గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్‌లో తరలిస్తున్న దృశ్యం
పర్ణశాల(దుమ్ముగూడెం): ఛత్తీస్‌గఢ్‌లోని మావో యిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పర్తాపౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముగించుకుని వస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లకు బర్కోట్ గ్రామ సమీపంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో లోకేందర్ సింగ్, ముఖ్తియార్ సింగ్ అనే కానిస్టేబుళ్లు మృతి చెందగా సందీప్ దేవ్ అనే జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించి, పరారైన మావోల కోసం గాలింపు చేపట్టారు. గాయపడిన సందీప్ దేవ్‌ను వెంటనే హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మృతదేహాలను పఖన్‌జోర్‌లోని 114 బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment