ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
Published Fri, Apr 28 2017 11:51 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
మల్కన్‌గిరి: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రంలోని ఎంవీ-79 పోలీసు లిమిట్స్‌లోని సుధాకొండ గ్రామంలోకి నక్సలైట్లు ప్రవేశించి బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి వీరిని కాల్చి చంపడం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement