‘ప్రధాని మోదీది లెక్కలేనితనం...’
న్యూఢిల్లీ: రూ.500,1000 నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సాధారణ ప్రజల పట్ల ప్రధాని మోదీది లెక్కలేనితనమని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, చిన్న దుకాణదారులు, గృహిణులు అష్టకష్టాలు పడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. నిజమైన దోపిడీదారులు తప్పించుకుంటున్నారని, విదేశాలతో పాటు, రియల్ ఎస్టేట్ల్లో దాచుకున్న నల్లధనాన్ని కేంద్రం వదిలి పెడుతోందని ఆయన ఈ మేరకు తన ట్విట్టర్లో ధ్వజమెత్తారు.
While the real culprits sit tight on their black money stashed away abroad or in bullion/ real estate.Well done Mr Modi
— Office of RG (@OfficeOfRG) November 9, 2016
Once again MrModi shows hw little he cares abt ordinary ppl of this country-farmers,small shopkeepers,housewives-all thrown into utter chaos
— Office of RG (@OfficeOfRG) 9 November 2016