
'నేను బీపీఎల్ ఎంపీని'
న్యూఢిల్లీ: తాను దారిద్ర్య రేఖకు దిగువున(బీపీఎల్) ఉన్నవాడినని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అదీర్ రంజన్ చౌదరీ అన్నారు. బీపీఎల్ ఎంపీలందరికి ప్రత్యేక కేటగిరి ఉండాలని చెప్పారు. బెంగాలీ కుటుంబానికి చెందిన అదీర్ రంజన్ ప్రస్తుతం లోక్ సభలో ఎంపీగా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ లోని భరంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన ముందునుంచే కాస్తంత వివాదాస్పద నేతగా ఉన్నారు.