malkangiri
-
గుట్టల గుట్టలుగా నోట్ల కట్టలు
-
మల్కన్‌గిరి–భద్రాచలం కొత్త రైల్వే లైన్
సాక్షి, హైదరాబాద్: ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం కాబోతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. 173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణలోకి ఇలా.. ఒడిశాలోని జేపూర్ నుంచి మల్కన్‌గిరికి గతంలో రైల్వే లైన్ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానించనున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికుల కోసమే.. రైల్వే కొంతకాలంగా సరుకు రవాణాకు బాగా ప్రాధాన్యం ఇస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రత్యేకంగా సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి కార్పొరేషన్‌తో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కేవలం బొగ్గు తరలింపును దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే మల్కన్‌గిరి–భద్రాచలం మార్గాన్ని ప్రస్తుతానికి ప్రయాణికుల రైళ్ల కోసమే అని పేర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో దీన్ని సరుకు రవాణాకు కూడా వినియోగించే అవకాశం ఉంది. సర్వే వేగవంతం చేయండి: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం మల్కన్‌గిరి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు ఆయనకు మల్కన్‌గిరి–భద్రాచలం లైన్ పురోగతిని మ్యాప్‌ల సాయంతో వివరించారు. కొత్తలైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా సర్వేలో వేగం పెంచాలని మంత్రి సూచించారు. -
ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. బాలిక మృతి
మల్కన్‌గిరి (ఒడిశా): ఓ ఫార్మాసిస్ట్ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్ బెహరా అనే ఫార్మాసిస్ట్ తన ఇంటి వద్దనే క్లినిక్ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తుంటాడు. బుధవారం ఉదయం 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంవీ–44 గ్రామానికి చెందిన వాసుదేవ్ బాలా కూతురు వందన బాలా(14)ని చికిత్స కోసం ఇతడి వద్దకు తీసుకువచ్చారు. చదవండి: (తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..) పరీక్షించిన సందీప్ బాలికకు బ్లడ్ టెస్ట్(రక్త పరీక్ష) చేయించాలని సూచించారు. ఈ పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టులో సదరు బాలికకు ప్లేట్లెట్స్ తగ్గినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తరలించేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో అయితే సకాలంలో వైద్యం అందించరని, ఇక్కడ తానే వైద్యం చేసి, బాగు చేస్తానని సందీప్ వారికి నచ్చజెప్పాడు. ఆయన మాటలు నమ్మి, బాలికను అక్కడే ఉంచారు. ఈ క్రమంలో సందీప్ వైద్యం అందించినప్పటికీ తీవ్ర అస్వస్థతతో గురువారం ఉదయం బాలిక కన్నుమూసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సదురు ఫార్మాసిస్ట్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం సందీప్‌పై ఈడ్చుకుని వెళ్లిమరీ పోలీసులకు అప్పగించి, అతడిపై కేసు నమోదు చేయించారు. -
అలలపై ఆంబులెన్స్.. ఐడియా అదిరింది
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద ఉన్న చిత్రకొండ జలాశయం దగ్గర బోటు అంబులెన్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్‌కుమార్ సింగ్ హాజరై, బోటు అంబులెన్స్ ఆరంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. ఉదయం బీఎస్ఎఫ్ క్యాంపు ఆవరణలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమం అనంతరం ఇక్కడి ప్రజలకు తమ వంతు సహాయంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం విశేషం. ఇప్పటివరకు జలాశయం మధ్య భూభాగంలోని పనాస్‌పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలాశయం మధ్య గుండా పడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారి జరిగిన పడవ బోల్తా దుర్ఘటనల్లో పలువురు మృత్యువాత పడడం విచారకరం. ఇదంతా గమనించిన బీఎస్ఎఫ్ జవానులు వారి కష్టాలు తీర్చాలని యోచించారు. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ బోటు అంబులెన్స్‌ను ప్రస్తుతం ప్రజా వినియోగంలోకి తీసుకురావడం గమనార్హం. చదవండి: రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే! -
ఓరి భగవంతుడా .. ఇది మూన్నాళ్ల ముచ్చటేనా !
మల్కన్‌గిరి( భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి, దుబేంకొండ గ్రామ వంతెన పూర్తిగా నేలమట్టమైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వంతెన లేకపోవడంతో మొత్తం 3 గ్రామాల ప్రజలు తమ రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణం కోసం బాధిత గ్రామాల ప్రజలు పోరాడగా, సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడి గెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టారు. దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపు ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన ఇలా నేలకూలడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని, అధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. -
వంతెన నిర్మాణం చేపట్టండి.. ఏడు గ్రామాల ప్రజల విజ్ఞప్తి
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కనిమెల సమితి, చింతాలవడా గ్రామపంచాయితీలోని చింతాలవాడ వంతెన నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ పదయమాడి అధికారులను కోరారు. ఏడేళ్లుగా ఇక్కడి సగం విరిగిపోయిన వంతెన మీదుగా ప్రమాదకరమైన ప్రయాణాలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో వంతెన విరిగిపోయిన భాగాలు నీటిలో ఎక్కడున్నాయో తెలియకపోవడంతో ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ఇదే మార్గం గుండా సిందిగుఢ, కోపలకొండ, పేడకొండ, పులిమెట్ల, తటిగుఢ, ఎంవీ–13, గుముక, మందపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి, వంతెన పునర్నిర్మాణానికి సహకరించాలని ఆమె కోరారు. -
మరదలి వివాహేతర సంబంధం.. తమ్ముడి ఆత్మహత్య.. ప్రతీకారంతో..
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి సమితి, ఎంవీ–19 గ్రామంలో బాలుడు అంకిత్ మండాల్(5) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన వికాస్ రోయి అనే వ్యక్తి బాలుడిని చంపినట్లు పోలీసుల విచారణలో తేలగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బాలుడి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో వికాస్ రోయి ఇంటి ముందు అంకిత్ చెవుల ముక్కలు కనిపించాయి. దీంతో అతడి ఇంట్లోకి వెళ్లి చూడగా, బాలుడి మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులు ఇది చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించగా అసలు విషయం బయటపడింది. బాలుడి తండ్రి హరదోన్ మండాల్ అతడి బంధువుల అమ్మాయితో తన తమ్ముడి వివాహం జరిపించాడని, అయితే ఆ అమ్మాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని వికాస్ తెలిపాడు. ఇది తట్టుకోలేని తన తమ్ముడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి ప్రతీకారంగానే హరదోన్ మండల్ కొడుకుని తాను హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి బాలుడి మృతదేహాన్ని తరలించినట్లు ఐఐసీ అధికారి రామ్‌ప్రసాద్ నాగ్ తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్య
మల్కన్‌గిరి : పెద్దలు పెళ్లికి నిరాకరించారన్న నెపంతో స్థానిక మల్కన్‌గిరి సమీపంలోని ఎంవీ–42 గ్రామంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామ స్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను పోలీసులు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఎంవీ–42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్ధర్, సోరిత ఇద్దరూ గత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో ఈ జన్మలో తమ పెళ్లి కాదని భావించిన వీరు.. బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. జంటగా ఇంటికి వెళ్తే ఇంట్లో వారు ఏమైనా అంటారేమోనన్న భయంతో గ్రామ శివారులోని ఓ మర్రిచెట్టుకి వీరిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం అటువైపుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలు చూసి బాధిత కుటుంబాలు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు తమ బిడ్డల మృతదేహాలు చూసి, కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
పీఏ మృతి: కలెక్టర్‌పై హత్య కేసు
ఒడిశా: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్‌పై మల్కన్‌గిరి పోలీస్ స్టేషన్లో సోమవారం హత్య కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. కలెక్టర్ దగ్గర పీఏగా పని చేసిన దేవ్ నారాయణ పండా గత ఏడాది డిసెంబర్26న అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని జిల్లాలోని సతిగుడ జలాశయంలో గుర్తించారు. దేవ్ నారాయణ పండా ఆత్మహత్యకు పాల్పడ్డాడో? హత్యకు గురయ్యాడో తెలియరాలేదు. ఆ సమయంలో విచారణ చేపడతామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి విచారణ చేపట్టలేదు. దీంతో మనస్తాపానికి గురైన దేవ్ నారాయణ పండా భార్య వనజ పండా తన భర్త అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్పందించిన కోర్టు మల్కన్‌గిరి పోలీస్‌స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ మనీష్ అగర్వాల్, మరో ముగ్గురు కలెక్టరేట్ సిబ్బందిపై హత్య కేసు నమోదు చేశారు. కలెక్టర్‌పై హత్య కేసు నమోదు కావడంతో ఆయన స్థానంలో మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌గా ఎద్దుల విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. -
లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం
బెర్హంపూర్: దేశమంతా నిర్బంధంలో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒడిశాలో కామాంధుల బారిన పడి ఓ గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మల్కాన్‌గిరి పోలీస్ క్యాంటీన్లో సామూహిక లైంగిక దాడికి గురైన బాధితురాలు మంగళవారం బెర్హంపూర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కన్నుమూసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో గుర్తుతెలియని దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది? పోలీసుల నివేదిక ప్రకారం... బాధితురాలు అనారోగ్యం పాలైందని మే 7న బాధితురాలి భర్తకు పోలీస్ క్యాంటీన్ ఇన్చార్జి సమాచారం ఇచ్చారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను మల్కాన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. తన భార్య శరీరంపై గాయాలను గుర్తించిన బాధితురాలి భర్త మే 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై లైంగిక దాడి జరిగిందని అతడు ఆరోపించాడు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను బెర్హంపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె చనిపోయింది. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు మల్కాన్‌గిరి మోడల్ పోలీస్‌స్టేషన్ సీఐ రాంప్రసాద్ నాగ్ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేస్తుందని, నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవని మల్కాన్‌గిరి ఏఎస్పీ అన్నారు. జూన్ 9లోగా నివేదిక ఇవ్వండి: ఓహెచ్‌ఆర్‌సీ ఈ ఘటనపై దర్యాప్తు జరిపి జూన్ 9లోగా నివేదిక సమర్పించాలని మల్కాన్‌గిరి ఎస్పీని ఒడిశా మానవ హక్కుల సంఘం(ఓహెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. సామాజిక కార్యకర్త నమ్రతా చాద్దా ఫిర్యాదుతో ఓహెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ నేరంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలని మల్కాన్‌గిరి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి అన్ని రకాల చికిత్సలు అందేలా చూడాలని, వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఇంతకుముందు ఓహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. రోజు కూలీ అయిన బాధితురాలి భర్తకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని నమ్రత తన పిటిషన్లో కోరారు. పోలీసులపైనే అనుమానం సాక్షాత్తు పోలీస్ క్యాంటీన్లోనే మహిళపై అఘాయిత్యం జరగడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీస్ క్యాంటీన్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారు? అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవని అడుగుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీస్ క్యాంటీన్ సంరక్షకులు ఏమి చేస్తున్నారు? పోలీసులు ఎక్కడ ఉన్నారని నిలదీస్తున్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (రైలు దిగగానే.. ‘ముద్ర’ పడింది!) -
పెళ్లితో ఒక్కటైన ఇద్దరమ్మాయిలు
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా) : ఆ అమ్మాయిలిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకేచోట చదువు సాగించారు. చిన్ననాటి నుంచే ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ఇద్దరి ప్రేమబంధం బలపడుతూ వచ్చింది. ఒడిశా రాజధానం భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిద్దరూ స్వస్థలమైన మల్కన్‌గిరికి వారం రోజుల క్రితం వచ్చి తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. అమ్మాయిలైన మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చేయించుకుని వచ్చింది. దీంతో ఆ అమ్మాయిలిద్దరూ స్నేహితుల సహకారంతో బుధవారం రాత్రి మల్కన్‌గిరిలోని ఓ ఆలయంలో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. -
మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి
మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టు అగ్రనేత రామన్న గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. 2003 నుంచి 2007 వరకు మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల, చిత్రకొండ, కటాఫ్ ఏరియాలో అగ్రనేతగా పనిచేసిన రామన్న పలు హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఇప్పటివరకు అతడి ఆచూకీ పోలీసులకు లభ్యం కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అతడిని అప్పగించిన వారికి రూ.1.40 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన కూడా జారీ చేసింది. అయినా అతడు పోలీసుల కంట పడకుండా తన కార్యకలాపాలను కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుకుమా జిల్లాలోనే రామన్న అంత్యక్రియలను మావోయిస్టు దళ సభ్యులు మంగళవారం నిర్వహించారు. అతడి మృతదేహంపై విప్లవ సూచికలైన ఎర్రటి వస్త్రాలను కప్పి, విప్లవగీతాలు ఆలపిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామన్న సేవలను పలువురు దళం సభ్యులు కొనియాడారు. సుమారు 60 ఏళ్ల వయసు కలిగిన రామన్న దళంలో చాలా చురుకుగా ఉండేవారని, అతడి సహచరులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందని, అతడి మృతి మావోయిస్టుల ఉద్యమానికి తీరని లోటు అని మావోయిస్టు దళ సభ్యులు పేర్కొన్నారు. -
పరువు కోసం.. భర్తకు పెళ్లి చేసిన భార్య
భువనేశ్వర్: భర్తకు భార్య స్వయంగా పెళ్లి చేసిన అరుదైన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో శనివారం చోటుచేసుకుంది. కుమార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసీకి కొన్నేళ్ల క్రితం గాయత్రి అనే అమ్మాయితో వివాహం జరిగింది. భర్త రోజువారీ కూలీ పనుల నిమిత్తం కొంతమంది కార్మికులతో కలిసి గ్రామం సహా గ్రామ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఐత మడకామి అనే మహిళతో రామ కావసీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి, అనంతరం అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా, ఉదయం తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా రామ కావసీని ఐత మడకామి అడిగింది. పెళ్లి చేసుకోకపోతే తనను మోసం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. తనకు పెళ్లి అయిందని, ఇప్పటిలో పెళ్లి చేసుకోలేనని రామ కావసీ తెగేసి చెప్పడంతో తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు రామ కావసీపై ఐత మడకామి కేసు పెట్టింది. ఇదే విషయం తెలుసుకున్న రామ కావసీ భార్య గాయత్రీ తన భర్త జైలు పాలైతే తన కుటుంబం వీధి పాలవుతుందని విచారించింది. ఇద్దరికీ పెళ్లి చేస్తే తన భర్త ఊరిలోనే ఉంటాడు కదా అని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరినీ ఒప్పించింది. ఊరిలోని సిద్ధిఈశ్వర్ మందిరానికి వారిని తీసుకువెళ్లి పూజారి సమక్షంలో గ్రామస్తుల మధ్య వారిద్దరినీ అగ్నిసాక్షిగా ఒక్కటి చేసింది. ఇకనుంచి ఎటువంటి గొడవలు లేకుండా ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటామని వారు చెప్పడంతో గ్రామస్తులంతా సంతోషించారు. ప్రస్తుతం ఐత మడకామి రామ కావసీపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడవి నుంచి ఆకాశానికి..అనుప్రియ రికార్డ్
భువనేశ్వర్ : గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. చదవుకోడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగా ఫైలెట్‌గా ఎదిగి ప్రశంసలు అందుకుంటోంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రాభల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23).. తొలి మహిళా ఫైలెట్‌గా సువర్ణావకాన్ని దక్కించుకున్నారు. కమర్షియల్ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలట్‌గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించారు. ఈ విధంగా నియమితులైన తొలి గిరిజన యువతి అనుప్రియానే కావడం విశేషం. చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కన్న అనుప్రియ...2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చి కమర్షియల్ ఫ్లైట్ నడిపే తొలి ఆదివాసీ మహిళ పైలెట్ ఘనతను సాధించిన అనుప్రియ ఎందరో మహిళలకు ఆదర్శం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ పట్నాయక్ ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా.. ఒడిశా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. -
తృటిలో తప్పించుకున్న ఆర్కే!
మల్కన్‌గిరి/సీలేరు (విశాఖ ఏజెన్సీ): ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జోడాంబు పంచాయతీ పరిధిలోని సిమిలిపోదర్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే తృటిలో తప్పించుకు న్నారు. ఉదయం 9 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఆర్కేతోపాటు మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పరారయ్యారని చెప్పారు. పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా డీజీపీ ఆర్పీ శర్మ మాట్లాడుతూ మావోయిస్టుల అణచివేతకు ఛత్తీస్ గఢ్, ఆంధ్ర పోలీసులతో కలిసి ఒడిశా పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. 2016లో రాయగఢ్ ప్రాంతంలో 34 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దు ల్లో భారీ ఎన్కౌంటర్లు జరిపి 38 మంది మావోయిస్టులను హతమార్చా మని తెలిపారు. మావోయి జాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం నవీన్ పట్నాయక్ మావోయిస్టులకు పిలుపునిచ్చారని తెలిపారు. అందుకోసమే ఆపరేషన్ ఆలౌట్‌ను మల్కన్‌గిరి జిల్లా నుంచి ప్రారంభించామని స్పష్టం చేశారు. దీనికోసం గురువారం హెలికాప్టర్లతో సర్వే కూడా చేయించామన్నారు. మల్కన్‌గిరిలో క్యాంప్‌లను నిర్వహిస్తామని చెప్పారు. కాగా ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
టీవీ బాంబు కలకలం
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్‌గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్‌గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్‌మోహన్ మిన్నా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు. -
అక్కాచెల్లెళ్ల సజీవదహనం
ఆ దీనుల ఆర్తి ఏ దూరతీరాలకూ చేరలేదు. వారి ఆవేదన ఏ భగవంతుని దరికీ చేరలేదు. వారి పేదరికం ఏ అధికారీ, ప్రజాప్రతినిధి మనస్సులనూ కరిగించలేదు. ఆ కుటుంబం నిర్భాగ్యమే మగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు మాడి మసైపోయేలా చేసింది. తండ్రి పోయాక తమకు ఇంక దిక్కెవరని మధనపడుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు గ్యాస్ లీకై జరిగిన ప్రమాదంలో బుధవారం సజీవ దహనమయ్యారు. అయితే అది ప్రమాదం కాదని వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. మల్కన్‌గిరి : జిల్లా కేంద్రంలోని జగన్నాథ మందిరం వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు బుధవారం ఉదయం సజీవదహనమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన కె.గణపతి రావు, లక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు సంతానం. అమ్మాయిల్లో మంగ(40), మేనక(36), రేణుక(25)లు ఇంట్లో కష్టపడి చేగోడీలు, చుప్పులు తదితర వస్తువులు తయారు చేసి ఇస్తే తండ్రి, అన్నదమ్ములు మార్కెట్లో విక్రయిస్తూ కుటుంబాన్ని గుట్టుగా వెళ్లదీస్తున్నారు. ఈ కుటుంబంలో 8 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి మృతిచెందగా తాజాగా తండ్రి గణపతిరావు ఈ నెల 7వ తేదీన మృతిచెందాడు. తండ్రి దశదిన కర్మలు పూర్తి చేసిన తరువాత అస్థికలు కలిపేందుకు అన్నదమ్ములు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి బుధవారం వెళ్లారు. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లు ఇంట్లో ఉన్నారు. ఇంతలో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం విన్న చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంఅందజేయగా సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కాచెల్లెళ్లు ముగ్గురూ మాడి మసైపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేదరికమే శాపమైంది: ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా మల్కన్‌గిరిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన ప్రమాదం కాదని, వారివి ఆత్మహత్యలని ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. తండ్రి మరణించి 12 రోజులు పూర్తి కావడంతో అస్థికలు కలిపేందుకు ఇద్దరు అన్నదమ్ములు రాజమండ్రి వెళ్లారు. ఇప్పటికే కష్టంగా ఉన్న తమ బతుకులు తండ్రి లేకపోవడంతో మరింత దుర్భరమవుతాయని భావించిన అక్కాచెల్లెళ్లు చిన్న తమ్ముడ్ని మార్కెట్‌కు పంపి, ఇంటి తలుపులు వేసి వంటిపై కిరోసిన్ పోసుకుని గ్యాస్ లీక్ చేసి వెలిగించి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. వారి ఆర్తనాదాలు కూడా చుట్టుపక్కల వారికి వినిపించలేదని ఎస్పీ వివరించారు. పేదరికమే వారి పాలిట శాపమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
13 మంది మావోయిస్టుల లొంగుబాటు
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమ జిల్లా ఎస్పీ అభిషేక్‌మిన్నా ఎదుట సోమవారం మధ్యాహ్నం 13మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. దళంలో చిన్న చూపు చూస్తున్నారు. గిరిజనుల కోసమే పోరాటం అంటూనే వారి కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్డుపనులను అడ్డుకుంటున్నారు. అగ్రనేతలు ప్రాణాలు కాపాడడం కోసం చిన్న కేడర్ నేతలను ముందు ఉంచి బలి చేస్తూ వారు తప్పించుకుంటున్నారు. మహిళా మావోయిస్టులకు దళంలో రక్షణ కరువైంది. వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందుచేతనే తాము మనస్తాపం చెందిన లొంగిపోతున్నమని మావోయిస్టులు ఎస్పీకి తెలిపారు. అలాగే తమ గిరిజనులపై ఇన్ఫార్మర్ల నెపం మోపి తమ చేతనే హత్యలు చేయిస్తున్నారని ఆవేదన చెందారు. మాకు ఇవి నచ్చడం లేదు..ప్రజాసేవ చేయాలంటే జనజీవనంలోకి వచ్చి చేస్తామన్నారు. అనంతరం ఎస్పీ అభిషేక్‌మిన్నా మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులంతా దర్భ డివిజన్‌కు చెందినవారని తెలిపారు. -
డాక్టరంటే అతడే..!
సాక్షి, మల్కన్‌గిరి (ఒడిశా): మానవత్వానికి పరీక్షగా ఒడిశా మారింది. మంచాల మీద గర్భవతులును, భుజాల మీద మృతదేహాలను మోసుకెళ్లడం ఈ ప్రాంతంలో అత్యంత సహజంగా మారింది. ఇక్కడి గిరిపుత్రులకు రహదారి వంటి కనీస మౌలిక సౌకర్యాలుకూడా అందుబాటులేవు అని చెప్పే మరో ఘటన ఇది. మల్కన్‌గిరి జిల్లాలోని సరిగెట గ్రామం. విద్య, వైద్యం, రహదారి వంటి కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం. ఆ గ్రమంలో ఒక గర్భిణికి నెలలు పూర్తయ్యాయి. సరిగెట గ్రామంలో వైద్య విధులు నిర్వహించేందుకు కొత్తగా చేరనిన వైద్యుడు ఆమెకు సుఖ ప్రసవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో.. తల్లీబిడ్డ ఇద్దరికి ప్రమాదం అని తెలిసి సమీపంలో ఉన్న పెద్దాసుపత్రికి ఆమెను తరిలించాని సూచించారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడంతో.. నెలలు నిండిన గర్భిణిని యువకుడైన వైద్యుడు, ఆమె భర్త, మంచంతో సహా 8 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రయాణంలో ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగింది. అయితే ఆలస్యం చేయకుండా ఆమెను ఆసుపత్రికి తరిలించడంతో.. ముగ్గురు వైద్యులు కలిసి ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
మల్కన్‌గిరి: జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పాలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పేద్మెల్, పలమడుగు అడవిలో గురువారం ఉదయం 8గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఎస్టీఎఫ్, డీఆర్జీ జవాన్లు ఉదయం కూంబింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మావోయిస్టుల శిబిరం తారసపడడంతో ఇరువర్గాల మధ్య రెండుగంటల పాటు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అనంతరం జవాన్లు మావోయిస్టుల శిబిరం వద్దకు వెళ్లి పరిశీలించగా ఒక మృతదేహంతో పాటు రెండు పెద్ద గన్లు, చిన్న తుపాకీ, డిటోనేటర్స్, మందులు, మావోయిస్టుల సాహిత్యం, విద్యుత్ వైర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుకుమా ఎస్పీ అభిషేక్ మిన్నా మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు మావోయిస్టులు వస్తుండగా జవాన్లకు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయని తెలిపారు. జవాన్లు కూంబింగ్ నుంచి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్కౌంటర్
సీలేరు(పాడేరు): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం పప్పులూరు పంచాయతీ కప్పసొడ్డి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవా రుజామున ఒడిశా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడిని కలిమెల దళానికి చెందిన సీనియర్ కమాండర్ చిన్నబ్బాయిగా గుర్తించారు. సీలేరు రిజర్వాయర్ ఒడిశా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పప్పులూరు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, కాల్పుల్లో కలిమెల దళ సీనియర్ కమాండర్ మృతిచెందినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. చిన్నబ్బాయిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. అతి చిన్నవయస్సులోనే మిలీషియా సభ్యుడిగా చేరిన చిన్నబ్బాయి 25 ఏళ్లుగా ఉద్యమంలో ఉంటూ కీలక నాయకుడిగా ఎదిగాడు. 2007–08 మధ్యకాలంలో పోలీసులు పక్కా వ్యూహంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో చేరి నాగులూరు, కోరుకొండ, పప్పులూరు, కలిమెల, గాలికొండ, ఎల్లవరం దళాల్లో పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కలిమెల దళానికి కమాండర్‌గా ఉన్నాడు. అతని మృతదేహాన్ని ఒడిశా పోలీసులు పోస్టుమార్టంకోసం మల్కన్‌గిరికి తరలించారు. -
చైనా గోడపై గిరిజన బాలిక
► జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన శిరీష ►తల్లి ఒకప్పటి మావోయిస్టుల దళ సభ్యురాలు ►తండ్రి లేకపోయినా అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ►దేశం తరన చైనాలో ప్రాతినిధ్యం మల్కన్‌గిరి: ఒకప్పుడు ఆడ పిల్లలు గడపదాటి బయట కాలు పెట్టాలంటేనే ఎన్నో ఆంక్షలు. మరి సాధారణంగానే అభివృద్ధికి ఆమడ దూరంలో.. సంప్రదాయాల సుడిగుండాల్లో నిత్యం బతికే గిరిజన బాలికలు అయితే..? ఇక సరే సరి. వీటన్నీంటికి తోడు అన్ని రంగాల్లో వెనుకంజలో ఉన్న ఒడిశా రా లో క్రీడలకు అసలు గుర్తింపే లేదు. అయితే.. చైనా గోడలాంటి ఈ ఆంక్షలన్నీంటినీ ఛేదించుకుని సగర్వంగా నిలిచింది ఓ గిరిజన బాలిక. నిత్యం మావోయిస్టుల అలజడులు, బాంబు చప్పుళ్లను బేఖాతరు చేస్తూ.. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది శిరీష కార్తమ(15). ఈమె ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10కి పైగా పతకాలు పొందింది. వీటితో పాటు ఇటీవల కేరళలోని ఎర్నాకుళంలో అంతరాష్ట్ర వాలీబాల్ టోర్నీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు పొందింది. ఈ టోర్నీలో పతకంతో పాటు వచ్చే నెల చైనాలో జరగనున్న అంతర్జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలో పాల్గొనే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. మన్యంలో మాణిక్యం మల్కన్‌గిరి జిల్లా పేరు చెబితే చాలు.. నిత్యం ఇనుపబూట్ల చప్పుళ్లు వినిపిస్తూనే ఉంటాయి. అటువంటి ప్రాంతంలో మట్టిలో మాణిక్యంలా పుట్టింది శిరీష. చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలిపెట్టి పోయినా తల్లి సహకారంతో అంచలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని జాతీయ శిక్షణా శిబిరానికి ప్రయాణమవుతున్న ఆమె అక్కడ మరింత నైపుణ్యాన్ని పెంచుకోనుంది. తానీ స్థాయికి ఎదగడానికి తల్లి చెల్లిలామ్మ, గురువు జ్ఞానేంద్రబొడాయి కారణమని సగర్వంగా శిరీష చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో అభినందనలతో పాటు నగదు పారితోషికం కూడా అందించారు. అమ్మ మాజీ నక్సలైట్..! శిరీష ప్రతిభ ఇప్పటి వరకు బాహ్య ప్రపంచం గుర్తించనట్లే, ఆమె పడ్డ కష్టాలు కూడా అంతగా బయటకు తెలియవు. ఆమె తల్లి చెల్లిలామ్మ ఒకప్పటి నక్సలైటు. చిత్రకొండ, బలిమెళ దళంలో సుమారు 18 ఏళ్లు పని చేసి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ముఖ్యనేతగా ఎదిగింది. అనంతరం వివిధ కారణాలతో 1996లో పోలీసులకు లొంగిపోయి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి జైలులో 1998 వరకు శిక్ష అనుభవించింది. విడుదల అనంతరం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ మనీష్ ముదిగల్ చిన్న ఉద్యోగం కల్పించారు. వివాహానంతరం ఇద్దరు కూతుళ్లు పుట్టాక భారమని చెల్లిలామాను భర్త వదిలేశాడు. అయితే దళంలో అలవడిన ధైర్యం, తెగింపు మరిచి పోలేదేమో! ఇద్దరు కూతుళ్లను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రస్తుతం శిరీష ఉన్నత స్థానానికి ఎదగడం పట్ల పట్టలేని ఆనందంతో ఆమె పరవశించిపోతోంది. బుధవారం శిరీష మహారాష్ట్ర బయలుదేరిన నేపథ్యంలో చెల్లిలామా పుత్రికోత్సాహంతో గర్వంగా ఆల్ ది బెస్ట్ చెబుతూ.. శిరీషను సాగనంపింది. -
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
మల్కన్‌గిరి: ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఒడిశా రాష్ట్రంలోని ఎంవీ-79 పోలీసు లిమిట్స్‌లోని సుధాకొండ గ్రామంలోకి నక్సలైట్లు ప్రవేశించి బిసు కిర్సాని, రామా పదియాని అనే ఇద్దరిని కాల్చి చంపారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి వీరిని కాల్చి చంపడం పట్ల గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
8 మంది మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పోలీసులు ఎనిమిది మంది మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరంతా మైథిలి పోలీసు స్టేషన్ పరిధిలోని బార్స్ గ్రామానికి చెందినవారు. మావోయిస్టుల కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్ బోర్డర్, మల్కన్‌గిరి ప్రాంతాల్లో వీరు అనేక మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మల్కాన్గిరికి వెళ్లనున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఓయూ జాక్ ఫర్ సోషల్ జస్టిస్ గురువారం ప్రకటించింది. ఏవోబీ జరిగిన ఎన్‌కౌంటర్‌ను బూటకమైనదిగా జేఏసీ అభివర్ణించింది. అన్ని యూనివర్సిటీల పరిశోధన విద్యార్థులు ఈ నెల 6వ తేదీన అక్కడికి వెళ్లి ఘటనపై నిజనిర్ధారణ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు చనిపోయిన మావోయిస్టులు మరియు పోలీసు కుటుంబాల వారితో మాట్లాడనున్నట్లు తెలిపింది. భూటకపు ఎన్‌కౌంటర్‌పై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. త్వరలోనే హైదరాబాద్‌లో మానవహక్కుల సంఘాలతోపాటు ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు జాక్ తెలిపింది. -
మల్కాన్‌గిరి ఎస్పీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత
-
ఎరు పెక్కిన ఏవోబీ
-
గాజర్ల రవి తప్పించుకున్నాడా?
12 మంది మహిళా మావోయిస్టులు మృతి మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఎన్ కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడా? లేక తప్పించుకున్నాడా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఇటు పోలీసులు కానీ, అటు మావోయిస్టుల వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మల్కన్‌గిరి, విశాఖపట్నం ఎస్పీలు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోమవారం ఉదయం రవి మరణించాడనే ప్రచారం సాగింది. దీంతో మల్కన్ గిరి జిల్లాలో కలకలం రేగింది. అయితే కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారని, సురక్షితంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో 4 మృతదేహాలు లభ్యం ఎన్కౌంటర్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. సంఘటన ప్రాంతంలో గాలిస్తున్న కూంబింగ్ దళాలకు మంగళవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉంది. దీంతో ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళల సంఖ్య 12కు చేరింది. మావోయిస్టు నేత మురళి మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించారు. ఇంకా 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మృతదేహాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులవిగా పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని, ఎన్కౌంటర్ జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన మావోయిస్టులు అడవిలో ప్రాణాలు వదిలే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అంటున్నారు. మరో ఎన్కౌంటర్! ఎన్ కౌంటర్ జరిగిన అడవుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం లభించిన నాలుగు మృతదేహాల విషయంలో డీజీపీ కథనం మరోలా ఉంది. సోమవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోలు మంగళవారం కూడా కాల్పులు జరిపారని, పోలీసులు అప్రమత్తమై ఎదుర్కోవడంతో మరో నలుగురు మావోలు మృతి చెందారని చెప్పారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారాన్ని (స్పెషల్ ఎక్స్‌గ్రేషియా) అందజేసింది. గుర్తించిన మృతుల వివరాలు.. 1. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అలియాస్ ప్రసాద్ (ఎస్జేసీఎం, ఈస్ట్ విశాఖ, బాకూరు విలేజ్, విశాఖ జిల్లా) 2. శ్యామల కిష్టయ్య అలియాస్ దయ, (ఎస్జేసీఎం, కోరాపుట్ /శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీ) 3. ఐనాపర్తి దాసు అలియాస్ మధు (డీజీఎం, టెక్‌టీం, వెస్ట్ గోదావరి) 4. గెమ్మెలి కేశవరావు అలియాస్ బిస్రు (డీసీఎస్, ఫస్ట్ సీఆర్టీ, తాడపాలెం, విశాఖ జిల్లా) 5. లత అలియాస్ పద్మ, (డీసీఎం, వైఫ్ ఆఫ్ మహేందర్, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్) 6. రాజేష్ అలియాస్ సీమల్ (డీసీఎం, ఫస్ట్ సీఆర్సీ, సీజీ) 7. బొట్టు తుంగనాలు అలియాస్ మమత (డీజీఎం, వైఫ్ ఆఫ్ సురేష్, ఎస్‌జెడ్‌సీఎం ఆఫ్ శ్రీకాకుళం జిల్లా) 8. ఎమలపల్లి సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి (డీసీఎం, విజయనగరం) 9. స్వరూప అలియాస్ రిక్కి, (డీసీఎం, ఎక్స్ ఆర్టీసీ కండక్టర్, తూర్పు గోదావరి జిల్లా) 10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా 11. బుద్రి, ఏసీఎం, ఆర్కే సెక్యూరిటీ గార్డ్ 12. మున్నా, ఆర్కే కుమారుడు, 13. రైనో, డీసీఎం 14. కిల్లో సీత, సప్లై టీం మెంబర్, చింతపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా -
ఎదురుచూపు !
మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు స్వస్థలమైన ఉద్దానం ప్రాంతానికి తరలించడం మరింత జాప్యమయ్యే అవకాశం కనబడుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మల్కన్‌గిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య మంగళవారం నాటికి 28కి చేరింది. వారిలో ముగ్గురు జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందినవారు ఉన్న విషయం విదితమే.. సెంట్రల్ రీజనల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న అలియాస్ సురేష్, అతని భార్య బొడ్డు కుందనాలు అలియాస్ సునీత అలియాస్ మమత, మరో సభ్యుడు మెట్టూరి జోగారావు అలియాస్ కోటీశ్వరరావు మృతదేహాలను అధికారికంగా గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం వారి మృతదేహాలు ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాకేంద్రంలో భద్రపరిచారు. ఆయా మావోయిస్టుల మృతదేహాలను గుర్తు పట్టడానికి, అలాగే పోస్టుమార్టం తర్వాత వాటిని స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, మావోయిస్టుల కుటుంబసభ్యులు కొందరు మల్కన్‌గిరికి మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో మృతదేహాల పోస్టుమార్టం కోర్టు ఇచ్చే ఆదేశాలతో ముడిపడి ఉంది. దీంతో పోస్టుమార్టం ప్రక్రియ జాప్యమయ్యే అవకాశం ఉంది. నారాయణరావు, అతని భార్య కుందనాలు, జోగారావు మృతదేహాల రాక కోసం వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం, మందస మండలం నల్లబొడ్లూరు గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశాలో జరిగిన జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఎన్కౌంటర్లో నష్టపోయినప్పుడు అందుకు ప్రతిగా నక్సలైట్లు దాడి చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా మందుపాతర పేల్చారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తర్వాత 2006లో భామిని మండలం గణసర వద్ద డీఎస్పీ లక్ష్యంగా ప్రధాన రహదారిలోనే మందుపాతరను పేల్చారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా ఇలాంటి ప్రమాదం ఉంచి ఉండటంతో జిల్లాలో రెడ్అలెర్ట్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులందరికీ భద్రత పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీని పోలీసులు మంగళవారం కూడా కొనసాగించారు. ఆది నుంచి ఉద్యమ పంథా.... పుష్కర కాలం క్రితం మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించక పూర్వం జిల్లాలో సీపీఐఎంఎల్ (పీపుల్స్‌వార్) ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య నాయత్వంలో జిల్లాలో 1980 సంవత్సరం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టింది. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగానున్న రాడికల్ స్టూడెంట్స్‌యూనియన్, రాడికల్ యూత్ లీగ్‌ల్లో అనేక మంది జిల్లా యువత పనిచేసింది. వారే తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. పీపుల్స్‌వార్‌పై ప్రభుత్వం నిర్భందం పెంచడంతో వారంతా ఎక్కువ కాలం అజ్ఞాతంలోనే గడిపారు. మరోవైపు అదేసమయంలో దాడులు ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా చోటుచేసుకున్న ఎన్కౌంటర్లలో పలువురు జిల్లాకు చెందిన మావోయిస్టులు మృతువాత పడ్డారు. తాజాగా జరిగిన మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో ముగ్గురు జిల్లావాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకే దేశంలో ఎక్కడ మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగినా ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడుతోంది. చాలా ఎన్కౌంటర్లలో హతులైనవారు ఈ ప్రాంతానికి చెందినవారు, లేదంటే ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నవారు కావడం విశేషం. - రట్టి ఎన్కౌంటర్: మందస మండలం రట్టి కొండల్లో 1991-92 ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలో జరిగిన తొలి ఎన్కౌంటర్ కూడా ఇదే. - రంగ్మొటియా ఎన్కౌంటర్: మందస మండలంలోని కళింగదళ్ ప్రాంతంలోని రంగ్మొటియా కొండల్లో 1991-92 సమయంలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నక్సలైట్లు, మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందారు. - బెండికొండ ఎన్కౌంటర్: వజ్రపుకొత్తూరు మండలంలోని బెండికొండ వద్ద 1992-93 ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నక్సలైట్ ఎరుపల్లి శాంతమూర్తి హతమయ్యాడు. - కొప్పరడంగీ ఎన్కౌంటర్: ఒడిశా సరిహద్దులోనున్న విజయనగరం జిల్లా కొప్పరడంగీ ప్రాంతంలో 1998 ఆగస్టు 9న ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 21 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి గంటి రమేష్ (రాజన్న), ముఖ్య నాయకులు దూర్వాసులు, అంబటి ఎర్రన్న, భూమన్న ఉన్నారు. వీరంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే. అంతేకాదు రాష్ట్రంలోనే తొలిసారిగా జరిగిన పెద్ద ఎన్కౌంటర్ కూడా ఇదే. - గొట్లభద్ర ఎన్కౌంటర్: మెళియాపుట్టి మండలంలోని గొట్లభద్ర ప్రాంతంలో 1999లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో జిల్లా అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షుడు కూనె కోదండరావు భార్య చిట్టెక్క, కుమార్తెతో పాటు మరో ముగ్గురు దళసభ్యులు మృతి చెందారు. - ముఖలింగాపురం ఎన్కౌంటర్: టెక్కలి సమీపంలోని ముఖలింగాపురం వద్ద 2000 సంవత్సరంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సలైట్లు, ఒక పౌరుడు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మృతులంతా జిల్లాకు చెందినవారే. - చంద్రగిరి ఎన్కౌంటర్: మెళియాపుట్టి మండలంలోని చంద్రగిరి వద్ద 2000-01 సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమైన ముగ్గురు నక్సలైట్లు జిల్లాకు చెందినవారు. - గుమ్మలక్ష్మీపురం ఎన్కౌంటర్: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో 2012లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు జగబంధుతో పాటు ఆయన అనుచరుడొకరు మృతి చెందారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇదే ఆఖరి ఎన్కౌంటర్. ఈ ఘటనలే గాకుండా ఏవోబీ, నల్లమల, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్‌ల్లో జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను రప్పించడానికి ప్రయత్నాలు ఉద్దానం నుంచి మల్కన్‌గిరికి వెళ్లిన బంధుమిత్రులు జిల్లాలో కొనసాగుతున్న పోలీసు తనిఖీలు ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు -
మల్కన్‌గిరికి తరలివెళ్లిన బంధుమిత్రుల కమిటీ
పలాస: ఒడిశాలోని ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో తమ వారిని వెతకడానికి ఉత్తరాంధ్ర అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, పౌరహక్కుల సంఘం నాయకులు మంగళవారం ఉదయం ఉద్దానం ప్రాంతం నుంచి మల్కన్‌గిరికి తరలివెళ్లారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన అమరవీరుల మృతదేహాలు వారి కుటుంబాలకు అప్పగించి వారి చేసిన త్యాగాలను ప్రజలకు వివరించడానికి 2007లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన అమరుల బంధుమిత్రుల కమిటీకి మొదట అధ్యక్షుడుగా ఉద్దాన ప్రాంతానికి చెందిన నాటి నక్సల్బరి పోరాట యోధుడు గోరు మాధవరావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్త గంటి ప్రసాదం ఆ కమిటీకి రెండోసారి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరిద్దరు కూడా ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా గంటి ప్రసాదం గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం గూడ అంజమ్మ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంది. గూడ అంజమ్మతో పాటు అమరుల బంధుమిత్రుల కమిటీ ఉత్తరాంధ్ర అధ్యక్షులు జోగి కోదండరావు, జిల్లా కార్యదర్శి మడ్డు ధనలక్ష్మి, దాసరి శ్రీరాములు, పౌరహక్కుల సంఘం నాయకులు పురుషోత్తం తదితరులు 20 మంది వాహనాల్లో మల్కన్‌గిరికి వెళ్లారు. గతంలో కనీసం మృతదేహాలను కూడా ఇవ్వకుండా అడవిలోనే పూడ్చిపెట్టేవారని, మృతదేహాలను కూడా తెచ్చుకోవడానికి ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే అమరుల బంధుమిత్రుల కమిటీ ఏర్పడిందని ఆయన జోగారావు చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళాలు సంచరించడమే కాకుండా వందల సంఖ్యలో కార్యకర్తలు ఉండేవారు. కోటబొమ్మాళి మండలం జీఎన్పేట గ్రామానికి చెందిన నంబాల కేశవరావు అలియాస్ గంగన్న, అలియాస్ బసవ రాజులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇతను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ శంకర్, అలియాస్ బాబులు ఉన్నారు. అలాగే బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు సుందరమ్మ అలియాస్ సునీత, సాదనలు కూడా విప్లవ బాటలోనే ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం జిల్లాలో మావోయిస్టు దళాల్లో పనిచేస్తున్న వారు ముగ్గురు, నలుగురు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఒకప్పుడు ఈ జిల్లాలో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీ నేడు పోలీసుల ఎన్కౌంటర్లతో బలహీనపడుతూ వచ్చింది. 25 పి.ఎల్.ఎస్ 05ఎ–29040003–ఫోటో: పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు నాయకులకు నివాళ్లు అర్పిస్తున్న అమరవీరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షులు గోరు మాధవరావు తదితరులు -
విషాదకర ఉదంతం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాక నక్సలైట్ల కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో కనబడని నేపథ్యంలో ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ)లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండర్ ఒకరు మరణించారని వచ్చిన వార్తలు కలవరం కలిగిస్తాయి. 2008లో ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఆ పార్టీ తరఫున ప్రతినిధులుగా వచ్చిన వారిలో ఒకరైన గాజర్ల రవి, మరో సీనియర్ నాయకుడు మృతుల్లో ఉన్నారని నిర్ధారణ కాని సమాచారం వల్ల తెలుస్తున్నది. గ్రేహౌండ్స్‌కు చెందిన మరో కమాం డర్‌కు గాయాలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు చాలా తరచుగా చోటుచేసుకున్న ఎన్కౌంటర్లు విభజన అనంతరం మందగించాయి. అయితే అవి పూర్తిగా ఆగిపోలేదు. నిరుడు ఏప్రిల్‌లో తెలంగాణలోని నల్లగొండ జిల్లా జానకీ పురంలో సిమి ఉగ్రవాదులు–పోలీసుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే ఉగ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులు అయిదుగుర్ని పోలీసులు ఒక ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. మరో నాలుగు నెలలకు తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వివేక్ అనే యువ కుడితోపాటు ఇద్దరు ఆదివాసీ యువతులు ఒక ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పో యారు. ఆ మరుసటి నెలలో వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో యువతీ యువకులు శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని శేషా చలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు తమిళనాడునుంచి వచ్చిన 20 మంది కూలీలను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. దేశంలో తొలి ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగిందో చెప్పమని అడిగితే తడబడ వచ్చుగానీ... ఆ మాదిరి ఉదంతం చోటు చేసుకున్న ప్రతిసారీ పోలీసులు ఒకే రక మైన కథనం వినిపిస్తారు. ఫలానాచోట తీవ్రవాదులు లేక ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వెళ్లినప్పుడు తమను చూసి వారు కాల్పులకు తెగబడ్డారని, లొంగి పొమ్మని హెచ్చరించినా వినకపోవడంతో గత్యంతరం లేక ఆత్మరక్షణార్ధం ఎదురు కాల్పులు జరిపామని అంటారు. చివరికది ఏ స్థితికొచ్చిందంటే... ఎన్‌కౌంటర్‌కు ఉండే స్థూల అర్ధం ‘ఎదురుకాల్పులు’ కనుమరుగై పట్టుకుని కాల్చిచంపడమన్న భావం స్థిరపడిపోయింది. ఏదైనా దుర్మార్గం చోటుచేసుకున్నప్పుడల్లా అందుకు కారకులైనవారిని ఎన్కౌంటర్ చేయాలని సామాన్య పౌరులు సైతం డిమాండ్ చేయడం...ఎన్కౌంటర్ చేస్తానని, చేయిస్తానని హెచ్చరికలు వినబడటం దీనికి కొన సాగింపే. ఎన్కౌంటర్ ఉదంతాలు జరిగినప్పుడల్లా పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు వాటిపై న్యాయవిచారణ కోరతాయి. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో, బంధువుల సమక్షంలో పోస్టు మార్టం జరగాలని, ఆ ప్రక్రియను రికార్డు చేయించాలని విజ్ఞప్తి చేస్తాయి. నిజానికి ఎవరూ కోరకుండానే, న్యాయస్థానాల జోక్యం అవసరం లేకుండానే ప్రభుత్వాలు వాటంతట అవి అమలు చేయాల్సిన అంశాలివి. అందుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ), సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార ్గదర్శకాలున్నాయి. కానీ అవి అమలుకావు. ఇప్పుడు ఏఓబీ ఎన్కౌంటర్ విషయం లోనూ అందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. మావోయిస్టుల మృతదేహాలను ఆంధ్ర ప్రదేశ్‌కు తీసుకొచ్చి ఉంటే విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఆ మృతదేహాలను ఒడిశాలోని మల్కాన్గిరికి తరలించారని అంటున్నారు. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో లేరని, కనుక సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదమున్నదని పౌరహక్కుల సంఘాల వాదన. ఇలాంటి ఉదంతాల్లో సాధ్యమైనంతవరకూ అనుమానాలకు తావీయని రీతిలో వ్యవహరించడం ప్రభుత్వాల ధర్మం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనూ, ఏజెన్సీ ప్రాంతం లోనూ నక్సల్ ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండేది. తెలంగాణలోనైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం బయట అడుగుపెట్టడానికి జంకేవారు. నక్సల్ ఉద్యమ సారథులుగా ఉన్నవారితో సహా పలువురు వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. వేర్వేరు ఉదంతాల్లో పలువురు నేతలు, పోలీసు అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అంతటి తీవ్ర పరిస్థితులు లేవు. ఆ ఉద్యమ ప్రభావం గణ నీయంగా తగ్గింది. మావోయిస్టులు సైతం తమ కార్యక్షేత్రాన్ని దండకారణ్యానికి తరలించారు. ఏఓబీలో వారి కదలికలు ఉన్నట్టు అప్పుడప్పుడు వెల్లడవుతున్నా అవి చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో నక్సల్ ఉద్యమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంతమంది మావోయిస్టులు ఒకేచోట పోలీసు కాల్పుల్లో మర ణించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏఓబీలో గత కొన్నాళ్లుగా పోలీసుల గాలింపు సాగుతోంది. ఒకరిద్దరు మావోయిస్టులు అరెస్టయినట్టు, ఎన్కౌంటర్లో గాయపడి నవారికి పోలీసులు చికిత్స చేయించడంతోపాటు వారికి రక్తదానం కూడా చేశారని వార్తలొచ్చాయి. పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇంత పెద్ద ఉదంతం జరుగుతుందని ఎవరి ఊహకూ అందలేదు. ఏఓబీలోని గిరిజన గూడాలు పేదరికంతో, మరెన్నో సమస్య లతో సతమతమవుతుంటాయి. అలాంటిచోట నక్సలైట్ల ప్రాబల్యం ఉండటం అసా ధారణమేమీ కాదు. హింసాయుత వాతావరణం ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి ఆటంకమవుతుంది. సామాజిక రుగ్మతలను అరికట్టడానికి భౌతిక నిర్మూలనే మార్గమని ఏ పక్షం అనుకున్నా అది సరికాదు. ఇలాంటి విషాద ఉదంతాలు జరగకూడదని ప్రజాస్వామికవాదులు ఆశిస్తారు. కొలంబియా వంటి దేశంలో ఏభైయ్యేళ్లకు పైబడి సాగుతున్న వామపక్ష ఉద్యమ నాయకులతో అక్కడి ప్రభుత్వం చర్చలు సాగించి సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించినప్పుడు మనదేశంలో అది అసాధ్యమని అనుకోలేం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలని, శాంతియుత వాతావరణం ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు. -
ఎన్కౌంటర్లో గాయపడిన కానిస్టేబుల్ మృతి
ఏఓబీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు మరణించారు. ఏపీ గ్రేహౌండ్స్ దళానికి చెందిన అజీజ్ బాషా అనే కానిస్టేబుల్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. అజీజ్ బాషా స్వస్థలం విశాఖపట్నంలోని గాజువాక. ఘటనా స్థలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం తరలిస్తుండగా.. వారిలో ఒకరైన అజీజ్ బాషా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ అజీజ్ బాషా కుటుంబాన్ని డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. -
బలిమెల దాడికి ప్రతీకారంగానే ఎన్కౌంటర్?
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం.. 2008 జూన్ నెలాఖరులో విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న పోలీసుల మీద మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. మొత్తం 64 మంది పోలీసులు వెళ్తన్న లాంచీ మీద చేసిన ఈ దాడిలో లాంచీ డ్రైవర్‌తో పాటు 38 మంది పోలీసులు మరణించారు. మావోయిస్టులపై పోరాటంలో పోలీసులకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ. దానికి ప్రతీకారం తీర్చుకోడానికే ఏఓబీలో తాజా ఎన్కౌంటర్ జరిగిందని అంటున్నారు. ఆంధ్రా-ఒడిషా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు ఈ ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. (భారీ ఎన్కౌంటర్: 24మంది మావోయిస్టుల మృతి) (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆంధ్రా, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీ నిర్వహించాలన్నా దట్టమైన అటవీ ప్రాంతమైన ఏఓబీనే ఎంచుకుంటారు. అయితే.. అగ్రనేతలు పాల్గొనే ప్లీనరీలకు భద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తారు. అందులో మందుపాతరల ఏర్పాటు కూడా ఒకటి. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా వీటన్నింటినీ ఛేదించుకుంటూ రెండు వైపుల నుంచి గ్రేహౌండ్, ఎస్ఓటీ బలగాలు విరుచుకుపడ్డాయంటే దీనికి ఉన్నతాధికారులు, కూంబింగ్ బలగాల అధినేతలు కలిసి పక్కా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. (పక్కా స్కెచ్‌తో దాడి, ఆర్కే ఎస్కేప్..) మళ్లీ తప్పించుకున్న ఆర్కే మావోయిస్టు అగ్రనేతలలో ఒకరు, కేంద్రకమిటీ సభ్యుడు అయిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. మల్కన్‌గిరి జిల్లా జంత్రి ప్రాంతంలో ఆర్కే కనిపించినట్లు కచ్చితమైన సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. 2011 సంవత్సరంలో సరిగ్గా ఇదే ప్రాంతంలో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ అలాంటి ప్రాంతంలో ఆర్కే కనిపించడం అంటే ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉన్నట్లు తెలుసుకుని, తదనుగుణంగా పక్కా వ్యూహం రచించి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు సమాచారం. -
ఒడిస్సా ఎన్కౌంటర్ బూటకం
- ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో జరిగిన ఘటనపై వైకో ఆత్మకూరురూరల్: ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుఝామున పోలీసులు, మావోయిస్టుల మ«ధ్య జరిగినట్లు చెబుతున్న ఎదురు కాల్పులు పూర్తిగా సత్యదూరమని. అది బూటకపు ఎన్కౌంటరని సామాజిక న్యాయం పార్టి రాష్ట్ర అధ్యక్షులు వైకో (వై.కోటేశ్వరరావు)స్పష్టం చేశారు. ఓ కేసు విషయంగా ఆత్మకూరు కోర్టుకు వచ్చిన ఆయన ఈ భారీ ఎన్కౌంటర్ ఘటనపై స్పందించారు. పోలీసు బాస్ చెప్పిన ప్రకారం చూసినా ఓ సమావేశం జరుపుకొంటున్న మావోయిస్టులపైకి దాడికి వెళ్లగా జరిగిన ఘటనలానే ఉంది తప్ప వారు చెబుతున్నట్లు ఆత్మరక్షణకు కాల్పులు జరపడం వల్ల 24మందిని చనిపోయినట్లు లేదన్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సుప్రింకోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారి చేసిందన్నారు. ఎన్కౌంటర్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, సీబీఐ లాంటి స్వత్రంత సంస్థతో దర్యాప్తు చేపట్టి హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటవీ సంపదను బహుళజాతి సంస్థలకు అప్పణంగా కట్టబెడుతు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆదివాసుల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ,సామాజిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. దీంతో ఆదివాసులు అనివార్యంగా మావోయిస్టు పార్టీకి చేరువవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ముందుగా ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. -
పక్కా స్కెచ్‌తో దాడి, ఆర్కే ఎస్కేప్..
మల్కాన్‌గిరి: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో మావోలపై కాపుకాసిన పోలీసులు అదును చూసి పంజా విసిరారు. మల్కాన్‌గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్, ఏడు ఎస్ఎల్ఆర్లు, ఏడు ల్యాండ్మైన్లు, 303 రైఫిల్స్, 15 భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జంత్రి అటవీప్రాంతం ఘటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా పక్కా సమాచారం తెలుసుకున్న ఆంధ్ర-ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు. ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి చిత్రకొండ పనసపుట్టు వద్ద మావోయిస్టులు సమావేశమయ్యారు. మరోవైపు విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఎన్కౌంటర్ లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మృతుల్లో 18మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, అగ్రనేతలు ఉన్నారో...లేదో ఇంకా తెలియదన్నారు. ఇక గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించినట్లు చెప్పారు. -
ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించిన ఏపీ డీజీపీ
విజయవాడ: ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ధ్రువీకరించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి 4 ఏకే-47లు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. సంఘటనా ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అవసరం అయితే అదనపు బలగాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఇక మావోయిస్టు కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో విశాఖ తరలించారు. -
భారీ ఎన్కౌంటర్: 24మంది మావోయిస్టుల మృతి
మల్కాన్‌గిరి: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఏవోబీలో మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు వద్ద ఆంధ్రా గ్రేహౌండ్స్-ఒడిశా ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 24మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో 11 మంది పురుషులు, 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు విశాఖ ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు. ఘటనా స్థలంలో భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బలిమెల రిజర్వాయర్‌లోని ఓవోబీ కటాఫ్ ఏరియాలో ఈ ఆపరేషన్ జరిగింది. ఎన్ కౌంటర్ లో కీలక నేత మల్లేశ్ చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే పరారైనట్లు సమాచారం. అలాగే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరైన అజీజ్ బాషా విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్‌ను విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. 11 మంది మృతదేహాల గుర్తింపు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులలో సోమవారం మధ్యాహ్నానికి 11 మంది మృతదేహాలను గుర్తించారు. వారి వివరాలు... ఐనపర్తి దాసు అలియాస్ మధు(పశ్చిమ గోదావరి), గామెల్లి కేశవరావు అలియాస్ బిర్సు (వైజాగ్), లత అలియాస్ పద్మ(మహేందర్ భార్య, హైదరాబాద్), రాజేష్, బొడ్డు కుద్నాలు అలియాస్ మమత(సురేష్ భార్య, శ్రీకాకుళం), సింహచలం అలియాస్ మురళి(విజయనగరం), స్వరూప అలియాస్ రికీ(తూర్పుగోదావరి), బరుకు వెంకట ప్రసాద్(వైజాగ్), చామెళ్ల కృష్ణ అలియాస్ దయా(శ్రీకాకుళం), శ్వేత, బుడ్రి గా తెలుస్తోంది. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. -
ప్రసవం కోసం డోలీలో 13 కి.మీ.లు
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో నిండు గర్భిణిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డోలీలో 13 కి.మీ. మోశారు. చిత్రకొండ కటాఫ్ ప్రాంతంలోని తెంతగుడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ జానహంతాళ్కు నెలలు నిండాయి. ఆమె గర్భంలో కవల పిల్లలు పెరుగుతుండగా ఆదివారం ఉదయం ఇంటివద్దనే ఒక ఆడ శిశువుకు జాన జన్మనిచ్చింది. మరో శిశువు కడుపులో అడ్డం తిరగ డంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. రవాణా సదుపాయం లేకపోవడంతో ఆమె భర్త, సోదరుడు కలిసి ఆమెను డోలీలో 13 కి.మీ. మోసుకెళ్లారు. అనంతరం గురుప్రియ నది దాటి 108కి ఫోన్ చే శారు. అంబులెన్సు రాకపోవడంతో జానను ప్రైవేటు వాహనంలో చిత్రకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయలేమనడంతో మల్కన్‌గిరి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రసవం చేయగా జాన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
మావోయిస్టులు దాడి: బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా బీఎస్ఎఫ్ జవాన్లపైన మావోయిస్టులు దాడి చేశారు.ఆ దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని మందుపాతరతో పేల్చివేశారు. ఎం.వి.126 గ్రామం వద్ద మావోయిస్టులు ఆ ఘాతుకానికి ఒడిగట్టారు. మావోయిస్టుల దాడి సమాచారాన్ని జవాన్లు ఉన్నతాధికారులకు అందించారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మావోయిస్టుల కోసం పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. -
ఒడిశాలో 10 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పోలీసు ఎస్పీ ఎదుట 10 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. ఆ మావోయిస్టుల్లోని ఐదుగురిపై మందుపాతర పేలుళ్లు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు దొంగతనం తదితర కేసుల్లో వారంత నిందితులని పోలీసు ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. మరో మావోయిస్టు లోకల్ ఏరియా దళ కమాండర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. వారంతా 21 నుంచి 30 ఏళ్ల వయస్సు కలవారని చెప్పారు. లొంగిపోయన మావోయిస్టులకు ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్భంగా వివరించారు. -
ఏవోబీ ఉద్రిక్తం
సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మళ్లీ అలజడి రేగింది. మావోయిస్టులు, పోలీసులు మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మల్కన్‌గిరి జిల్లాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పొడియా అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి భయానకంగా మారింది. దీంతో సరిహద్దులో రెడ్అలెర్ట్ ప్రకటించారు. ఇటీవలి కాలం వరకు ప్రశాంతంగా వున్న సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా ఏరియా కమిటీ కమాండర్ మాధవ్‌ను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చడంతో పరిస్థితి మళ్లీ తలకిందులైంది. మాధవ్ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజుల్లోగా బీఎస్ఎఫ్ బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసి తమ ఉనికిని చాటుకున్నారు. ఇది జరిగి నెల గడవకముందే పొడియా అటవీ ప్రాంతంలో ఒడిశా ఎస్‌వోజీ బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13మంది మావోయిస్టులు మృతి చెందడంతో మరోసారి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలతో పరిస్థితి మరింత భయానకంగా మారిం ది. ఇప్పుడువారు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. భద్రతా బలగాలు అప్రమత్తం : సరిహద్దులో చోటు చేసుకున్న సంఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా మల్కన్‌గిరి జిల్లాల్లో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి మావోయిస్టులు దాడులకు తెగబడే ప్రమాదం ఉంది. సరిహద్దులో బలగాలన్నీ అప్రమత్తమయ్యాయి. శనివారం సీలేరు వచ్చిన చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్‌ను ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నించగా ఇప్పటికే అటవీ ప్రాంతంలో బలగాలు ఉన్నాయని, కూంబింగ్ జరుగుతోందని తెలిపారు. వారిని, పోలీస్‌స్టేషన్‌లో బలగాలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. చిత్రకొండ, సీలేరు, జి.కె.వీధి, కొయ్యూరు, మాచ్‌ఖండ్ వంటి సరిహద్దు పోలీస్స్టేషన్లలో అప్రమత్తంగా వుండాలని ఉన్నతాధికారుల నుంచి తాజాగా ఆదేశాలు అందాయన్నారు. గిరిజనుల భయాందోళనలు : ప్రస్తుత పరిణామాలతో సరిహద్దులో గిరిజనుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రతీకార దాడుల్లో తమకు ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. 14మంది మావోయిస్టులు ఒక్కసారే చనిపోవడంతో అది పోలీస్ ఇన్ఫార్మర్ల వల్లే జరిగిందని మావోలు భావిస్తుంటారు. దీంతో మళ్లీ గిరిజన గ్రామాల్లో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. -
మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ బూటకం:ఏపీసీఎల్సీ
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. చనిపోయిన వారందరికి సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్కాన్‌గిరిలో ఎన్కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అయితే ఆ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు గాజర్ల రవి భార్య మీనా ఉన్నట్లు సమాచారం. కొడియా, కోరాపూట్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశామయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ క్రమంలో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో నలుగురు జవాన్లు మరణించారు. అనాటి నుంచి ఏవోబీ సరిహద్దుల్లో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. -
ఒరిస్సాలో 8 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఒరిస్సాలోని ఎనిమిది మంది మావోయిస్టులు బుధవారం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అయితే ఆ మావోయిస్టులందరిది మల్కాన్‌గిరి జిల్లాలోని అత్యంత మారుమూలప్రాంతమైన చిత్రకొండ ప్రాంతమని జిల్లా ఎస్పీ వివరించారు. 2009 నుంచి వారు మావోయిస్టు కార్యకలపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల్లో ముగ్గురు ఏరియా దళ కామాండర్లుగా ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... తామంతా జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.