నేడే కూతురు పెళ్లి...వంద నోట్లు ఇప్పించండి
నేడే కూతురు పెళ్లి...వంద నోట్లు ఇప్పించండి
Published Fri, Nov 11 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
బ్యాంకు మేనేజర్‌కు వధువు తల్లిదండ్రుల వేడుకోలు
సంగెం: పెద్ద నోట్ల రద్దు పేదింట్లో పెద్ద తిప్పలు తెచ్చిపెట్టింది. వరం గల్ రూరల్ జిల్లా సంగెం మండ లంలోని కాట్రపల్లి గ్రామానికి చెంది న చోల్లేటి రజిత, మల్లారెడ్డి దంప తులు తమ కుమార్తె మౌనిక పెళ్లిని 11న (నేడు) జరపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెళ్లికి అవసర మైన డబ్బు, ఇతర సామగ్రిని సమ కూర్చుకుంటున్నారు. బంధువులకు కార్డులు పంపిణీ చేశారు. అయితే రూ. 500, రూ. వెయి నోట్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో 9న పెళ్లి పనులకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం వరంగల్ నగరానికి వెళ్లిన మల్లారెడ్డికి ఏ షాపుకు వెళ్లినా రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని చెప్పారు.
తన దగ్గర ఉన్నవన్నీ పెద్ద నోట్లే కావ డంతో ఏం చేయాలో పాలుపోలేదు. రోజంతా తిరి గి ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేయాల్సి వస్తుందేమేనని వారు మథన పడ్డారు. గురువారం ఉదయం సంగెం ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రాజమోహన్‌రావును కలసి పెళ్లి కార్డు చూపించి తమ గోడు వెళ్లబో సుకున్నారు. తెల్లవారితే పెళ్లి.. ఏ పని చేయాలన్నా డబ్బులు లేనిదే చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫారాలు ఇస్తానని, ఒక్కొక్కరికి రూ.4 వేలు వందనోట్లు ఇస్తానని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో వధువరుల తల్లితండ్రులు రజిత, మల్లారెడ్డిలు తమ బంధులను పిలిపించి రూ.20 వేలకు వందనోట్లు మార్చుకుని వెళ్లి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement