త్వరలోనే ఆమోదముద్ర
- బీథర్మల్ విస్తరణకు సర్కారు ‘నో’
- 800 మెగావాట్లకే బీథర్మల్ పరిమితం
రామగుండం : ఎన్టీపీసీ కోరినట్లు రామగుండం ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అప్పగించేందుకు సర్కారు సిద్ధమైనట్లు సమాచారం. జూలై 15న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఎన్టీపీసీ ఉన్నతాధికారులు ప్లాంట్ సమీపంలోని బీపీఎల్ (బ్రిటీష్ ఫిజికల్ లా బోరేటరీ) భూములను అప్పగిస్తే ఎలాంటి నిధుల సమీకరణ (పెట్టుబడి) లేకుండానే మూడేళ్లలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నిర్దేశిత ధరకు విక్రయిస్తామని పేర్కొనడంతో ప్రభుత్వం బీపీఎల్ ఆస్తులను కట్టబెట్టేందుకు ముందుకొచ్చిన ట్లు తెల్సింది. దీనిపై త్వరలోనే ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. విద్యుత్‌ను ఎన్నేళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేయాలనే ఒప్పందం మాత్రం చర్చకు రానట్లు సమాచారం.
ఎన్టీపీసీ ఆధీనంలోకి బీపీఎల్, సింగరేణి భూములు
ఎన్టీపీసీకి ఇప్పటికే 4,924 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. మరో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలంటే మరో మూడు వేల ఎకరాలు అవసరం. ఈ క్రమంలో బీపీఎల్‌కు చెందిన 1,620 ఎకరాలు పోను మిగిలిన భూమిని సింగరేణి నుంచి కేటాయిం చేందుకు ముమ్మర చర్యలు సాగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొం దిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో ప్రతి రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఎకరం విస్తీర్ణం అవసరముంటుందని విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన ఎన్టీపీసీకి రెండు వేల ఎకరాలు సరిపోతుంది. కానీ మరో వెయ్యి ఎకరాలు అదనంగా జమకానుంది.
6,400 మెగావాట్లకు జెన్‌కో ప్రతిపాదనలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌కేంద్రాలను విస్తరించి మరో 6,400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జెన్‌కో నివేదికలు రూపొందించింది. ఇందులో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 800 మెగావాట్లు, మణుగూరులో నాలుగువేల మెగావాట్లు, రామగుండంలో 800 మెగావాట్లు, కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (భూపాలపల్లి-కేటీపీపీ)లో 800 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 600 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
బీ-థర్మల్ కేంద్రం విస్తరణకు భూసమస్య
రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ-థర్మ ల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు స్థల సేకరణ సమస్యగా మారింది. విస్తరణకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ఫైల్‌ను పరిశీలించాల్సి ఉందంటూ నిలిపివేసినట్లు సమాచారం. బీ-థర్మల్ కేంద్రానికి పక్కనే ఉన్న బీపీఎల్ సంస్థకు చెందిన 400 ఎకరాలను కేటాయిస్తే విస్తరణ సాధ్యమని విద్యుత్ సౌధ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రామగుండంలో 660 మెగావాట్లతో రెండు సూపర్ క్రిటికల్ యూనిట్లను రూ. నాలుగు వేల కోట్లతో స్థాపిస్తామని ప్రకటిం చారు. టీఆర్‌ఎస్ కూడా పార్టీ మేనిఫెస్టోలో రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం తో కూడిన మూడు యూనిట్లను ఏర్పాటు చేస్తామని పొందుపర్చింది. ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
ఎన్టీపీసీకి బీపీఎల్ ఆస్తులు?
Published Mon, Aug 4 2014 2:33 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement