్లడించారు. ''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని.. ప్రైవేటు పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్ట్ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్స్టన్ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్ గార్డన్ తెలిపారు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
గేమ్ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఆఫ్ చాన్స్‌గా పరిగణించే ‘కలర్ ప్రెడిక్షన్’ను ఆన్లైన్లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్‌కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్ ప్రిడెక్షన్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది. ఈ–కామర్స్ కంపెనీల పేరుతో... భారత్‌లో కలర్ ప్రెడిక్షన్ (రంగు సెలక్షన్ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్‌యున్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్‌పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేశారు. వీటి ముసుగులోనే ఆన్లైన్ గేమ్ కలర్ ప్రిడెక్షన్‌ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా సర్క్యులేట్ అయిన ఈ గేమ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది. పేమెంట్ గేట్‌వేల నుంచి.. ఈ గేమ్ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్ గేట్‌వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్ ట్రాన్స్ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్ టెక్నాలజీస్, ఆర్చీవర్స్ బిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్‌లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్బీఐ, ముంబైలోని నారీమన్ పాయింట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ రహేజా సెంటర్లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు. -
చనిపోయిన భర్త అకౌంట్ నుంచి రూ.34 లక్షలు మాయం
సాక్షి,హిమాయత్‌నగర్: ఇటీవల కోవిడ్‌తో చనిపోయిన తన భర్త అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనట్లు మెహదీపట్నంకు చెందిన నజియా సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చనిపోయిన సమయంలో భర్త ఫోన్, వాలెట్ కనిపించలేదని, అదే సమయంలో హాస్పిటల్‌కు ఖర్చు బెట్టిన డబ్బులను లెక్క చూసేందుకు బ్యాంకు స్టేట్మెంట్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూస్తుండగా.. భర్త అకౌంట్లో నుంచి రూ.34లక్షల నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు స్పష్టమైంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నజియా పోలీసులను ఆశ్రయించింది. లాటరీ పేరుతో రూ.2లక్షలు.. మీకు ఖరీదైన కారు బహుమతిగా వచ్చిందంటూ వట్టపల్లికి చెందిన అజారుద్దీన్‌కు స్నాప్‌డీల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇందుకు గాను మీరు రూ.2లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఖరీదైన కారు ఉచితంగా వస్తున్నప్పుడు రూ.2లక్షలు పెద్ద విషయం కాదంటూ అతడు చెప్పిన బ్యాంకు ఖాతా లకు బదిలీ చేశాడు. రోజులు గడుస్తున్నా కారు ఇవ్వకపోగా.. ఫోన్లో స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫ్రెండే కదా అని రూ.2లక్షలు పంపాడు.. యూఎస్‌లో ఉంటున్న రమేష్ అనే స్నేహితుడి నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సురేష్‌బాబుకు మెసేజ్ వచ్చింది. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నాను ఈ మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్‌కు రూ.2లక్షలు పంపమన్నాడు. స్నేహితుడే కదా అని ఏ మాత్రం క్రాస్‌చెక్ చేసుకోకుండా అడిగిన రూ.2లక్షలను సురేష్‌బాబు ఆ బ్యాంకు ఖాతాలకు పంపడం జరిగింది. ఆ తర్వాత రమేష్‌న ఫోన్లో అడగ్గా.. నేనేమీ నిన్ను అడగలేదని, నువ్వు ఎవరికి పంపావో నాకు తెలీదనే సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించి సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్‌ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్‌ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్‌ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్‌లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్‌లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
500 నోటు పడేసి రూ.1.50 లక్షలు దోచేశారు
మైసూరు: రూ.500 నోటు కింద పడేసిన దుండగులు ఓ వ్యక్తిని ఏమార్చి రూ.1.50 లక్షలు దోచుకొని ఉడాయించారు. ఈ ఘటన మైసూరు జిల్లా, కే.ఆర్. నగర్లో చోటుచేసుకుంది. హుణసూరులోని కల్కుణికె గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి కేఆర్ నగర్లోఉన్న నగర అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. తర్వాత సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి పని ముగించుకున్నాడు. సీ.ఎ. రోడ్డులోని శ్రీహోటల్లో టీ తాగుతుండగా అతన్ని వెంటాడిన దుండగులు అక్కడకు వచ్చారు. కింద రూ.500 నోటు పడేశారు. ఆ నోటు మీదేనా? అని గణేష్‌ను అడిగారు. నోటు తీసుకుంటుండగా దుండగులు గణేష్ చేతిలోని నగదు సంచి లాక్కొని బైక్‌పై ఉడాయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేఆర్‌నగర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు
టీ.నగర్ : ఆడగొంతుతో మాట్లాడి రూ.36 లక్షలు మోసగించిన నైజీరియా యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై కీల్పాక్కంకు చెందిన జోసెఫ్ (48), రాయల్ ట్రేడింగ్ పేరిట సంస్థ నడుపుతున్నాడు. తన ఫేస్బుక్ పేజీలో వ్యాపార వివరాలను పొందుపరిచారు. దీన్ని గమనించిన లండన్‌కు చెందిన ఎలిజబెత్ అనే మహిళ మెసెంజర్ ద్వారా జోసెఫ్‌ను సంప్రదించి పరిచయం పెంచుకుంది. ముంబైలో రక్త క్యాన్సర్‌ను నయం చేసే ఫోలిక్ ఆయిల్ లభిస్తున్నట్లు దీన్ని కొని పంపితే నగదు చెల్లిస్తానని నమ్మబలికింది. రూ. 36 లక్షల ఫోలిక్ ఆయిల్ పంపితే ఇందుకు రూ.6 లక్షలు కమిషన్‌గా అందజేస్తానని తెలిపింది. సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని కోరింది. దీంతో జోసెఫ్ మెసెంజర్ ద్వారా సునీతతో మాట్లాడగా తన బ్యాంకు అకౌంట్‌కు రూ.36 లక్షలు జమ చేసినట్లయితే వెంటనే ఫోలిక్ ఆయిల్ పంపుతానని తెలిపారు. జోసెఫ్ ఆమె ఖాతాకు రూ.36 లక్షలు చెల్లించి సునీత, ఎలిజబెత్‌ల కోసం ఫోన్లో సంప్రదించగా వారు స్విఛాప్ చేసివున్నారు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న జోసెఫ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముంబైలో మోసం జరిగినట్లు తెలిసింది. -
రిక్వెస్ట్ పెట్టి దోచేస్తారు.. ఇది ఆ గ్యాంగ్ పనేనా
‘ఇన్నాళ్లూ మీ ఫోన్ నంబరుకు లాటరీ తగిలిందనో.. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది.. వెంటనే మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలనో.. ఫోన్ చేస్తూ మోసం చేసిన నేరగాళ్ల గురించి విన్నాం. ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. స్నేహితుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇలాంటి నేరాలు ఎన్నో వెలుగు చూశాయి. వెలుగు చూడని నేరాలు ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.. సాక్షి, కడప : అనుమానం వచ్చిన వారు ఫోన్ చేసి నివృత్తి చేసుకుని మిన్నకుండిపోతుండగా, రిక్వెస్టుకు చలించిన వారు వెంటనే అకౌంటు ఎవరిదన్న విషయం చూసుకోకుండా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో ఫేక్ అకౌంట్ దారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్‌లలో ప్రముఖుల పేర ఫేక్ అకౌంట్స్ సృష్టించి అత్యవసరమంటూ డబ్బులు దోచుకుంటున్నారు. తెలిసిన వారేనన్న భ్రమతో పలువురు వారి అకౌంట్లకు డబ్బులు జమ చేసి నష్టపోతున్నారు. తీరా అసలు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. బాధితుల్లో జిల్లాలోని ప్రముఖులతోపాటు కొందరు పోలీసు అధికారులు ఉండడం గమనార్హం. సైబర్ నేరగాళ్లు ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఫేస్బుక్, వాట్సాప్‌లను గుర్తించి ఆ తర్వాత స్వల్ప మార్పులతో వారి ఫొటోలతోనే ఫేక్ అకౌంట్లను సృష్టిస్తున్నారు. వారు రెగ్యులర్‌గా చాట్ చేస్తున్న స్నేహితులతో కొంతకాలం చాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత అత్యవసరమని రూ. 15–30 వేల వరకు డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. సర్దుబాటు చేయలేమని చెబితే ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే డబ్బులు సర్దాలని, త్వరలోనే ఇచ్చేస్తానంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు నిజమని నమ్మి బ్యాంకు అకౌంటు నంబరు ఎవరిదన్న విషయం నిర్ధారించుకోకుండానే డబ్బులు జమ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారు ఫోన్ ద్వారా వివరాలు నిర్ధారించుకుని మిన్నకుండి పోతున్నారు. డబ్బు అడిగిన వారు పది మందికి తెలిసిన ప్రముఖులుగా ఉండడం, ఫాలోయర్స్ ఎక్కువగా ఉండడంతో కొందరు స్పందించి తక్షణమే ఫేక్ అకౌంట్ సృష్టించిన వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఆలస్యంగా విషయం తెలుసుకుంటున్నారు. జిల్లాలో చాలామంది ఫేక్ అకౌంట్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈనెలలోనే జిల్లాలో వందలాది మంది ఫేక్ అకౌంట్ల ద్వారా దోపిడీ చేసిన సంఘటనలు ఉన్నాయి. కొందరు డబ్బులు పోగొట్టుకుని మిన్నకుండి పోతుండగా, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక నెలలోనే సైబర్ క్రైంకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1100 మంది పోలీసు అధికారులు, పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలు, పోలీసులు సైతం బాధితులుగా ఉండగా, మరోవైపు జర్నలిస్టులు, కవులు, రచయితలు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లతోపాటు వివిధ రంగాలలో ప్రముఖులుగా ఉన్న వారు బాధితులుండడం గమనార్హం. సైనికుల పేరుతో ఫేక్ అకౌంట్లు మరోవైపు సైనికుల పేరుతోనూ జిల్లాలో ఫేక్ అకౌంట్లు వెలిసినట్లు తెలుస్తోంది. డబ్బులు పంపిస్తే తక్కువ ధరకే గృహోపకరణాలతోపాటు పలు రకాల వస్తువులు తీసుకు వస్తామని పోస్టులు పెడుతూ డబ్బులు దోచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ తరహా మోసాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఇది రాజస్థాన్ ముఠా పనే! రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం పోలీసుల విచారణలోనూ వెల్లడైంది. ఇప్పటికే కొందరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండకపోతే అంతే! ఫేక్ ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్లతో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఈ తరహా నేరాలపై ఫేస్‌బుక్‌కు సైతం లేఖ రాసింది. దీంతో ఫేస్బుక్...ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చింది. ఫేస్బుక్ యాప్ సెట్టింగ్‌లోకి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ వివరాలతోపాటు ప్రొఫైల్ వివరాలు బయటికి వెలువడకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ లాగ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అప్పుడే సైబర్ నేరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. -
తుపాకీతో బెదిరించి రూ.కోటి లూటీ
యశవంతపుర : ఇద్దరు ముసుగు దొంగలు నగలను కొనడానికని వచ్చి నగల షాపులో భారీగా ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన ఐటీసిటీలో జాలహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంఇఎస్ రోడ్డు బీఇఎల్ సర్కిల్ సమీపంలో వినోద్ బ్యాంకర్స్ అండ్ జ్యువెలర్స్ అంగడి ఉంది. ఆదివారం ఉదయం యజమాని రాహుల్ జైన్ వచ్చి అంగడిని తెరిచాడు. ఇదే సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నగలు కావాలని షాపులోకి వచ్చారు. యజమాని కొన్ని గొలుసులను చూపించాడు. టేబుల్ పై పెట్టగానే ఉంగరం చూపాలని అడిగారు. యజమాని ఉంగరం తేవటానికి లోనికి వెళ్లగా వెంబడించి పిస్టల్‌ను చూపించి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. అంగడిలోని సుమారు కోటి రూపాయిలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. అతి కష్టం మీద రాహుల్ జైన్ కట్లు విడిపించుకొని వెళ్లి జాలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు లోపల, బయట సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నార -
ఏటీఎంనే ఎత్తేశారు
నగదు కోసం ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మెషిన్నే దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన అసోంలోని కామరూప్ జిల్లాలోని రంగియాలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. ఏటీఎం మెషిన్లో రూ. 5.38 లక్షల నగదు దొంగలు అపహరించారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఏటీఎం కేంద్రాన్ని మంగళవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఏటీఎంలోని సీసీ ఫూటేజ్‌లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. ఏటీఎం నుంచి మెషిన్ ఎత్తికెళ్లిన సమయంలో ఏటీఎం కేంద్రం వద్ద భద్రత సిబ్బంది లేరని చెప్పారు. ఏటీఎం కేంద్రంలో నగదు మెషిన్‌ను బ్యాంక్ సిబ్బంది సరిగ్గా బిగించ లేదన్నారు. ఈ నేపథ్యంలో నగదు మెషీన్ ఎత్తుకెళ్లేందుకు దొంగలకు మరింత సులువైందని తెలిపారు. కామరూప్ జిల్లాలోని రంగియా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం కేంద్రంలో బ్యాంక్ అధికారులు సోమవారం రూ. 45 లక్షలు పెట్టారని చెప్పారు. అయితే ఖాతాదారులు ఆ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయడంతో దొంగలు ఏటీఎం మెషిన్ ఎత్తుకు వెళ్ల సమయానికి అందులో రూ.5.38 లక్షలు ఉందని వెల్లడించారు. గత నెలలో రంగియా ప్రాంతంలో ఇలాగే మరో ఏటీఎంను దొంగలు ఎత్తు కెళ్లారు. అందులోని రూ. 25 లక్షల నగదు దొంగిలించి... ఆ ఏటీఎం మెషిన్‌ను మురికి కాల్వలోపడేశారని పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.