కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ! | RBI give clarity on GPS nano chip inside Rs 2000 note | Sakshi
Sakshi News home page

కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ!

Published Wed, Nov 9 2016 10:36 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ! - Sakshi

కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ!

ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500, రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వీటిస్థానంలో రూ. 500, రూ. రెండువేల నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రూ. రెండువేల నోటులో నానో జీపీఎస్‌ చిప్‌ ఉంటుందని, ఈ నోట్లు ఎవరు పెద్దమొత్తంలో దాచినా.. అవి ఎక్కడ ఉన్నాయో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అవలీలగా కనుక్కోగలదని పెద్ద ఎత్తున వదంతులు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో షికార్లు చేశాయి. 
 
ఈ నోట్లలో ఉండే నానో జీపీఎస్‌ చిప్‌లు శక్తిమంతమైనవనీ, భూమిలో 120 మీటర్ల లోతులో ఈ నోట్లను పాతిపెట్టినా.. వీటిని రాడర్‌ నిఘా నుంచి తప్పించలేరని, నానో చిప్‌ ఆధారంగా వచ్చే సిగ్నళ్లతో వీటిని ఐటీ అధికారులు ట్రాక్‌ చేసే వీలు ఉంటుందని వదంతులు భారీగా వచ్చాయి. అయితే, ఈ వదంతులన్నీ ఉత్తవేనని తాజాగా భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) తేల్చింది. రూ. 2000 నోటుకు సంబంధించిన ఆర్బీఐ ఇచ్చిన వివరణలో ఎక్కడా కూడా నానో చిప్‌ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంతేకాకుండా నోటులో చిప్‌ ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. రూ. 2వేల నోట్లలో అలాంటివేమీ ఉండవని స్పష్టం చేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement