
చోరీ జరిగిన సెల్‌ఫోన్ షాపు ఇదే
సాలూరు: పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్‌ఫోన్ షాపులో శనివారం రాత్రి చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శివ సెల్ పాయింట్ వెనుకభాగంలో పైకప్పును పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు దొంగిలించకుపోయారు.
పట్టణ పోలీసులకు ఆదివారం ఉదయం ఫిర్యాదు అందడంతో ఎస్సై ఫకృద్దీన్, సీఐ ఇలియాజ్ మహ్మద్ పరిశీలించారు. దొంగలను కనిపెట్టేందుకు విజయనగరం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి, వేలిముద్రలు సేకరించారు.
ఇదే షాపులో మూడుసార్లు చోరీ
ఇదిలా ఉడగా గడిచిన కొద్ది సంవత్సరాలలో ఇదే షాపులో మూడుసార్లు దొంగతనం జరగడం గమనార్హం. షాపు వెనుకభాగం నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు చెలరేగిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment