
పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా) : ఆ అమ్మాయిలిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకేచోట చదువు సాగించారు. చిన్ననాటి నుంచే ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆ ఇద్దరి ప్రేమబంధం బలపడుతూ వచ్చింది. ఒడిశా రాజధానం భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిద్దరూ స్వస్థలమైన మల్కన్‌గిరికి వారం రోజుల క్రితం వచ్చి తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. అమ్మాయిలైన మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి చేయించుకుని వచ్చింది. దీంతో ఆ అమ్మాయిలిద్దరూ స్నేహితుల సహకారంతో బుధవారం రాత్రి మల్కన్‌గిరిలోని ఓ ఆలయంలో సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment