air coolers
-
మండే ఎండల్లో కూల్ ఆఫర్స్.. ఏసీ కొనటానికి ఇదే మంచి సమయం
అసలే ఎండలు మండిపోతున్నాయి, భానుడి ఉష్ణోగ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది ఎయిర్ కూలర్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే AC ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది కొనటానికి సంకోచిస్తారు. అలాంటి వారికోసం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ తీసుకువచ్చింది. దేశీయ ఆన్లైన్ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏసీ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ కథనంలో భారతీయ విఫణిలో రూ. 40,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఏసీలను గురించి తెలుసుకుందాం.. ఎల్జీ ఏఐ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: ఎల్జీ కంపెనీకి చెందిన 1.5 టన్ ఎల్జీ ఏసీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,990. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం లేదా రూ.1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఇందులో 6 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. అంతే కాకుండా ఏఐ డ్యూయెల్ ఇన్వర్టర్ 2 వే స్వింగ్, హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. శాంసంగ్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: శాంసంగ్ కంపెనీకి చెందిన 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ ధర దేశీయ మార్కెట్లో రూ. 35,499. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 10% లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఏసీలో 5 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. బ్లూ స్టార్ కన్వర్టెబుల్ 2023 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ: మార్కెట్లో 1.5 టన్ బ్లూ స్టార్ ఏసీ ధర రూ. 36,190. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుచేసే కస్టమర్లు ఇప్పుడు 10% ఆఫర్ పొందవచ్చు. ఈ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉండటం వల్ల మంచి పనితీరుని అందిస్తుంది. సెల్ఫ్ డయగ్నాసిస్, డస్ట్ ఫిల్టర్, స్టెబులైజర్ ఫ్రీ ఆపరేషన్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: వోల్టాస్ కంపెనీకి చెందిన 1.5 టన్ ఏసీ ధర రూ. 33,490 మాత్రమే. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం లేదా రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఆటో అడ్జెస్టెబుల్ టెంపరేచర్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండటం వల్ల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. -
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల విరాళం 11.90 కోట్లు...
న్యూఢిల్లీ: కరోనాపై పోరు బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.11.90 కోట్ల విరాళం ఇవ్వనున్నారు. దాదాపు 29,600 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సింఫనీ సహాయం..: కాగా కోవిడ్–19పై పోరాటంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 ఎయిర్ కూలర్లను సరఫరా చేయాలని ప్రముఖ ఎయిర్ కూలింగ్ కంపెనీ సింఫనీ నిర్ణయించింది. ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, ఇతర హెల్త్‌కేర్ సెంటర్లలో ఈ ఎయిర్ కూలర్లను గుజరాత్ ఆరోగ్యశాఖ వినియోగించనుంది. -
చల్లచల్లని.. కూల్ కూల్..
లక్నో : ఎండాకాలం పోయి నెలలు గడుస్తున్నా ఉక్కపోత ఏమాత్రం తగ్గడం లేదు. భూతాపం, వాతావరణ మార్పులు.. కారణమేదైనా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడికి విరుగుడుగా ఫ్యాన్లు, ఏసీలే అవసరమవుతున్నాయి. అయినా చల్లదనం రాకపోగా.. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. మరి.. ప్రత్యామ్నాయం? గంపెడు మట్టి, కాసింత సాంకేతికత అంటోంది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న యాంట్ స్టూడియో ఎల్ఎల్పీ! మట్టి కుండలో ఉండే సహజసిద్ధమైన రంధ్రాల ద్వారా నీరు వ్యాకోచించి చల్లబడటం దీనికి కారణం. మట్టి కుండ స్థానంలో బోలెడన్ని మట్టి గొట్టాలు.. వాటిపై ధారగా నీళ్లు.. ఆ వెనుకనే చిన్న చిన్న ఫ్యాన్లు ఉన్నాయనుకోండి.. అతి తక్కువ ఖర్చుతో పనిచేసే ఎయిర్ కూలర్ సిద్ధమవుతాయని అంటున్నారు యాంట్ స్టూడియో వ్యవస్థాపకుడు, తెలుగు వాడైన సిరిపురపు మోనీశ్కుమార్. అనడం మాత్రమే కాదు.. ఇలాంటి సహజ సిద్ధమైన ఎయిర్ కూలర్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేస్తున్నారు. లక్నో వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్)లో ఈ వినూత్న ఆలోచనను ప్రదర్శనకు పెట్టిన మోనీశ్ను ‘సాక్షి’పలకరించింది. -
సీఎం ఆదిత్యనాథ్ కోసం 20 కూలర్లు
-
సీఎం ఆదిత్యనాథ్ కోసం 20 కూలర్లు
అలహాబాద్: ‘నాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకండి. అందరిలాగే నన్ను పరిగణించండి’ అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలిచ్చి కనీసం 24గంటలు కూడా పూర్తి కాకుండానే తిరిగి అదే పద్ధతిని కొనసాగించారు. ఆయన వస్తున్నారని తెలిసి ఓ ఆస్పత్రిలోకి పెద్ద మొత్తంలో కూలర్లు తెప్పించారు. తిరిగి ఆయన వెళ్లిపోగానే రిక్షాలపై వేసుకొని వెళ్లిపోయారు. అలహాబాద్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి ఆదివారం సీఎం ఆదిత్యనాథ్ వెళ్లారు. ఎముకల వ్యాధుల డిపార్ట్మెంట్కు వెళ్లి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేయొద్దని సీఎం చెప్పినా వినకుండా 20 కూలర్లు అద్దెకు తీసుకొచ్చిన అధికారులు తిరిగి వాటిని కార్యక్రమం ముగిశాక పంపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలవ్వగా.. తమ ఆస్పత్రిలో 70 నుంచి 80 కూలర్లు ఉన్నాయని, అందులో కొన్ని పనిచేయకపోవడంతో వాటిని తెప్పించామని అటు వైద్యాధికారులు, అక్కడి ప్రభుత్వాధికారులు సమర్థించుకున్నారు. అయితే, సీఎం వెళ్లిన తర్వాత కూడా ఉంచితే బాగుంటుంది కదా అని రోగులు వాపోతున్నారు. -
త్వరలో బీపీఎల్ నుంచి ఏసీలు, ఫ్రిజ్‌లు
హైదరాబాద్: బీపీఎల్ కంపెనీ త్వరలో మైక్రో వేవ్ ఓవెన్లు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కూలర్లు, ఏసీలను అందించనున్నది. ప్రస్తుతం తామందిస్తున్న ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని బీపీఎల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ అంచనాలను మించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం ఆర్జించబోతున్నామని బీపీఎల్ సీఎండీ అజిత్ నంబియార్ పేర్కొన్నారు. కొత్తగా అందించనున్న ఓవెన్లు, ఏసీలు తదితర ఉత్పత్తులతో మూడేళ్లలో రూ.500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం 4 రకాల ఎల్ఈడీ టీవీలను, సెమీ, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. -
విమ్ ప్లాస్ట్ ఎయిర్ కూలర్స్ ఇక కూల్ కూల్!
హైదరాబాద్: విమ్ ప్లాస్ట్ కంపెనీ తన ఎయిర్ కూలర్స్ విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది. ఇందుకు గుజరాత్ హైకోర్ట్ తగిన ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... సింఫనీ కంపెనీ గాంధీనగర్ జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ... విల్ ప్లాస్ట్కు చెందిన సెల్లో బ్రాండ్ ఎయిర్ కూలర్ మోడళ్లు- మార్వెల్, వేవ్, టోవర్లు తమ కంపెనీ రిజిస్ట్రర్ డిజైన్లయిన వింటర్, సుమో, డైట్ మోడళ్లను పోలివున్నాయని పేర్కొంది. వీటి విక్రయాలను నిలుపుచేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనితో జిల్లా కోర్టు సింఫనీకి అనుకూలంగా రూలింగ్ ఇస్తూ... విమ్ ప్లాస్ట్ కూలర్ మోడళ్లు టవర్-25, టోవర్-50, వేవ్, మార్వెల్ అమ్మకాన్ని నిలుపుచేసింది. దీనిని సవాలుచేస్తూ... విమ్ ప్లాస్ట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం దిగువకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. దీనితో విమ్ ప్లాస్ట్ తమ మోడళ్లను ఎటువంటి ఇబ్బందులూ లేకుండా విక్రయించుకోడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.36 పెరిగి (2 శాతం) రూ.1,825కు చేరింది.