ఎన్‌కౌంటర్‌లో గాయపడిన కానిస్టేబుల్ మృతి | constable succumbs to injuries in aob encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో గాయపడిన కానిస్టేబుల్ మృతి

Published Mon, Oct 24 2016 3:29 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

constable succumbs to injuries in aob encounter

ఏఓబీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు మరణించారు. ఏపీ గ్రేహౌండ్స్ దళానికి చెందిన అజీజ్ బాషా అనే కానిస్టేబుల్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. అజీజ్ బాషా స్వస్థలం విశాఖపట్నంలోని గాజువాక. 
 
ఘటనా స్థలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం తరలిస్తుండగా.. వారిలో ఒకరైన అజీజ్ బాషా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్‌ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కానిస్టేబుల్ అజీజ్ బాషా కుటుంబాన్ని డీజీపీ సాంబశివరావు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement