ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని, కాల్పుల్లో కలిమెల దళ సీనియర్ కమాండర్ మృతిచెందినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. చిన్నబ్బాయిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. అతి చిన్నవయస్సులోనే మిలీషియా సభ్యుడిగా చేరిన చిన్నబ్బాయి 25 ఏళ్లుగా ఉద్యమంలో ఉంటూ కీలక నాయకుడిగా ఎదిగాడు. 2007–08 మధ్యకాలంలో పోలీసులు పక్కా వ్యూహంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో చేరి నాగులూరు, కోరుకొండ, పప్పులూరు, కలిమెల, గాలికొండ, ఎల్లవరం దళాల్లో పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కలిమెల దళానికి కమాండర్‌గా ఉన్నాడు. అతని మృతదేహాన్ని ఒడిశా పోలీసులు పోస్టుమార్టంకోసం మల్కన్‌గిరికి తరలించారు.