money exchange
-
రూ.2,000 నోట్ల మార్పిడికి ధ్రువీకరణ పత్రాలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: రూ. 20,000 వరకూ విలువ చేసే రూ. 2,000 నోట్లను మార్చుకొనేందుకు ఎటువంటి ఫారం లేదా రిక్విజిషన్ స్లిప్ అవసరం లేదని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే వినియోగదారుడు ఎటువంటి ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాల్సిన అవసరం లేదని స్థానిక ప్రధాన కార్యాలయాలకు పంపిన సూచనల్లో పేర్కొంది. నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలకు అవసరమైన తోడ్పాటు అందించాలని సూచించింది. రూ. 2,000 నోట్లను మార్చుకోదల్చుకున్న వారు ఎన్ని సార్లయినా బ్యాంకును సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు, మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. దీంతో చాలా మంది వినియోగదారులు శనివారం నుంచే తమ ఖాతాల్లో జమ చేసుకొనేందుకు, మార్చుకొనేందుకు బ్యాంకులకు వెళ్లినప్పటికీ బ్యాంకు సిబ్బంది వారిని తిప్పి పంపారు. కొందరు కస్టమర్లు నగదు డిపాజిట్ మెషీన్ల ద్వారా తమ ఖాతాల్లోకి రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ షాపుల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే రూ. 2,000 నోట్లను తీసుకొనేందుకు ఆభరణాల సంస్థలు సందేహించి, నగదు కొనుగోళ్ల పరిమితి నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు అడిగినట్లు సమాచారం. రూ. 2,000 నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులపై ఎటువంటి ప్రభావం ఉండదని, కానీ పెద్ద సంఖ్యలో ఆ నోట్లను నిల్వ చేసుకున్న సంపన్నులపై ప్రభావం ఉండొచ్చని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ పేర్కొంది. పసిడికి ‘2000’ బూస్ట్! రూ. 2,000 నోట్ల ఉపసంహరణతో కొనుగోళ్లపై ఆసక్తి ముంబై: రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో దేశీయంగా పసిడి, వెండి కొనుగోళ్లపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. రూ. 2,000 నోట్లతో కొనుగోళ్లు జరిపే ఉద్దేశంతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆరాలు తీస్తున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థలు వెల్లడించాయి. అయితే కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను కఠినంగా పాటిస్తుండటంతో గత రెండు రోజులుగా వాస్తవంగా లావాదేవీలు ఆ స్థాయిలో ఏమీ జరగలేదని పేర్కొన్నాయి. కానీ రూ. 2,000 నోట్లకు బదులుగా పసిడిని విక్రయించేందుకు కొందరు జ్యువెలర్లు 5–10 శాతం ఎక్కువ వసూలు చేయడం మొదలుపెట్టాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితంగా 10 గ్రాముల పసిడి రూ. 66,000 పలుకుతోందని వివరించాయి. మరోవైపు 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలోలాగా ఆందోళనకర పరిస్థితేమీ లేదని ఆభరణాల సంస్థల సమాఖ్య జీజేసీ తెలిపింది. ‘రూ. 2,000 నోట్లతో బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు చాలా ఎంక్వైరీలు వచ్చాయి. కానీ కఠినతరమైన కేవైసీ నిబంధనల కారణంగా వాస్తవంగా జరిగిన కొనుగోళ్లు తక్కువే’ అని జీజేసీ చైర్మన్ సైయ్యమ్ మెహ్రా తెలిపారు. నోట్ల ఉపసంహరణకు నాలుగు నెలల సమయం ఉన్నందున ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏమీ లేవని వివరించారు. -
50 వేల యూరోల తస్కరణ
సాక్షి, హైదరాబాద్: చెన్నైకి చెందిన మహ్మద్ మురాద్ అనే వ్యాపారి నుంచి తస్కరణకు గురైన యూరోలను పట్టుకోవడానికి శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మనీ ఎక్స్ఛేంజ్ కోసం మురాద్ హోలీనాడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయన వద్దనున్న యూరోలను గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. మురాద్ కొన్నాళ్లు చెన్నైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసి 11 నెలల క్రితం తన సోదరుడు మీరాన్ ముఖ్తర్తో కలసి చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో మాబ్ మనీఛేంజర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. మనీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ చెన్నై కంటే హైదరాబాద్‌లో అనువుగా ఉన్నట్లు మురాద్ గుర్తించారు. తమకు అవసరమైనప్పుడు సిటీకి వచ్చిన శివంరోడ్‌లో ఉన్న జైన్ ఫారెక్స్ సంస్థలో ఎక్స్ఛేంజ్ చేసుకుని వెళ్తుంటారు. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని మాధవరం నుంచి లిమోలైనర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గత బుధవారం రాత్రి బయలుదేరి గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 50 వేల యూరోలతో నగరానికి... మురాద్ తనతోపాటు భారత్ కరెన్సీలో రూ.39 లక్షల విలువైన 50 వేల యూరోలను నగరానికి తీసుకువచ్చారు. గత గురువారం ఉదయం 8.30 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు దిగిన మురాద్ అక్కడ నుంచి నేరుగా జైన్ ఫారెక్స్ సంస్థకు వెళ్లారు. ఆ దుకాణం మూసి ఉండటంతో ఫోన్ ద్వారా ఆ సంస్థకు చెందిన సజ్జన్‌ను సంప్రదించారు. అయితే, ఆ రోజు హోలీ పండుగ కావడంతో తాము దుకాణం తెరవమని, మరుసటి రోజు రావాల్సిందిగా సజ్జన్ సూచించారు. దీంతో తన వద్ద ఉన్న డబ్బుతో నగరంలో బస చేయడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన మురాద్ రైలులో తిరిగి చెన్నైకు వెళ్లిపోవాలని భావించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. సమీపంలోని ఓ ప్రార్థనాస్థలంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తూ యూరోలతో కూడిన బ్యాగ్‌ను తాను కూర్చున్న కుర్చీలో పెట్టారు. తిరిగి వచ్చి చూసుకునేసరికి ఆ బ్యాగ్ మాయమైంది. ఎవరో దొంగిలించారని నిర్ధారించు కుని గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన బ్యాగ్‌లో 50 వేల యూరోలతోపాటు రూ.2 వేల నగదు, ఇతర పత్రాలు ఉన్నట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలే వ్యాపారం ప్రారంభించిన తమకు ఆ మొత్తం చాలా ఎక్కువని, ఎత్తుకెళ్లిన సొమ్ము రికవరీ కాకుంటే జీవితం రోడ్డున పడాల్సి వస్తుందని మురాద్ వాపోయారు. దీంతో గోపాలపురం పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి కేసును కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. -
అమెరికా షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ పాలన మరోసారి పాక్షికంగా స్తంభించింది (షట్‌డౌన్). అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30) కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే శుక్రవారం కాంగ్రెస్ వాయిదా పడింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్ అమోదం పొందకపోయినా, అధ్యక్షుడు సంతకం చేయకపోయినా పాలన స్తంభిస్తుంది. పాలన నిలిచిపోకుండా చూసేందుకు చివరి నిమిషం వరకు కాంగ్రెస్ నేతలు, శ్వేతసౌధం అధికారుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని కీలక భద్రతా సంస్థలు, అత్యవసర సేవల సంస్థలు మాత్రమే ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నా యి. అమెరికా రక్షణ మంత్రి పదవికి జిమ్ మ్యాటిస్ రాజీనామా చేసిన మరుసటి రోజునే పాలన స్తంభించడంతో అమెరికాలో కల్లోలిత వాతావరణం నెలకొంది. షట్‌డౌన్ కారణంగా 8 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేత నం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈసారి ఎక్కువ కాలం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించేంత వరకు అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతుంది. ఈ సారి షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధికారం చేపట్టాకా షట్‌డౌన్ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది. షట్‌డౌన్ కాలంలో చాలా మంది ఉద్యోగులకు సెలవులు ఇస్తారు. అత్యవసర విభాగాల సిబ్బంది యథావిధిగా పని చేస్తారు. ఈ కాలంలో సామాజిక తనిఖీ విభాగం, వైద్యశాఖ, తపాలా విభాగాలపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. అవన్నీ యథా ప్రకారం పని చేస్తాయి. ఎఫ్‌బీఐ, సరిహద్దు గస్తీ, తీరరక్షణ, ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఆహార తనిఖీ, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం వంటి అత్యవసర విభాగాలు కూడా మామూలుగానే పని చేస్తాయి. షట్‌డౌన్ కాలంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మ్యూజియంలు, ఉద్యానవనాలు, షాపింగ్ మాల్స్ మూతపడతాయి. సెనెట్ అప్రాప్రియేషన్ కమిటీలోని డెమోక్రాట్ల నివేదిక ప్రకారం 4,20,000 మంది ఈ షట్డౌన్లో జీతం లేకుండా పని చేస్తారు. షట్డౌన్లు కొత్త కాదు అమెరికాకు షట్డౌన్లు కొత్త కాదు. దాదాపు ప్రతి సంవత్సరం జనవరిలో కొన్ని రోజుల పాటు పాలన స్తంభిస్తుంటుంది. దైనందిన ప్రభుత్వ వ్యవహారాలకు అవసరమైన నిధులను ఖర్చు చేయడానికి ద్రవ్యవినిమయ బిల్లును జనవరిలో కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం సకాలంలో లభించకపోతే షట్‌డౌన్ అవుతుంది. జిమ్మి కార్టర్ హయాంలో ప్రతి ఏడూ సరాసరి 11 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి నెలకొంది. రోనాల్డ్ రీగన్ రెండు దఫాల పాలనలో ఆరు షట్డౌన్లను అమెరికా చూసింది. 2013లో ఏకంగా 16 రోజుల పాటు ప్రభుత్వ పాలన స్తంభించిపోయింది. ఈ ఏడాది జనవరిలో మూడు రోజుల పాటు, జూన్‌లో కొన్ని గంటలపాటు షట్‌డౌన్ అయ్యింది. అయితే ఒకే సంవత్సరంలో మూడు సార్లు షట్‌డౌన్ కావడం మాత్రం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. -
కట్టల గుట్టలు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో అక్రమ నగదు నిల్వలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ.. అక్రమ మార్గంలో నగదు మార్పిడి భారీగా జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు ఈ తరహా లావాదేవీలతో పాటు హవాలా, హుండీ ముఠాలపై డేగకన్ను వేశారు. ఫలితంగా అటు టాస్క్‌ఫోర్స్.. ఇటు స్థానిక పోలీసులకు వరుసగా ముఠాలు చిక్కుతున్నాయి. డీమానిటైజేషన్ తర్వాత అమల్లోకి వచ్చిన నిబంధనల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా దందాలు నెరపుతున్న, వెలుగులోకి రాకుండా చాపకింద నీరులా లావాదేవీలు సాగిస్తున్నవి అనేకం ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఉన్న సూత్రధారుల ఆదేశాల మేరకు నగరంలో పనిచేసే ఈ గ్యాంగ్స్ టర్నోవర్ ఏడాదికి రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసు విభాగం అంచనా వేస్తోంది. సహకరిస్తున్న వ్యాపారులు వివిధ దేశాల మధ్య అక్రమమార్గంలో ద్రవ్య మార్పిడి చేయడాన్ని హవాలా అని, దేశంలోని రాష్ట్రాల మధ్య జరిగే ఈ మార్పిడిని హుండీగా పేర్కొంటారు. నగరంలో హవాలా, హుండీ దందాలు ప్రధానంగా బేగంబజార్, అబిడ్స్, హిమాయత్‌నగర్, మహంకాళి, రాణిగంజ్, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ కేంద్రంగా సాగుతున్నట్టు గుర్తించారు. ప్రధానంగా బంగారం వ్యాపారులతో పాటు ఇతర బిజినెస్‌లు చేసే హోల్‌సేల్ వ్యాపారవేత్తలకు ఇది కలిసి వస్తోంది. బిల్లులు లేకుండా, ఆర్థిక లావాదేవీలు రికార్డెడ్‌గా చేయకుండా ఉండేందుకు అక్రమ ద్రవ్య మార్పిడిని ఆశ్రయిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ వ్యాపారులే బోగస్ ఇన్వాయిస్లు సృష్టిస్తూ హవాలా, హుండీ దందాలు చేసే వారికి సహకరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఈ వ్యాపారానికి ఆస్కారం ఉన్న నగరంలోని అనేక ప్రాంతాలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. హవాలా తగ్గి.. హుండీ పెరిగి.. ఒకప్పుడు సిటీ కేంద్రంగా హుండీకి పోటీగా హవాలా వ్యాపారం సైతం నడిచేది. అయితే, పీవీ నరసింహరావు ప్రధానిగా పనిచేసిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈ వ్యాపారం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం అసాంఘిక, ఉగ్రవాద కార్యకలాపాల కోసమే దీన్ని వినియోగిస్తున్నారు. హుండీ వ్యాపారం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. పన్ను పోటు నుంచి తప్పించుకోవడానికి అనేక మంది వ్యాపారులు ఈ మార్గాన్ని ఎంచుకోవడం నిర్వాహకులకు కలిసి వస్తోంది. ప్రస్తుతం నగరంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 50కి పైగా హుండీ ముఠాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్వారా రోజుకు రూ.5 కోట్లకు పైనే చేతులు మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ దందాల సూత్రధారులంతా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన వారే ఉంటున్నారు. పోలీసులు దాడి చేసిన ప్రతిసారి కేవలం పాత్రధారులే పట్టుబడుతున్నారుగాని దీని వెనుకున్న సూత్రదారులు మాత్రం వెలుగులోకి రాకపోవడం గనార్హం. పట్టిస్తున్నా వారికి పట్టట్లేదు.. అక్రమ ద్రవ్యమార్పిడి వ్యాపారంపై నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు నిత్యం ముఠాలను పట్టుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తున్నారు. ఇలాంటి సమాచారం ఇచ్చినా.. వ్యక్తులను పట్టించినా ప్రోత్సాహకంగా పట్టుబడిన మొత్తంలో పది శాతం ఇచ్చే ఆస్కారం ఆదాయ పన్ను శాఖకు ఉంది. అయితే, ఇప్పటికీ నగర పోలీసు విభాగానికి ఈ తరహా ‘ప్రోత్సాహమే’ అందలేదు. అక్రమ లావాదేవీల వల్ల ప్రభుత్వానికి పన్ను అందక పోవడంతో పాటు అసాంఘిక శక్తులు, మాఫియా, ఉగ్రవాదులకు అనువుగా మారే ప్రమాదం ఉందని భావించిన నగర టాస్క్‌ఫోర్స్ ఈ అక్రమ వ్యవహారంపై నిఘా వేసింది. ఫలితంగా హుండీ ముఠాలు పట్టుబడుతున్నాయి. అయితే, అక్రమ ఆర్థిక లావేదేవీలను పట్టిస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు ప్రోత్సాహకం ఇచ్చే అంశం మాత్రం ఐటీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా పట్టుకుని అలా అప్పగించడం.. దేశ వ్యాప్తంగా హుండీ, హవాలా వ్యాపారం సాగిస్తున్న ముఠాలు ప్రధానంగా గుజరాత్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ప్రధాన సూత్రధారులు అక్కడే ఉంటున్నా.. ఇక్కడున్న ఏజెంట్ల ద్వారా ఫోన్లో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లపై తమ వేగుల ద్వారా సమాచారం అందుకుంటున్న టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు వారిని పట్టుకుని, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఆపై దర్యాప్తు, విచారణ చేసే అధికారం మాత్రం పోలీసులకు లేదు. ఈ నేపథ్యంలోనే పట్టుకున్న ప్రతి ముఠాను స్వాధీనం చేసుకున్న నగదుతో సహా ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించేయాల్సిందే. తరవాత వ్యవహారమంతా వారే చూసుకుంటారు. ఆ ‘పది శాతం’పై నిర్లక్ష్యం ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయానికి మించిన/అక్రమ ఆస్తులు, హవాలా, హుండీ వంటి వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వాటి గుట్టును రట్టు చేయిస్తే సదరు ఇన్ఫార్మర్కు 10 శాతం కమిషన్‌గా ఇస్తారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో నగర పోలీసులే హుండీకి సంబంధించి అనేక ముఠాల గుట్టు రట్టు చేశారు. వీరి నుంచి రూ.కోట్లు స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఐటీ డిపార్ట్మెంట్ ఆనవాయితీగా ఉన్న పది శాతం అంటే.. కనీసం కొన్ని లక్షలైనా నగర పోలీసులకు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే నగరం పోలీసు విభాగంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. అలా కాకపోయినా ఈ ముఠాలను పట్టుకోవడంతో పనితీరు కనబరిచిన అధికారుకు రివార్డుగా ఇవ్వచ్చు. అయితే చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని, తమకు రావాల్సిన ‘పది శాతం’ మాత్రం ఆదాయ పన్ను శాఖను అడగడానికి మాత్రం పోలీసు విభాగం ఆసక్తి కనబరచడం లేదు. వీరి విషయం ఇలా ఉంటే.. కనీసం ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా నగర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్లే అనే కోణంలో ఆలోచించడం లేదు. ఇకనైనా ఏదో ఒక శాఖలో అధికారులు స్పందించి ‘పది శాతాన్ని’ నగర పోలీసు సంక్షేమ నిధికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది. -
ఆ నోట్లు నేరుగా వెళ్లే అవకాశం లేదు
శేఖర్‌రెడ్డికి 2 వేల నోట్ల చేరికపై బ్యాంకు వర్గాల వివరణ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా కొత్త 2 వేల నోట్లు టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ ‘స్కేప్’ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.500, వెయ్యి నోట్ల రద్దుకు ముందు రోజు నవంబర్ 7న రిజర్వు బ్యాంక్ నుంచి విశాఖ స్కేప్‌కు కొత్త రూ.2 వేల నోట్లు వచ్చాయి. ఏపీ జిల్లాలకు ఈ నోట్లనే పంపిణీ చేయాలి. ఈ సొమ్మును ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సమక్షంలో పంపిణీ చేస్తారు. నవంబర్ 7న ఆర్బీఐ నుంచి వచ్చిన రూ.కొత్త 2 వేల నోట్లను కూడా ఆయన సమక్షంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల చెస్ట్ శాఖలకు వ్యాన్లు, లారీల్లో పంపిణీ చేసినట్టు స్టేట్ బ్యాంక్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రాష్ట్రంలోని ఏ చెస్ట్ శాఖ నుంచైనా ఈ సొమ్ము శేఖర్‌రెడ్డికి చేరి ఉండొచ్చని.. విశాఖ నుంచి నేరుగా వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నాయి. మరోవైపు శేఖర్‌రెడ్డి అక్రమ నగదు నిల్వలపై ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటివరకు విశాఖలోని స్కేప్ అధికారులను విచారించలేదని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
నల్లధన మార్పిడిలో భాగస్వాములు కావద్దు
బంగారం కొనుగోళ్లపై నిఘా ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి రెడ్డి ఏయూక్యాంపస్ : నల్లధనం మార్పిడిలో సాధారణ ప్రజలు భాగస్వాములు కావద్దని ఇన్‌కంటాక్స్ శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి.రెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పొదుపు ఖాతాలలో ఒక్కసారిగా అధిక మొత్తాలను జమచేస్తే చిక్కులు తప్పవన్నారు. నల్లధనం కలిగినవారు ఇతరుల ఖాతాలను వినియోగించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారు భవిష్యత్తులో విచారణ, శిక్షలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. తమ సొంత ధనాన్ని, దాచుకున్న సొమ్ములను భద్రంగా బ్యాంకులో వేసుకోవచ్చున్నారు. ఇటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావన్నారు. సాంకేతిక అందుబాటులో ఉందని, బ్యాంకులో జరిపే లావాదేవీలను గమనించడం జరుగుతుందన్నారు. ప్రధాని ప్రకటన తరువాత భారీగా బంగారం కొనుగోళ్లు జరిగాయన్నారు. వీటన్నింటినీ తమ శాఖ నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. కొందరు ఎంతో తెలివిగా 1.8 నుంచి 1.98 లక్షల చొప్పున వివిధ వ్యక్తుల పేరుతో బంగారం భారీగా కొనుగోలు చేశారన్నారు. పాన్ నంబర్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇటువంటి చర్యలు పాల్పడ్డారన్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు రూ. 50 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తమకు సమాచారం అందిందన్నారు. కొద్ది గంటల సమయంలోనే మూడు కోట్ల రూపాయల వ్యాపారం కొందరు వర్తకులు జరిపినట్లు గుర్తించామన్నారు. ఇటువంటి చర్యలను సాంకేతిక సహకారంతో వెంటనే గుర్తించి విచారణ జరపడం జరుగుతోందన్నారు. సొసైటీలు, స్వచ్చంద సంస్థలకు సంబంధించిన అన్ని నగదు లావాదేవీలు, డొనేషన్లు గమనిస్తామన్నారు. ఎవరైనా తప్పుకు పాల్పడినట్లు గుర్తిస్తే విచారణ జరపడం తథ్యమన్నారు. ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజి్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఎస్బీఐ ఆడిట్, ఇనస్పెక్షన్ విభాగం డీజీఎం జయచంద్ర, రీజినల్ మేనేజర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ శ్రీనివాస ప్రసాద్,ఓవర్సీస్ బ్యాంక్ ఏజిఎం మురళి, ఏయూ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నగదు మార్పిడి రూ.3,500 కోట్లు
♦ ఖాతాల్లోకి వచ్చింది రూ.6,000 కోట్లు ♦ ఎస్బీఐ ఖాతాల్లోకి అత్యధికంగా రూ.3,000 కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు రూ.3,500 కోట్ల విలువైన పెద్ద నోట్ల మార్పిడి జరిగింది. బ్యాంకు ఖాతాల్లో కూడా భారీగా నగదు జమైంది. నగదు మార్పిడికి అదనంగా ఖాతాదారుల అకౌంట్లలో రూ.6,000 కోట్లు జమయ్యాయి. పెద్ద నోట్లు చెల్లవంటూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన ఈ నెల 8వ తేదీ రాత్రి నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు జనమంతా బ్యాంకుల ఎదుట బారులు తీరడం తెలిసిందే. దాంతో సెలవు దినాలైన శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేసి చెల్లని పెద్ద నోట్లను మార్చే సేవలను కొనసాగించాయి. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.3,500 కోట్ల మేరకు నోట్ల మార్పిడి జరిగినట్లు బ్యాంకర్లు లెక్క తేల్చారు. వీటికి తోడు బ్యాంకుల్లో ఖాతాలున్న వినియోగదారులంతా తమ పాత నోట్లను జమ చేసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో ఖాతాల్లోని నగదు నిల్వలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఏకంగా రూ.3,000 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి! మిగతా బ్యాంకులన్నింట్లో కలిపి మరో రూ.3,000 కోట్లకుపైగా జమైనట్లు అంచనా వేశారు. వెరసి బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 కోట్లకు పైగా జమయిందని లెక్కలేస్తున్నారు. వీటిలో 99 శాతానికి పైగా పెద్ద నోట్లేనని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.8,900 కోట్లకుపైగా విలువైన రూ.1,000, రూ.500 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ అంచనా వేసుకుంటోంది. తెలంగాణవ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి మొత్తం 4,758 బ్రాంచీలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లోనూ నగదు మార్పిడికి కేంద్రం అవకాశం కల్పించింది. పోస్టాఫీసుల ద్వారా రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య నగదు మార్పిడి జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
నో క్యాష్
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : బ్యాంకుల్లో నగదు నిండుకోవడంతో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ రూ.500 నోట్లు బ్యాంకులకు చేరుకోకపోవడంతో చిల్లర ఇబ్బందులు తీరడం లేదు. పాత నోట్లు అయిపోవడం, కొత్త నోట్లు లేకపోవడంతో బ్యాంకుల ముందు క్యూలు తగ్గడం లేదు. బుధవారం జిల్లాలోని చాలా బ్యాంకుల్లో మధ్యాహ్నం 12 గంటలకే లావాదేవీలు నిలిపివేశారు. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు అందక 6 వేల మంది జూట్ మిల్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ యూనియ¯ŒS నాయకులు ఏలూరులో రోడ్డెక్కారు. జూట్‌మిల్ ఎదుట రాస్తారోకో చేశారు. మరోవైపు ఏలూరులోని నిమ్మ మార్కెట్ మూతపడింది. దీంతో చాలా మందికి పని లేకుండా పోయింది. ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500 నగదు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ మెషిన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఆ మేరకు మార్పు చేయకపోవడంతో రూ.2 వేలు మాత్రమే వస్తున్నాయి. రూ.వంద నోట్లు ఏటీఎంలలో పెట్టిన క్షణాల్లోనే నిండుకుంటున్నాయి. దీంతో చిల్లర నోట్ల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. మార్కెట్లోకి రూ.2 వేల నోట్లు విడుదల కావడంతో చిల్లర కోసం పాట్లు తప్పడం లేదు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని బ్యాంకు అధికారులు సమాధానం చెబుతున్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు నిబంధనలు అనుసరిస్తూనే బ్యాంకర్లు కొత్త షరతులకు తెరలేపడంతో జనం చిన్న నోట్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల మార్పిడిలో భాగంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక బ్యాంకులో ఒకసారే నోట్లు మార్చుకోవాలన్న నిబంధనలతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తున్నారు. అసలే వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రూ.వంద నోట్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలను ఎన్నిసార్లు వినియోగించుకున్నా.. ఆ లావాదేవీలకు సంబంధించి చార్జీలు వసూలు చేయబోమని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే బ్యాంకులకు చిన్న నోట్లు రాకపోవడంతో ఏటీఎంలలో పెట్టడం లేదని, చార్జీలు రద్దు చేసినా ఫలితం లేకుండాపోయిందని పలువురు వాపోతున్నారు. -
వారంలో డబ్బిస్తానని మాటిచ్చి కొడుకు పెళ్లి చేశా
భూపాలపల్లి: ‘‘నా కొడుకు పెళ్లికి రెండు నెలల కిత్రమే నవంబర్ 9న ముహూర్తం నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేయడంతో పెళ్లి పను ల కోసం నిల్వ ఉంచిన నగదుకు విలువ లేకుండా పోయింది. వంట, షామి యానా, పురోహితుడు, బ్యాండు తదితర పెళ్లి ప నులకు అప్పటికే అడ్వా న్సులు చెల్లించాను. మిగిలిన డబ్బు చెల్లించడం కష్టంగా మారిం ది. చివరికి వారం రోజుల్లో మిగిలిన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి పెళ్లి జరిపిం చాను. వారు నా మాటను గౌరవించారు’’ - వేముల శ్రీనివాస్, భూపాలపల్లి 500 నోటు మార్పిడికి యాచకుడి పాట్లు రామన్నపేట: పెద్ద నోట్ల మా ర్పిడి ఓ యాచకుడికి తీవ్ర ఇబ్బందులు తె చ్చిపెట్టింది. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్ప త్రి జంక్షన్లో ఉండే ఓ యాచకుడు యాచన ద్వారా కూ డబెట్టుకున్న చిల్లరను రూ. 500 నోటుగా మార్చుకున్నాడు. అరుుతే రూ. వెరుు్య, రూ. 500 నోట్లు రద్దు అయినట్లు తెలియడంతో గురువారం ఉదయం తన వద్ద ఉన్న రూ. 500 నోటు మార్పిడి కోసం ఎంజీఎం వద్దనున్న ఎస్బీహెచ్ బ్రాంచ్‌కు చేరుకుని నిరీక్షించసాగాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐ శివరామయ్య దీన్ని గమనించి తన సిబ్బంది సాయంతో ఆ నోటు మార్పిడి చేసి యాచకుడికి చిల్లరనందించాడు. ఫొటోలో కనిపిస్తున్నది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రా మానికి చెందిన యువ సర్పంచ్ వైనాల మురళి. ఈ నెల 12 న వరంగల్ నగరం లోని ఓ పంక్షన్హాల్లో జరగనున్న తన పెళ్లి కోసం బంగారం, బట్టలు తీసుకున్నాడు. కిరాణా, కూరగా యలు చిల్లర ఖర్చుల కోసం రూ.50 వేల విలువైన పెద్దనోట్లు అట్టిపెట్టుకున్నాడు. గురువారం ఎక్కడికి వెళ్లినా పెద్దనోట్లు తీసుకోకపోవడంతో మిత్రులు, బంధువుల సహకారంతో ఆర్థిక అవసరాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల తనకు ఇబ్బంది ఎదురైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదేనని మురళి పేర్కొనడం గమనార్హం. -
నేడే కూతురు పెళ్లి...వంద నోట్లు ఇప్పించండి
బ్యాంకు మేనేజర్‌కు వధువు తల్లిదండ్రుల వేడుకోలు సంగెం: పెద్ద నోట్ల రద్దు పేదింట్లో పెద్ద తిప్పలు తెచ్చిపెట్టింది. వరం గల్ రూరల్ జిల్లా సంగెం మండ లంలోని కాట్రపల్లి గ్రామానికి చెంది న చోల్లేటి రజిత, మల్లారెడ్డి దంప తులు తమ కుమార్తె మౌనిక పెళ్లిని 11న (నేడు) జరపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికి అవసర మైన డబ్బు, ఇతర సామగ్రిని సమ కూర్చుకుంటున్నారు. బంధువులకు కార్డులు పంపిణీ చేశారు. అయితే రూ. 500, రూ. వెయి నోట్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో 9న పెళ్లి పనులకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం వరంగల్ నగరానికి వెళ్లిన మల్లారెడ్డికి ఏ షాపుకు వెళ్లినా రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని చెప్పారు. తన దగ్గర ఉన్నవన్నీ పెద్ద నోట్లే కావ డంతో ఏం చేయాలో పాలుపోలేదు. రోజంతా తిరి గి ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేయాల్సి వస్తుందేమేనని వారు మథన పడ్డారు. గురువారం ఉదయం సంగెం ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రాజమోహన్‌రావును కలసి పెళ్లి కార్డు చూపించి తమ గోడు వెళ్లబో సుకున్నారు. తెల్లవారితే పెళ్లి.. ఏ పని చేయాలన్నా డబ్బులు లేనిదే చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫారాలు ఇస్తానని, ఒక్కొక్కరికి రూ.4 వేలు వందనోట్లు ఇస్తానని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో వధువరుల తల్లితండ్రులు రజిత, మల్లారెడ్డిలు తమ బంధులను పిలిపించి రూ.20 వేలకు వందనోట్లు మార్చుకుని వెళ్లి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. -
పసిడి బాండ్లు... డబ్బు ఆర్బీఐకి
చేరేవరకూ 4% వడ్డీ! న్యూఢిల్లీ: నాలుగవ విడత పసిడి బాండ్లను కొన్నవారికిది శుభవార్తే. ఎందుకంటే బాండ్లకోసం ఇన్వెస్టర్లు చెల్లించిన డబ్బు ఎక్స్ఛేంజ్ లేదా ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ (ఐసీసీఎల్) నుంచి రిజర్వ్ బ్యాంక్‌కు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. అప్పటి నుంచే బాండ్లు జారీ అయి... వాటిపై వడ్డీ కూడా అందుతుంది. అయితే ఈ లోగా ... అంటే ఆర్బీఐకి చేరేలోగా ఎన్నిరోజులైతే అన్ని రోజులకు 4 శాతం వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రస్తుత సేవింగ్స్ బ్యాంక్ రేటుకు సమానం కావడం గమనార్హం. ఈ రేటు ప్రత్యక్షంగా ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమవుతుందని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్ఈ ప్లాట్‌ఫామ్‌పై సావరిన్ గోల్డ్ బాండ్ అలాట్ అయ్యేంతవరకూ బిడ్స్‌కు సంబంధించి వచ్చిన డబ్బుపై ఈ వడ్డీని ఐసీసీఎల్ ద్వారా చెల్లిస్తుందని తెలియజేసింది. అయితే డబ్బు విత్‌డ్రాయెల్స్ విషయంలో ఈ వడ్డీ చెల్లింపులు ఉండబోవని స్పష్టం చేసింది. నాల్గవ విడత గోల్డ్ బాండ్ పథకం 18న ప్రారంభమైంది. జూలై 22న ముగుస్తుంది. తరువాత బాండ్లు జారీ అవుతాయి. ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ కూడా జరిగే ఈ బాండ్ కూపన్ వార్షిక రేటు 2.75 శాతం. -
బ్రెజిల్ కరెన్సీ ఉందన్న అనుమానంతో ఇద్దరు అరెస్ట్
నేరేడ్మెట్(హైదరాబాద్): బ్రెజిల్ దేశానికి చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయన్న అనుమానంతో ఇద్దరు వ్యక్తులను నగరంలోని నేరేడ్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు ఉప్పల్ భరత్ నగర్‌కు చెందిన రియల్టీ వ్యాపారి నక్కా నవీన్(38), సత్య రాఘవేంద్ర కాలనీకి చెందిన ఫణీశ్వరరావు(40)గా పోలీసులు వెల్లడించారు. శనివారం నేరేడ్మెట్ చౌరస్తా గ్రీన్ బావార్జి హోటల్ దగ్గర వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బ్రెజిల్ దేశానికి చెందిన 196 కరెన్సీ నోట్ల(ఒక్కోటీ వెయ్యి రూపాయల విలువైన)ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.