త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు | BPL Makes microwave ovens refrigerator and air coolers coming soon | Sakshi
Sakshi News home page

త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు

Published Sat, Feb 25 2017 5:44 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు

త్వరలో బీపీఎల్‌ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు

హైదరాబాద్‌: బీపీఎల్‌ కంపెనీ త్వరలో మైక్రో వేవ్‌ ఓవెన్‌లు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌ కూలర్లు, ఏసీలను అందించనున్నది. ప్రస్తుతం తామందిస్తున్న ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషీన్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని బీపీఎల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ అంచనాలను మించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఆర్జించబోతున్నామని బీపీఎల్‌ సీఎండీ అజిత్‌ నంబియార్‌ పేర్కొన్నారు.

కొత్తగా అందించనున్న ఓవెన్‌లు, ఏసీలు తదితర ఉత్పత్తులతో మూడేళ్లలో రూ.500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం 4 రకాల ఎల్‌ఈడీ టీవీలను, సెమీ, ఫుల్లీ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement