నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని... సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఎన్ని డబ్బులున్నా బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని..అయితే ఐడీ ప్రూఫ్ మాత్రం కచ్చితంగా చూపించాలని ఆయన బుధవారమిక్కడ పునరుద్ఘాటించారు. బ్లాక్‌మనీ ఉన్నవారే కేంద్రం ప్రతిపాదనకు కంగారు పడతారన్నారు. రెండురోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పలు రంగాలు నష్టాల పాలవుతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు. రియల్ ఎస్టేట్ ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు.
Published Wed, Nov 9 2016 2:46 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
Advertisement