పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని హఫీజ్ ఇంట్లోకి మార్చి 5న(ఆదివారం) రాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.25 వేల డాలర్ల (పాకిస్థాన్ రూపాయిలో 25 డాలర్ల విలువ దాదాపు రూ.2 కోట్లు)లతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.
దొంగతనం జరిగే సమయంలో సమయంలో హఫీజ్, అతని భార్య ఇంట్లో లేరు. ఈ ఆల్‌రౌండర్ ఇంట్లో దొంగలు చొరబడి భారీగా విదేశీ కరెన్సీ, విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గురించి వాళ్ల అంకుల్ షాహిద్ ఇక్బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా విశేష సేవలందించిన హఫీజ్ 2022 జనవరి 3న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
దాదాపు 18 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మహ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 392 మ్యాచ్‌లు ఆడి 12,780 రన్స్ చేశాడు. 253 వికెట్లు తీశాడు. 2018లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డేలు, టి20ల్లో కొనసాగాడు. హఫీజ్ 2019 వరల్డ్ కప్‌లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం హఫీజ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment