informers
-
'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీల్లో సీఎం కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉన్నారన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ వ్యాఖ్యలు కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. బీజేపీలో నిజంగానే కేసీఆర్ ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఉంటే అలాంటి నాయకులెవరు? కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరిస్తున్నది ఎవరు? అసలు ఈటల ఉద్ధేశం ఏమిటన్న అంతర్గత చర్చకు కారణమయ్యాయి. ఈ సందేహాలను బలపర్చేలా ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొందరు నేతల పేర్లు ప్రాథమిక చర్చల సమయంలోనే లీకవడంపై రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోవర్టులను గుర్తించి, కట్టడి చేయడంపై బీజేపీ ముఖ్యులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. చేరికలకు ఇబ్బందిగా లీకులు రాష్ట్ర కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొందరు నేతలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇటీవల ఆ పారీ్టలో రచ్చకు కారణమయ్యాయి. పార్టీ వర్గాలు చీలి పోయి, ఆరోపణలు ప్రత్యారోపణల దాకా పరిస్థితి వెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ సహా అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ ఈటల రాజేందర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈటల ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచి్చందనే దాని నుంచి.. బీజేపీలో ఎవరు కోవర్టులనే దాకా ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఇటీవల మీడియా ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఆఫ్ ది రికార్డ్‌గా ఈటల చేసిన వ్యాఖ్యలపైనా చర్చజరుగుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కనీ్వనర్‌గానూ ఈటల వ్యవహరిస్తున్నారు. అలాంటిది తానే స్వయంగా కోవర్టుల ఆరోపణలు చేయడం, బీజేపీలో చేరబోయే ఇతర పారీ్టల నేతల పేర్లు ముందుగానే లీక్ కావడంతో వారు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఏ రాజకీయ పారీ్టలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని.. బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోవర్టుల కట్టడి ఎలా? ఒకవేళ బీజేపీలో కేసీఆర్ కోవర్టులు, ఇన్ఫార్మర్లు ఉంటే వారు ఏ స్థాయిలో ఉన్నారు? వారిని ఎలా గుర్తించాలనే చర్చ కూడా సాగుతోంది. అలాంటి వారిని ఆధారాలతో గుర్తించడంతోపాటు కట్టడి చేయడం, అవసరమైతే పక్కనపెట్టడం ఎలాగన్న ఆలోచనలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అయితే ఈ కోవర్టులు/ఇన్ఫార్మర్ల అంశం మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే తెరపైకి వచి్చంది. ఉప ఎన్నికను జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాయి. అధికార పార్టీ అభ్యర్థిని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడిస్తే.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మరింత సానుకూలత వస్తుందని, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆశించాయి. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినా.. రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందడానికి కేసీఆర్ కోవర్టులే కారణమనే ఆరోపణలు వచ్చాయి. మునుగోడు పోలింగ్‌కు కేవలం కొన్నిరోజుల ముందు.. కొందరు నేతలు తిరిగి కేసీఆర్, కేటీఆర్‌ల సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. మునుగోడులో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలను కోవర్టుల ద్వారా తెలుసుకోవడం వల్ల పారీ్టకి నష్టం జరిగిందన్న చర్చ జరిగింది. ఇంకా అభ్యర్థుల కోసమే..! బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలలు కూడా లేదు. అయినా బీజేపీకి మెజారిటీ సీట్లలో బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట తప్పడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు వేసుకున్న అంచనాల ప్రకారం.. 30 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులు, మరికొన్నిచోట్ల ఫర్వాలేదనే స్థాయిలో అభ్యర్థులు ఉన్నారని.. చాలాచోట్ల గట్టి అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి ఉందని అంటున్నాయి. బీజేపీలో టికెట్ కేటాయింపుపై భరోసా, ఇతర అంశాలపై స్పష్టత రానందునే.. నేతల చేరికలు ముందుకు పడటం లేదని పేర్కొంటున్నాయి. ఈటల ఉద్దేశమేమిటి? ‘ఆశించిన మేర బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ముఖ్య నేతలు ఇంకా బీజేపీలో చేరకపోవడానికి కోవర్టు రాజకీయాలే ప్రధాన కారణమనే అభిప్రాయంతో ఈటల ఉన్నారా? లేక బీజేపీలో కుదురుకునే విషయంలో ఈటల ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు?’ అనే చర్చ బీజేపీలో నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్లో నంబర్–2గా ఉంటూ కేసీఆర్ పన్నే రాజకీయ వ్యూహాలు, ఆయా సందర్భాల్లో వ్యవహరించే తీరు తెలిసిన వ్యక్తిగా ఈటలకు బీజేపీ జాతీయ నాయకత్వం తగిన ప్రాధాన్యతే ఇస్తోందని పారీ్టవర్గాలు చెప్తున్నాయి. మరి ఆయన రాష్ట్రపారీ్టలో ఇంకా పూర్తిగా ఇమడలేకపోతున్నారా? తగిన గౌరవం, ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తితో ఉన్నారా? అన్న చర్చ కూడా సాగుతోంది. -
13 మంది మావోయిస్టుల లొంగుబాటు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లా ఎస్పీ అభిషేక్‌మిన్నా ఎదుట సోమవారం మధ్యాహ్నం 13మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. దళంలో చిన్న చూపు చూస్తున్నారు. గిరిజనుల కోసమే పోరాటం అంటూనే వారి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనులను అడ్డుకుంటున్నారు. అగ్రనేతలు ప్రాణాలు కాపాడడం కోసం చిన్న కేడర్ నేతలను ముందు ఉంచి బలి చేస్తూ వారు తప్పించుకుంటున్నారు. మహిళా మావోయిస్టులకు దళంలో రక్షణ కరువైంది. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుచేతనే తాము మనస్తాపం చెందిన లొంగిపోతున్నమని మావోయిస్టులు ఎస్పీకి తెలిపారు. అలాగే తమ గిరిజనులపై ఇన్ఫార్మర్ల నెపం మోపి తమ చేతనే హత్యలు చేయిస్తున్నారని ఆవేదన చెందారు. మాకు ఇవి నచ్చడం లేదు..ప్రజాసేవ చేయాలంటే జనజీవనంలోకి వచ్చి చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ అభిషేక్‌మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులంతా దర్భ డివిజన్‌కు చెందినవారని తెలిపారు. -
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
మల్కన్‌గిరి: ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రంలోని ఎంవీ-79 పోలీసు లిమిట్స్‌లోని సుధాకొండ గ్రామంలోకి నక్సలైట్లు ప్రవేశించి బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి వీరిని కాల్చి చంపడం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
మహారాష్ట్ర: తమ సమాచారం గురించి పోలీసులకు ఉప్పందిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీప అటవీ ప్రాంతంలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఇది గుర్తించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఇన్ఫార్మర్లకు సహ చట్టమా?
విశ్లేషణ ఆదాయ పన్ను అధికారులనుంచే సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించి.. వారికే దాన్ని ఇచ్చి, బహుమతి సొమ్ము తీసుకుని బతకడం అంటే పది రూపాయలు ఖర్చుపెట్టి లక్షలు సంపాదించడం, ప్రజాప్రయోజనం కాదు. సంపన్నుల ఆదాయపు పన్ను (ఆ.ప.) చెల్లింపు పత్రాలు అందరికీ ఇవ్వవల సిన పత్రాలు కాకపోయినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎవరైనా అధికారికి, చట్టం కింద బాధ్యతలు నిర్వహించే వారికి ఇవ్వాలని నిర్ణయించే అధికారం ఆ.ప. అధికారు లకు ఉందని ఆదాయపన్ను చట్టం సెక్షన్ 138 వివరి స్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికి వార్షిక ఆ.ప. పత్రాలు ఇవ్వాలో తెలిపే నోటిఫికేషన్లు ఎన్నో జారీ చేసింది. ఆ.ప. పత్రాలు సొంత సమాచారమే అయినప్పటికీ, ప్రజా శ్రేయస్సుకోసం సమాచారం ఇవ్వాలని సెక్షన్ 8(1)(జె)లో మినహాయింపు ఆదేశిస్తున్నది. వందలాదిమంది సంపన్నులు ఇచ్చిన ఆ.ప. వార్షిక పత్రాల ప్రతులు ఇవ్వాలని ఒక గుప్త, స.హ. చట్టం కింద కోరారు. మొత్తం దస్తావేజులు చూపాలని, అడిగిన పత్రాల ప్రతులు ఇవ్వాలని అడిగారు. మరో దరఖాస్తులో ఢిల్లీ, కేంద్ర ఢిల్లీ, చండీగఢ్, ముంబైలో పనిచేసే సివిల్ ఆ.ప. అధికారులందరికి చెందిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ సమాచారం ఇవ్వాలంటే మొత్తం అరడజను కార్యాలయాల్లోని కొన్ని లక్షల దస్తావేజుల ప్రతులు తయారు చేయా ల్సిందే. అధికారుల ఆదాయాలు, ఆస్తులు, వారి జీవన భాగస్వాముల ఆస్తులు ఓ లెక్క పత్రం లేకుండా టన్ను లకొద్దీ కాగితాలను అడిగాడీ మహానుభావుడు. 101 మంది అధికారుల సమాచారం, ఆగస్టు 2003 నుంచి సెప్టెంబర్ 2005 దాకా పనిచేసిన అధికారులు లేదా 2005 నుంచి జవాబు ఇచ్చేనాటికి ఉన్న అందరు అధి కారుల సమాచారం ఇవ్వాలని అడిగాడు. అడ్డూ అదుపూ లేకుండా అనంత సమాచారం కోసం ఓ పదిరూపాయలు ఇచ్చి గాలం వేసాడీ గుప్త. నిజానికి ఈయన ఎంత అడిగారో లెక్కించడం సాధ్యం కాదు. అతనూ అంచనా చేయలేడు. ఇందుకు సిగ్గు పడ కపోవడం విచిత్రం. ఈ దరఖాస్తు చదవడమే హింస. వేధింపు. తానెవరన్నది తానే చెప్పుకున్నాడు. ఇన్ఫా ర్మర్ అట. అంటే పన్ను ఎగవేత రహస్య సమాచారం చెప్పి బహుమతి సొమ్ము తీసుకునే వృత్తి ఈయనది. ఈ విధంగా కొందరు ఇన్ఫార్మర్లు తమకు ఇవ్వవలసిన బహుమతి సొమ్ము ఇవ్వలేదని కోర్టులో దావా వేశారు. బహుమతి సొమ్ము హక్కు కాదని, వారిచ్చిన సమా చారం నిజంగా పన్ను ఎగవేతను అరికట్టి ప్రభుత్వానికి మేలు చేసినట్టయితేనే బహుమతి ఇస్తారని, అదీ 2.5 లక్షల రూపాయలకు మించబోదని ఆ.ప. ఉన్నతాధి కారులు 2015లో ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను ఎగవేతదారులను పట్టుకుని పన్ను వసూలు చేరుుంచి దేశసేవ చేస్తున్నాడట. ఇది ప్రజా ప్రయోజనమేనట. కనుక తానడిగిన సమాచారం కట్టలు కట్టలుగా గానీ సీడీలుగా గానీ సేకరించి ఇవ్వాలట. స.హ. చట్టం సెక్షన్ 11(2) ప్రకారం మీ సమా చారం అడుగుతున్నారు మీరేమంటారు అంటూ సమా చార అధికారి సంప్రదింపు ఉత్తరాలు రాశారు. వారంతా ఇది తమ సొంత సమాచారమనీ ఎవరికీ ఇవ్వకూడదని అభ్యంతరం చెప్పారు. దాంతో సమా చార అధికారి సమాచారం ఇవ్వలేదు. ఆ.ప. అధికారులనుంచే సహ చట్టం కింద సమా చారం వసూలుచేసి వారికే దాన్ని ఇచ్చి, బహుమతి సొమ్ము తీసుకుని బతకడం ఈయన వృత్తి అంటే, పదిరూపాయలు ఇచ్చి లక్షలు సంపాదిస్తాననడం, అదే ప్రజాప్రయోజనం అనడం సమంజసమా? తప్పించు కునే ఎగవేతదారుల రహస్య సమాచారం ఇవ్వడానికి బహుమతులు కాని, ఈవిధంగా స.హ. చట్టాన్ని వాడు కునే వృత్తిని రూపొందించడానికి కాదు. పన్ను చెల్లిం చని చీకటి ఆదాయాన్ని వెల్లడించడం అంటే ఇది కాదు. ఇది కేవలం దుర్మార్గం. ఇటువంటి దరఖాస్తులు లెక్కకు అందనన్ని విసురుతున్నాడీ మహానుభావుడు. అప్పీలు విచారణలో కూడా ఈ వ్యక్తి తన దుర్మార్గపు ప్రవర్తనను చాటుకున్నాడు. ఎవరన్నా అతనికి గౌరవం ఉన్నట్టు లేదు. సమాచారం ఇస్తావా? చస్తావా? అనే ధోరణిలో అతను వ్యవహరించడం దారుణం. ఇదివరకు ఈ గుప్త దరఖాస్తులను స్వీకరించి సీఐసీ కొంత సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాని ఇది అన్యాయమని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర రుుస్తే, ఆ ఆదేశాలు చెల్లవని, ఇతనికి ఈ విధంగా సమాచారం అడిగే హక్కులేదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు బుర్రకు తోచినట్టు సమాచారం అడగడం పారదర్శకతకు సంబంధంలేని వ్యవహార మని, పాలన అభివృద్ధి చేయడానికి అవసరమైన పార దర్శకత కోసం వచ్చిన చట్టాన్ని పాలనను పక్కదారి పట్టించేందుకు అసలు ఏ పనీ చేయలేని విధంగా స్తంభింపజేసేందుకు వాడడం అసమంజసమని సుప్రీంకోర్టు సీబీఎస్ఈ వర్సెస్ ఆదిత్య బందోపా ధ్యాయ్ కేసులో 2011లో సమాచార హక్కు దుర్విని యోగాన్ని దుయ్యబట్టింది. ఇటువంటి సమాచారం అడగడమే కాకుండా అప్పీలు విచారించే న్యాయమూర్తి వంటి కమిషనర్‌పైన అవాకులు చవాకులు పేలి నిందలు వేసే వారిని స.హ. హక్కు నుంచి వెలివేసినా తప్పులేదని మద్రాస్ హైకోర్టు 2013లో తీర్పు ఇవ్వడా నికి ఇటువంటి వారే కారణం. సీఐసీ ఇద్దరు సభ్యుల పీఠం ఈ అప్పీళ్లను తిరస్కరించింది. (ఇఐఇ/ఈ/అ/20 11/002965 కేసులో తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
పక్క రాష్ట్రంలో.. పక్కా సమాచారంతో..
► శోభన్‌ను వెంటాడిన ఇన్ఫార్మర్లు ► ఆత్మవిశ్వాసమే ముంచింది.. మంచిర్యాల సిటీ : ఆత్మవిశ్వాసమే జిల్లా మావోయిస్టుల కొంప ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జిల్లా సభ్యుడు, యాక్షన్ టీం కమాండ్ అత్రం శోభన్ అలియాస్ చార్లెస్ చనిపోవడమే అందుకు నిదర్శనం. జిల్లాలోని గిరిజన గూడెంలలో శోభన్‌కు పటి ష్టమైన పట్టు ఉండటంతో అతని సమాచారం ఎక్కడా బయటకు పొక్కలేదు. చిన్ననాటి నుం చి తిర్యాణి మండలంలో పెరగడం, గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో అతని సమాచారం తెలియరాలేదు. 20 నెలలుగా జిల్లాలోని అడవుల్లో అణువణువూ గాలించినా బలగాలకు చిక్కలేదు. దీంతో పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్న విషయాన్ని పసిగట్టిన బలగాలు అందుకు తగిన సమాచారాన్ని సేకరించి తుదముట్టించారు. ప్రత్యేక నిఘా.. ప్రత్యేక పోలీస్ బలగాలు శోభన్ రాకపోకలపై రెండు రాష్ట్రాల్లో నిఘా పెంచాయి. జిల్లాకు ఎప్పుడు వస్తున్నాడు.. జిల్లా దాటి ఎక్కడికి వెళ్తున్నాడు.. ప్రాణహితకు ఇవతలి వైపున శోభన్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి.. అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు.. వాటిపై నిఘా పెంచి అందుకు అవసరమైన మానవ సంబంధాలను బలగాలు పెంచుకున్నాయి. అందుకు తగిన విధంగానే ప్రాణహిత అవతలివైపున పెంచుకున్న సంబంధాలు సహకరించాయి. దీంతో శోభన్ స్థావరాలపై కన్నేసి ఉంచాయి. గాలింపు చేపట్టిన బలగాలకు తెల్లవారుజామున తారసపడ్డాడు. జరిపిన ఎదురుకాల్పుల్లో శోభన్ మృతి చెందాడు. ప్రత్యేకంగా శోభన్ కోసం బలగాలు గాలింపు చేపట్టినా అతనే ఆదివారం నాటి ఎదురుకాల్పులకు ఎదురవుతాడని ఊహించలేదు. కాల్పులు ముగిసిన అనంతరం శోభన్ సామగ్రి పరిశీలించిన తరువాతనే మృతుడు ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు అని తేలింది. వరుస సంఘటనలు.. ఈనెల 9న గడ్చిరోలి జిల్లా ధనోర తాలుగా పరిధిలో ఇన్ఫార్మర్ నెపంతో ఒకరిని మా వోలు కాల్పిచంపారు. గత నెలలో ముగ్గురిని ఇదే నెపంతో కాల్చి చంపారు. ఈ హత్యలకు శోభన్ భాగస్వామ్యం ఉందని అక్కడి పోలీసు లు సైతం ధ్రువీకరించారు. వరుస సంఘటనలతో అక్కడి ప్రజలు భయానికి లోనుకావడం, పోలీసులు వైఫల్యం చెందారనే నిందలు రావడంతో హత్యలకు ప్రధాన కారకులు ఎవరనేది పసిగ ట్టాయి. దీంతో అక్కడి బలగాలు అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ పెరిగిపోవడంతో పాటు వరుస సంఘటనలు తోడు కావడంతో అక్కడి పోలీసులు గట్టి నిఘా పెంచాయి. ఎట్టకేలకు గడ్చిరోలి ప్రాంతంలో నెల రోజులుగా పోలీసులకు ఇబ్బందికరంగా తయారైన శోభన్ అక్కడి పోలీసులకే చిక్కడం, ఇక్కడి పోలీసులకు చిక్కకపోవడం చర్చనీయాంశమైంది. శోభన్‌కు సహాయకుడిగా దినేశ్.. గడ్చిరోలి జిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన యాక్షన్ టీం సభ్యుడు దినేశ్ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నకు కొంత కాలంపాటు గన్‌మన్‌గా పనిచేశాడు. చంద్రన్నకు నమ్మినబంటుగా ఉండి అతని పనులను చేసిపెట్టేవాడు. గడ్చిరోలి జిల్లా ప్రాంతానికి చెందిన దినేశ్ మావోయిస్టులో చేరిన అనంతరం శిక్షణ పొంది గన్‌మన్‌గా నియామకమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో యాక్షన్ టీంకు సభ్యులు అవసరం కావడంతో కమాండర్ శోభన్‌కు సహాయకుడిగా నియమించడంతో గన్‌మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యాక్షన్ టీం కథ ముగిసింది.. జిల్లా యాక్షన్ టీం కమాండర్ అత్రం శోభన్‌తోపాటు సభ్యులు దినేశ్, ముఖేశ్ గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించడంతో యాక్షన్ టీం కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014, అక్టోబర్ 30న తిర్యాణి మండలం కేరిగూడలో గిరిజన యువకుడు బల్లార్షాను హత్య చేయడంతో యాక్షన్ టీం మరోసారి వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి తూర్పు ప్రాంతంలోని అత్యధిక మండలాల్లో పర్యటిస్తూ ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ, వాహనాలను తగులబెడుతూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. 20 నెలలుగా పోలీస్ బలగాలకు సవాల్ విసురుతూ కంటిమీద కునుకులేకుండా చేసింది యాక్షన్ టీం. చిట్ట చివరకు పక్క రాష్ట్రంలో చిక్కి ఇక్కడి పోలీసులకు చిక్కకపోవడం గమనార్హం. -
పోలీస్ ఇన్ఫార్మర్లను హతమారుస్తాం-మావోలు
ఖమ్మం: జిల్లాలోని ములుగు, ఏటూరునాగారం, గుండాల, ఆళ్లపల్లి, పినపాక, కామారం,టేకులపల్లి, ఇల్లం తదితర గ్రామాల్లో పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న సనప నాగేష్ (కిశోర్) తదితరులను ప్రజాకోర్టులో హతమారుస్తామని మావోలు హెచ్చరించారు. ఈ విషయాన్ని గుండాల పరిసర ప్రాంతాల్లో మంగళవారం పోస్టర్లను అంటించారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కమీషన్ కాకతీయగా మారిందని, పార్టీ నేతలకు, కాంట్రాక్టర్ల మేలుకే ఈ పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఆదివాసి, దళిత ప్రజల పోడు భూములపై దళారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అధిక వడ్డీలతో పేదలను ఇబ్బంది పెడుతున్న వడ్డీవ్యాపారులను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. Maoists, Threaten, Kill, Informers, మావోయిస్టులు, బెదిరింపు, ఇన్ ఫార్మర్లు -
‘పోలీసులకు సమాచారమిస్తే చంపేస్తాం’
సాలూరు: తమ కార్యకలాపాలు, కదలికలపై పోలీసులకు సమాచారం అందించిన వారికి తగిన శాస్తి తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జాకరివలస గ్రామానికి చెందిన పూసూరు వెంకట్రావు అనే వ్యాపారిని మంగళవారం మావోయిస్టులు హతమార్చారు. అతని మృతదేహం వద్ద మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. తమ ఉనికిపై పోలీసులకు ఉప్పందిస్తూ పార్టీకి నష్టం కలిగించేలా వెంకట్రావు వ్యవహరించాడని అందులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ మావోయిస్టు కోరాపుట్ డివిజన్ కమిటీ పేరిట ఆ లేఖ ఉంది. ఈ విషయమై ఓఎస్డీ అప్పలనాయుడును సంప్రదించగా లేఖలో రాత కొరాపుట్ దళ కమాండర్ అరుణక్కదిగా భావిస్తున్నట్లు తెలిపారు.