ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నిరసన తెలిపినందుకు తమపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని గుర్తు చేశారు. పశువులను తరలించినట్లు తమను పోలీసుల వ్యాన్లో తరలించారని చెప్పారు.