సూర్యాపేట బహిరంగ సభలో మాట్లాడుతున్న బృందాకారత్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/నల్లగొండ టౌన్: ‘బీజేపీ హటావో.. దేశ్‌కీ బచావో’అనే ఎన్నికల నినాదంతో ముందుకెళ్తున్నామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. దేశంలో అల్లర్లు, కులాల మధ్య చిచ్చుపెడుతూ పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఎతైనా ఉందన్నారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో, సూర్యాపేట జిల్లా కేంద్రంలో వామపక్షాలు బలపర్చిన నల్లగొండ ఎంపీ అభ్యర్థి మల్లు లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
ప్రధాని మోదీ అన్నింట్లో విఫలమయ్యారు కాబట్టే నేడు పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేయదని, వారు కలిసే పనిచేస్తారన్నారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కవితపై వంద మందికి పైగా రైతులు పోటీ చేస్తున్నారంటే.. ఆమె ఎంపీగా రైతులతో కాకుండా బీజేపీతోనే ఎక్కువ కలిసి ఉన్నారని విమ ర్శించారు. బహిరంగ సభలో నల్లగొండ ఎంపీ అభ్యర్థి మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జి.రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment