గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను విజయవాడలో ఆయన ఫ్యాన్స్ ఆవిష్కరించనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఆవిష్కరించనుంది.
256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ లుక్‌తో కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఆదివారం నాడు హెలికాప్టర్‌తో కటౌట్‌కి పూలభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజులగా అభిమానులు కష్టపడ్డారు.
ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేలకు పైగానే ఫ్యాన్స్ రావచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగ జనవరి 10న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment