vijayawad
-
ఇండియా బిగ్గెస్ట్ 'రామ్ చరణ్' కటౌట్.. ఆవిష్కరించనున్న గేమ్ ఛేంజర్ టీమ్
గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో ఆయన ఫ్యాన్స్ ఆవిష్కరించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది.256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఆదివారం నాడు హెలికాప్టర్‌తో కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజులగా అభిమానులు కష్టపడ్డారు.ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేలకు పైగానే ఫ్యాన్స్ రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగ జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. -
విజయవాడలో ఎవరైనా వచ్చి కాపాడండి: బిగ్‌బాస్ తేజ
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లు పూర్తిగా మునిగిపోయి కార్లు, ద్విచక్ర వాహనాలు కాగితం పడవల్లా తేలియాడుతున్నాయి. పైఅంతస్తుల్లో ఉన్న వారంతా రెండ్రోజులుగా గడప దాటే పరిస్థితి లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ సాయం అందక చాలామంది అల్లాడిపోతున్నారు. తమ వీధుల వెంట వెళ్తున్న వార్ని గుండెలవిసేలా పిలుస్తూ.. తమను ఆదుకోండి అంటూ ఆర్తిగా కోరుతున్నారు.ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ఒక కుటుంబాన్ని కాపాడాలని బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజా కోరారు. ఈ క్రమంలో ఒక వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. పసిపిల్లలు,మహిళలు,వృద్ధులు వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుపోయామని వీడియోలో బాధితుడు తెలిపాడు. ఏపీ ప్రభత్వం లేదా విజయవాడలోని ఎవరైన తమను కాపాడాలని కోరారు. రెండు రోజులుగా పిల్లలకు పాలు, ఆహారం కూడా లేదని వాపోయారు. చాలామంది అధికారులకు మెసేజ్ చేసినా ఫలితం లేదని ఆయన తెలిపారు. దయచేసి తమను కాపాడాలని వారు వేడుకున్నారు. టేస్టీ తేజా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
విజయవాడ : దసరా ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న దుర్గ గుడి
-
‘బెంజి’పై రయ్..రయ్
సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్‌రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్‌రన్ సక్సెస్ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్‌రన్ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్ మీదుగా ఏపీ39–టీహెచ్ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్హెచ్ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత కుటుంబరావు భూ కబ్జా
-
ఫ్లెక్సీలు కళకళ.. కోడ్ వెలవెల!
సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్ ట్యాంకు వద్ద, అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు. ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్) వద్ద చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. తోటరావులపాడులో ఇలా.. తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్‌లో హైస్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్ మార్గ్ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోల డూమ్‌లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. -
పశ్చిమంలో ఓట్ల తొలగింపు కలకలం!
సాక్షి, విజయవాడ: రానున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా తిరిగి అధికారాన్ని చేపట్టాలని తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతుందని పలువురు మండి పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం కావటంతో అధికార పార్టీ పెద్దలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్నికల్లో ఏదో విధంగా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఫారం–7 ద్వారా కొంతమంది వైఎస్సార్ ఓట్ల తొలగింపుకు కుట్రలు చేస్తే గత నాలుగేళ్లగా ఈప్రాంతంలో వైఎస్సార్ సీపీ అనుకూల ప్రాంతాలంటూ కొన్నింటిని ఎంపిక చేసుకొని అధికారపార్టీ దానిపై దృష్టి సారించింది. పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు కసరత్తు చేశారు. అయితే చాలా మందికి తమ ఓట్లు పోయిన సంగతి తెలియకపోవటంతో ఇప్పుడిప్పుడే బాధితులు బయట పడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ వల్లే..! తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారానే మా ఓట్లు గల్లంతయ్యాయంటూ నియోజకవర్గానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. తమ ఇంటికి వచ్చి పెన్షన్ వస్తుందా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటూ అన్ని వివరాలను తీసుకొని వెళ్లి తీరా ఓట్ల తొలగింపు చేశారంటూ 37వ డివిజన్‌కు చెందిన పలువురు మండిపడుతున్నారు. ఇప్పటి వరకూ తమ ఓట్లు ఎలా పోయాయో తెలియని బాధితులు తాజాగా రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఐటీగ్రిడ్ సంస్థ లీలలు, టీడీపీ నేతలు ప్రకటనలతో చాలా మందికి తమ ఓట్లు తొలగింపు వారి పుణ్యమేనని అర్ధమైందంటూ పలువురు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో అధికం ... కొండ ప్రాంతాల్లో అధికంగా ఓట్లు గల్లంతైనట్లు ఆయా ప్రాంతాల్లోని నాయకులు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లోని నివాసితులు తమ ఓట్లును ఎప్పటికప్పుడు పరిశీలించటం చేతకాకపోవటం, నిత్యం కూలి పనులకు వెళ్లేవారు కావటంతో తమ ఓటు ఉన్నది, లేనిది వారు తెలుసుకోలేకపోతున్నారని నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా 37వ డివిజన్లోని కొండ ప్రాంతంలోనూ చాలా వరకూ ఓట్లు గల్లంతయ్యాయి. అలాగే డివిజన్లోని మైనార్టీలకు సంబంధించిన ఓట్లు కనపడటం లేదని ఆయా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. -
మోదీ పెద్దన్న.. చంద్రబాబు చిన్నన్న
సాక్షి, విజయవాడ : మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని సీపీఎం సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. దేశ భక్తులుగా చెప్పుకుంటున్న బీజేపీ నేతలు స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమైపోయ్యారని ఆమె ప్రశ్నించారు. శనివారం విజయవాడలో జరిగిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల బహిరంగ సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని.. మనువాద ఎజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని కాపాడాలంటే మోదీని గద్దె దించాలని ఆమె అన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ నడుస్తోందని.. కార్పొరేట్ శక్తులకు బీజేపీ సాగిలాపడిందని ఆమె విమర్శించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ..‘‘మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై అధిక భారం మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రికార్డు సృష్టించారు. మోదీ ప్రభుత్వం జేబు దొంగల ప్రభుత్వం, దేశ ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ దొచ్చుకుంటున్నారు. మోదీ పాలన విధానం వల్ల దేశం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. మోదీ ఆర్థిక విధానాలకు అనుకూలంగా చంద్రబాబు అనుసరిస్తున్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ చంద్రబాబు కొత్తపాటు పాడుతున్నారు. దేశంలో మోదీ పెద్దన్న అయితే రాష్ట్రాంలో చంద్రబాబు చిన్నన్న’’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
టౌన్ దోపిడీ: ఏసీబీ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సాక్షి, విశాఖపట్నం, విజయవాడ: టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బాగోతాలు బట్టబయలు అయ్యాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకటరఘు, ఆయన బీనామీగా భావిస్తున్న విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపై సోమవారం ఏసీబీ అధికారులు జరిపిన వేర్వేరు దాడుల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారి రఘు ఆదాయానికి మించి ఆస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు ఆయన, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. చిత్తూరులోని రఘు అత్తం ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, మంగళగిరి, నెల్లూరు, తిరుపతి, షిర్డీలోనూ రఘు బంధువులు ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. 500 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక, విజయవాడ టౌన్ ప్లానింగ్ ఏవో వెంకటశివప్రసాద్ ఇళ్లపైనా ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. గన్నవరం, విజయవాడలోని ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రూ. వందలకోట్ల ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘుకు సమీప బంధువులైన ఏవో వెంకట శివప్రసాద్, ఆయన భార్య గాయత్రి.. ఆయనకు బినామీలుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో టెక్నికల్ ఇంజినీర్‌గా గాయత్రి పనిచేశారు. ఆమె ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాయత్రి పేరు మీదనే మొత్తం డాంక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బంగార అభరణాలు లభించాయి. బంగారు అభరణాల్లో దేవతా విగ్రహాలు, ఊయలలు, జడలు దొరకడం గమనార్హం. గన్నవరంలో 1.40 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మాణం, ఇక్కడే నిర్మాణంలో ఉన్న పలు అపార్ట్మెంట్లలో 16 ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేల్పూరులో వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు వీరికి ఉన్నట్టు గుర్తించారు. ఏవో వెంకటశివప్రసాద్కు చెందిన గన్నవరంలోని ఇంట్లో రూ.10కోట్ల విలువైన బంగారం, రూ.50లక్షల నగదు, పెద్ద ఎత్తున ఖాళీ ప్రామిసరీ నోట్లు, పేరు లేని ఎంవీఆర్ జ్యుయలరీ బిల్లులు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. కృష్ణాజిల్లా వేల్పూరులో వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, స్పెషల్ టీమ్ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. రఘుకు షిర్డీలో కూడా ఓ లాడ్జ్ ఉందని, గన్నవరంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో శివప్రసాద్ పేరు మీద 300 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. -
అన్నపూర్ణమ్మకు అభివందనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఎడమ చేతిలో అన్నపాత్ర, కుడిచేత్తో అన్నం గరిటెతో తన భర్త ఈశ్వరుడికి భిక్ష అందిస్తున్న అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను చూసి భక్తజనం తన్మయత్వం చెందారు. నిత్యాన్నదానేశ్వరీ అలంకారంలోని దుర్గమ్మను ఒక్కసారి దర్శిస్తే అన్నపానాదులకు లోటు ఉండదని భక్తుల నమ్మకం. సృష్టికి పోషకురాలుగా ‘అమ్మ’ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుందని విజ్ఞులు పేర్కొంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శిస్తే బుద్ధి, జ్ఞానాలను ఆ తల్లి వరంగా ఇస్తుందని చెబుతారు. దీంతో అమ్మవారి దర్శనానికి ఆదివారం తెల్లవారుజామునుంచి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం మూడు గంటల నుంచే దర్శనానికి అనుమతించారు. ఆదివారం, స్కూళ్లకు సెలవులు కూడా కావడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. కాగా దేవస్థానం, పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను, వీవీఐపీ వాహనాలను కూడా భక్తులు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపు అంతరాలయ దర్శనం నిలిపేశారు. నేడు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం.. శ్రీచక్ర అధిష్టానశక్తి, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతైన శ్రీలలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవార్ని దర్శించుకుంటే సమస్త కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఉభయదాతల ఆగ్రహం రూ.3,000 పెట్టి టికెట్ కొనుగోలు చేసిన ఉభయదాతలను అమ్మవారి దర్శనానికి ఆలస్యంగా పంపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఎండలోనే గంటల కొద్దీ నుంచోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లోకి సిఫార్సులతో వచ్చే వీఐపీ భక్తుల్ని వదిలారు. కొద్దిసేపటి తర్వాత దానికి తాళం వేసి అనంతరం తాళం తీయడంలో జాప్యంతో ఉభయదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో వారు ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. వెయ్యి టికెట్ రూ. మూడు వేలు చేసినా సౌకర్యాలు మాత్రం పెంచలేదని భక్తులు మండిపడ్డారు. ఇక సాధారణ భక్తులు కొండపైకి చేరాలంటే రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. అంతేగాక క్యూలైన్ల మధ్య ఖాళీకూడా చిన్నగా ఉండటంతో వేగంగా నడవడానికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇంతకష్టపడి వెళ్లినా ఆలయంలో సిబ్బంది కొన్ని సెకన్లు కూడా దర్శనం చేసుకోనివ్వకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనం అనంతరం కూడా చాలా దూరం నడవాల్సి వస్తోందని చెబుతున్నారు. -
న్యాయపోరాటం చేస్తాం: వెల్లంపల్లి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిరసన తెలిపినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు. పశువులను తరలించినట్లు తమను పోలీసుల వ్యాన్‌లో తరలించారని చెప్పారు. గురువారం రాత్రి 10గంటల వరకూ స్టేషన్లోనే నిర్బంధించారని తెలిపారు. ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడేది లేదని న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. -
న్యాయపోరాటం చేస్తాం: వెల్లంపల్లి
-
ఏపీ రాజధాని విజయవాడలో దారుణం