సాలూరు: మండలంలో తాజాగా మరో నలుగురు రంగురాళ్ల వ్యాపారులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారినుండి సమాచారాన్ని రాబట్టేపనిలో నిమగ్నమైనట్టు సమాచారం. మండలంలో రంగురాళ్ల తవ్వకాలు, అమ్మకాలకు చెక్ పెట్టేందుకు గతంలో కన్నా భిన్నంగా పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.
గత నెల లో ఏకంగా 13 మంది వ్యాపారులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అక్రమ సంపాదన రుచి మరిగిన కొందరు వ్యాపారులు వెరవకుండా తమ పనిని నిరాటంకంగా కానిస్తున్నారు. మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తవ్వకాలను జరిపిస్తూ రంగురాళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలియటంతో సారిక, నేరెళ్లవలస, సొంపిగాం గ్రామాలకు చెందిన నలుగురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిదగ్గరున్న రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
వారు అమాయకులని, విడిచిపెట్టాలని పలువురు మహిళలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నట్టు సమాచారం. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఈ తరహా వ్యాపారం మానుకోమని మీ మగవాళ్లకు చెప్పాలని వారికి సూచించినట్ట్టు సమాచారం. అదుపులో ఉన్నవారు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొందరిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
పోలీసుల అదుపులో రంగురాళ్ల వ్యాపారులు!
Published Thu, Aug 13 2015 12:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement