‘పోలీసులకు సమాచారమిస్తే చంపేస్తాం’ | maoists letter halchal in vijayanagaram district | Sakshi
Sakshi News home page

‘పోలీసులకు సమాచారమిస్తే చంపేస్తాం’

Published Wed, Mar 23 2016 10:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists letter halchal in vijayanagaram district

సాలూరు: తమ కార్యకలాపాలు, కదలికలపై పోలీసులకు సమాచారం అందించిన వారికి తగిన శాస్తి తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జాకరివలస గ్రామానికి చెందిన పూసూరు వెంకట్రావు అనే వ్యాపారిని మంగళవారం మావోయిస్టులు హతమార్చారు. అతని మృతదేహం వద్ద మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు.

తమ ఉనికిపై పోలీసులకు ఉప్పందిస్తూ పార్టీకి నష్టం కలిగించేలా వెంకట్రావు వ్యవహరించాడని అందులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ మావోయిస్టు కోరాపుట్ డివిజన్ కమిటీ పేరిట ఆ లేఖ ఉంది. ఈ విషయమై ఓఎస్డీ అప్పలనాయుడును సంప్రదించగా లేఖలో రాత కొరాపుట్ దళ కమాండర్ అరుణక్కదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement