ఢాకా: ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆ దేశ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్ కామెరూన్ డెల్‌పోర్ట్ ఓ ఉచిత సలహా ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్ల నుంచి భారీ హిట్లు రాకపోవడానికి మాంసాహారాన్ని తగినంత తీసుకోలేకపోవడమేనని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్లు మరింత మాంసాహారం తింటే హిట్టింగ్‌కు, ఎక్కువ చెమటోడ్చడానికి ఉపయోగడపడుతుందన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పూర్ రేంజర్స్ తరఫున ఆడుతున్న డెల్‌పోర్ట్..
‘క్రికెట్‌లో మరింత శ్రమించి ఫలితాలు రాబట్టాలంటే మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.బౌండరీ లైన్ పైనుంచి బంతిని హిట్ చేయాలంటే మీరు మాంసాహారం డోస్ పెంచండి. నేను ఫిట్‌గా ఉండటమే కాకుండా బలంగా షాట్లు కొడుతున్నానంటే అందుకు మాంసాహారమే కారణం. బంగ్లాదేశ్‌లో బంతి ఎక్కువగా బౌన్స్ కాదు.. ఎప్పుడూ కింది స్థాయిలోనే వస్తుంది. అదే దక్షిణాఫ్రికాలో అయితే కచ్చితమైన బౌన్స్ ఉంటుంది. మా దక్షిణాఫ్రికా క్రికెటర్లు హిట్టర్లు కావడానికి మా ట్రూ బౌన్సే ఒక కారణం. మరి బౌన్స్‌లేని బంగ్లాదేశ్‌లో భారీ హిట్లు చేయాలంటే కండరాలకు మరింత శక్తి కావాలి. అది మాంసాహారం వల్లే వస్తుంది. బాగా మాంసం తినండి.. హిట్ చేయండి’ అంటూ బంగ్లాదేశ్ క్రికెటర్ల పేలవ ప్రదర్శనను వేలెత్తి చూపాడు.(ఇక్కడ చదవండి: ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?)
Comments
Please login to add a commentAdd a comment