Italy Goalkeeper Gianluigi Donnarumma Attacked Robbery at His Home Paris - Sakshi
Sakshi News home page

#Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్‌, అతని భార్యను బంధించి

Published Sun, Jul 23 2023 12:28 PM | Last Updated on Sun, Jul 23 2023 1:22 PM

 Italy goalkeeper Gianluigi Donnarumma Attacked Robbery-At-His Home-Paris - Sakshi

ఇటలీ గోల్‌కీపర్‌ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు.

కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్‌ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌(పీఎస్‌జీ క్లబ్‌)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్‌ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్‌ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్‌జీ క్లబ్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్‌జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్‌జీ రెండుసార్లు లీగ్‌-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు.

చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement