వారంలో డబ్బిస్తానని మాటిచ్చి కొడుకు పెళ్లి చేశా
వారంలో డబ్బిస్తానని మాటిచ్చి కొడుకు పెళ్లి చేశా
Published Fri, Nov 11 2016 3:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
భూపాలపల్లి: ‘‘నా కొడుకు పెళ్లికి రెండు నెలల కిత్రమే నవంబర్ 9న ముహూర్తం నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో పెళ్లి పను ల కోసం నిల్వ ఉంచిన నగదుకు విలువ లేకుండా పోయింది. వంట, షామి యానా, పురోహితుడు, బ్యాండు తదితర పెళ్లి ప నులకు అప్పటికే అడ్వా న్సులు చెల్లించాను. మిగిలిన డబ్బు చెల్లించడం కష్టంగా మారిం ది. చివరికి వారం రోజుల్లో మిగిలిన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి పెళ్లి జరిపిం చాను. వారు నా మాటను గౌరవించారు’’
- వేముల శ్రీనివాస్, భూపాలపల్లి
500 నోటు మార్పిడికి యాచకుడి పాట్లు
రామన్నపేట: పెద్ద నోట్ల మా ర్పిడి ఓ యాచకుడికి తీవ్ర ఇబ్బందులు తె చ్చిపెట్టింది. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్ప త్రి జంక్షన్‌లో ఉండే ఓ యాచకుడు యాచన ద్వారా కూ డబెట్టుకున్న చిల్లరను రూ. 500 నోటుగా మార్చుకున్నాడు. అరుుతే రూ. వెరుు్య, రూ. 500 నోట్లు రద్దు అయినట్లు తెలియడంతో గురువారం ఉదయం తన వద్ద ఉన్న రూ. 500 నోటు మార్పిడి కోసం ఎంజీఎం వద్దనున్న ఎస్‌బీహెచ్ బ్రాంచ్‌కు చేరుకుని నిరీక్షించసాగాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివరామయ్య దీన్ని గమనించి తన సిబ్బంది సాయంతో ఆ నోటు మార్పిడి చేసి యాచకుడికి చిల్లరనందించాడు.
ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రా మానికి చెందిన యువ సర్పంచ్ వైనాల మురళి. ఈ నెల 12 న వరంగల్ నగరం లోని ఓ పంక్షన్‌హాల్‌లో జరగనున్న తన పెళ్లి కోసం బంగారం, బట్టలు తీసుకున్నాడు. కిరాణా, కూరగా యలు చిల్లర ఖర్చుల కోసం రూ.50 వేల విలువైన పెద్దనోట్లు అట్టిపెట్టుకున్నాడు. గురువారం ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్లు తీసుకోకపోవడంతో మిత్రులు, బంధువుల సహకారంతో ఆర్థిక అవసరాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తనకు ఇబ్బంది ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని మురళి పేర్కొనడం గమనార్హం.
Advertisement