ఢాకా:సాధారణంగా ఫాస్ట్ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ ముక్కలవడం కానీ, వికెట్ విరిగి పడటం కానీ చూస్తూ ఉంటాం. అయితే ఒక స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగి ముక్కలవడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ తరహాలో స్పిన్నర్ బౌలింగ్ లో వికెట్ సగానికి విరిగిన ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చోటు చేసుకుంది. అఫ్ఘనిస్తాన్ స్సిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఓ బంతి బ్యాట్స్ మన్ వెనుక ఉన్న మిడిల్ స్టంప్ ను బలంగా తాకింది. దీంతో ఆ వికెట్ ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం చిట్టగాంగ్-కొమిల్లా విక్టోరియా మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. దానిలో భాగంగా ఈ టోర్నీలో కొమిల్లా విక్టోరియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ఖాన్ 16 వ ఓవర్ వేసేందుకు కు బంతిని అందుకున్నాడు. రషీద్ వేసిన రెండో బంతిని చిట్టగాంగ్ కు ఆడుతున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ మునవీర ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతిని బ్యాట్స్‌మెన్ తప్పుగా అంచనా వేయడంతో అది వేగంగా వెళ్లడమే కాకుండా నేరుగా వెళ్లి మిడిల్ వికెట్ ను తాకింది. దీంతో మధ్యలో ఉన్న వికెట్ ముక్కలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది, రషీద్ వేసిన గూగ్లీకి బ్యాట్స్‌మెన్‌తో పాటు వికెట్ కూడా ఔట్ అయింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అఫ్ఘాన్ సంచలనమైన రషీద్ ఖాన్ గడిచిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment