బృందా కారాత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ : మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని సీపీఎం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. దేశ భక్తులుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమైపోయ్యారని ఆమె ప్రశ్నించారు. శనివారం విజయవాడలో జరిగిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని.. మనువాద ఎజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడాలంటే మోదీని గద్దె దించాలని ఆమె అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో బీజేపీ నడుస్తోందని.. కార్పొరేట్ శక్తులకు బీజేపీ సాగిలాపడిందని ఆమె విమర్శించారు.
సమావేశంలో ఆమె మాట్లాడుతూ..‘‘మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అధిక భారం మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రికార్డు సృష్టించారు. మోదీ ప్రభుత్వం జేబు దొంగల ప్రభుత్వం, దేశ ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ దొచ్చుకుంటున్నారు. మోదీ పాలన విధానం వల్ల దేశం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. మోదీ ఆర్థిక విధానాలకు అనుకూలంగా చంద్రబాబు అనుసరిస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు కొత్తపాటు పాడుతున్నారు. దేశంలో మోదీ పెద్దన్న అయితే రాష్ట్రాంలో చంద్రబాబు చిన్నన్న’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment