నరేంద్ర మోదీ ప్రసంగం పెద్ద డ్రామా..
Published Mon, Nov 14 2016 2:04 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం పెద్ద డ్రామాగా ఆమె అభివర్ణించారు. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తున్న విపక్షాలన్నీ కలిసికట్టుగా ఈ అంశంపై పోరాడతాయని సోమవారమిక్కడ స్పష్టం చేశారు. డిసెంబర్ 31 వరకూ పాత నోట్ల చెల్లుబాటయ్యేలా చూడాలని మోదీ సర్కార్‌ను కోరతామని బృందాకరత్ చెప్పారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో బద్దశత్రువు తృణమూల్‌తో కలిసి ముందుకెళ్లేందుకు అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు
Advertisement
Advertisement