భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా గర్జన ర్యాలీ (ఇన్‌సెట్) కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న బృందా కారత్
ఖమ్మం/చుంచుపల్లి: ప్రజా వ్యతిరేక విధానాలతో నియం తలా పాలన సాగిస్తున్న ప్రధాని మోదీ ఆటలు ఇక చెల్లవని, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు తిరగబడే రోజు లు దగ్గరలోనే ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన పోడు సాగుదారు ల ప్రజా గర్జన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరపకుండా మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు రోడ్లెక్కే పరి స్థితి ఎందుకొచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అదా నీ, అంబానీల కోసం రైతుల వెన్నువిరచాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రైతులకు అండగా నిలిచి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దాలుగా పోడునే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వాలు అటవీ చట్టాలను అమలుచేసి హక్కు పత్రాలివ్వాలని ఆమె డిమాండ్ చే శారు.
రాష్ట్రంలో నరేంద్ర మోదీ తమ్ముడు కేసీఆర్.. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్న తీరున వ్య వహరిస్తున్నారని విమర్శించారు. హరితహారం పేరుతో వారి నుంచి భూములను లాక్కు నే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మా ట్లాడుతూ ఆదివాసీలకు పట్టాలిచ్చే వరకు సీపీఎం ఆధ్వర్యంలో మిలిటెంట్ పో రాటాలు నిర్వహిస్తామన్నారు. కాగా, వ్యవసాయ చట్టాలకు తెలంగాణ ప్రభుత్వం వ్య తిరేకమే అయితే కేరళ మాదిరిగా రైతు చ ట్టాలను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని బృందా కారత్ డిమాండ్ చేశారు. సోమవారం ‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, మూడు వ్యవసాయ చట్టాలు–ప్రజల ముందున్న సవాళ్లు’అనే అంశంపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment