bsf jawans
-
విషాదం: కుటుంబాన్ని వీడలేక.. డ్యూటీ చేయలేక..
బూర్జ(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని అన్నంపేటలో శనివారం బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నంపేటకు చెందిన సాకేటి రామారావు (48) త్రిపురలో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. రెండు రోజుల కిందట స్వగ్రామం అన్నంపేటలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. చదవండి: వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి.. కాళ్లనొప్పి కారణంగా డ్యూటీ చేయలేకపోతున్నానని, కుటుంబ బాధ్యతలు కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఇదే విషయమై భార్య, తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తండ్రి పొలం పనులకు వెళ్లిన సమయంలో పురుగు మందు తాగాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్సులో రాగోలు జెమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రామారావుకు భార్య భాగ్యవతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జవాన్లతో కలిసి భోజనం చేసిన రామ్‌చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అతడి యాక్టింగ్ స్కిల్‌ను జనాలు ఫిదా అయ్యారు. ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం అతడు కొంత కాలంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం షూటింగ్ గ్యాప్‌లో ఆయన కొంత సమయాన్ని బీఎస్ఎఫ్ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఖాసా అమృత్‌సర్‌లోని బీఎస్ఎఫ్ క్యాంప్‌లో జవాన్ల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నపు సమయాన్ని గడిపాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ మేరకు వారితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో వారితో కలిసి భోజనం కూడా చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) చదవండి: అంటే సుందరానికీ టీజర్ చూశారా? ఫుల్ ఫన్ గ్యారంటీ! ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో! -
శౌర్య యాత్ర.. 40 మంది మహిళలా సైనికులు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు..!
నిత్య ఉత్తేజం చే గువేరా ‘మోటర్ సైకిల్ డైరీస్’లో ఒక మాట... ‘ప్రపంచం నిన్ను మార్చే అవకాశం ఇవ్వు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని మార్చే దిశగా ప్రయాణిస్తావు’ ప్రయాణం అనేది పైకి భౌగోళిక అంశాలకు సంబంధించిన విషయంగా కనిపించినప్పటికీ, సూక్ష్మదృష్టితో చూస్తే... అది మనలోకి మనం ప్రయాణించడం. ప్రయాణ క్రమంలో కొత్త విషయాలను నేర్చుకోవడం. మన దగ్గర ఉన్న విషయాలను పంచుతూ వెళ్లడం. రక్తం గడ్డ కట్టే చలిలో జమ్మూ అంతర్జాతీయ సరిహద్దుల్లో డేగకళ్లతో కాపుకాసి, ఉగ్రవాదులకు, అక్రమ చొరబాటుదారులకు చెక్ పెట్టిన మహిళా సైనికుల ధీరత్వం ఇప్పటికీ తాజాగానే ఉంటుంది. ఎర్రటి ఎండల్లో, నాలుక పిడచకట్టుకుపోయే భయానక వేడిలో రాజస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మహిళా సైనికుల అంకితభావం ఎప్పటికీ గుర్తుంటుంది. విధినిర్వహణలో కాలప్రతికూలతలు, భౌగోళిక ప్రతికూలతలను అధిగమించి ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధి అయిన నిర్వహించగలం’ అని నిరూపించారు బీఎస్ఎఫ్ మహిళా సైనికులు. రాజస్థాన్‌కు చెందిన తనుశ్రీ ప్రతీక్ బీఎస్ఎఫ్ చరిత్రలో ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఆఫీసర్‌గా నియామకం అయినప్పడు అది ఒక విశేషం మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలకు విశిష్టమైన ఉత్తేజాన్ని అందించింది. మొన్నటి దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో బీఎస్ఎఫ్ మహిళా దళం ‘సీమ భవాని’ చేసిన అపురూప సాహసిక విన్యాసాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఇవేమీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవడం లేదు. ఒక కొత్తదారికి ఊతం ఇవ్వబోతున్నాయి. తాజా విషయానికి వస్తే.. బీఎస్ఎఫ్కు చెందిన నలభైమంది మహిళా సైనికులు దిల్లీ నుంచి కన్యాకుమారి వరకు బైక్ యాత్ర చేపట్టారు. 5,280 కి.మీ ఈ యాత్రకు ‘సీమా భవాని శౌర్య ఎంపవర్మెంట్ రైడ్–2022’ అని నామకరణం చేశారు. అటు అమృత్సర్ నుంచి ఇటు చెన్నై, హైదరాబాద్, అనంతపురం, బెంగుళూరు వరకు స్త్రీ సాధికారికతకు సంబంధించిన ఘట్టాలను పంచుకుంటూ, సానుకూల దృక్పథాన్ని రేకెత్తించడమే ఈ యాత్ర లక్ష్యం. యాత్రలో భాగంగా బృంద సభ్యులు పాఠాశాల, కాలేజీ విద్యార్థులు, ఎన్సీసీ వాలెంటీర్లు, బైక్‌రైడర్స్... మొదలైన వారితో సమావేశం అవుతారు. దిల్లీకి సమీపంలోని ఒక పాఠశాల విద్యార్థులతో సమావేశం అయినప్పుడు... మొన్నటి రిపబ్లిక్‌డే వేడుకల్లో సీమభవాని బృందం చేసిన సాహసకృత్యాలను గుర్తు చేసుకుంది ఒక చిన్నారి. తాను కూడా అలా చేయాలనుకుంటుదట! ‘నువ్వు కచ్చితంగా చేయగలవు’ అని చెప్పినప్పుడు ఆ పాప ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో! మరోచోట ఒక కాలేజీ విద్యార్థిని ‘బీఎస్ఎఫ్లో చేరాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఏం చదవాలి?’... మొదలైన విషయాలను అడిగింది. ఆ అమ్మాయికి అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది రైడర్స్ గ్రూప్. దూరాలను అధిగమించడమే కాదు... దూరాలను తగ్గించడం కూడా ఈ యాత్ర లక్ష్యం. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై రాజసంగా కనిపిస్తున్న సీమ భవానీ శక్తులను ఒక్కసారి చూడండి... ఎంత ఉత్తేజకరమైన దృశ్యమో! -
బీఎస్ఎఫ్ జవాన్లకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
భువనేశ్వర్ : బీఎస్ఎఫ్ జవాన్లు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలోని చిత్రకొండ సమితి హంతళ్‌గుడ బీఎస్ఎఫ్ క్యాంప్ 9వ బెటాలియన్‌కు చెందిన 20 మంది జవాన్లను టార్గెట్ చేస్తూ కొదలిగుడ అటవీప్రాంతంలో మావోలు అమర్చిన బాంబులను జవాన్లు మంగళవారం గుర్తించారు. కొధలిగుడ అటవీప్రాంతంలో సోమవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంప్‌ను గుర్తించినట్లు జవాన్లు తెలిపారు. ఇదే ప్రాంతంలో మవోలు సమావేశం అయినట్లు ముందస్తు సమాచారం అందడంతో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జవాన్ల రాకను గుర్తించిన మావోలు అక్కడ నుంచి పరారయ్యారు. జవాన్లు ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐఈడీ బాంబులు, కుక్కర్ బాంబు, టిఫిన్ బాక్స్ బాంబు, మందులు, ఇతర సామగ్రిని గుర్తించారు. ఈ వారంలో డంప్ స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. చిత్రకొండ సమీపంలో ఇటీవల మావోలు అమర్చిన మందు పాత్ర పేలి పలువురు జవాన్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. -
దాడి చేసి.. తప్పించుకోడానికి అంబులెన్స్
కశ్మీర్: పాండచ్ మిలిటెంట్ అటాక్ కేసును పరిష్కరించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. మే నెలలో నగర శివార్లలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు హతమార్చి వారి ఆయుధాలను దోచుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రెండు అంబులెన్సులు, రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఈ వాహనాలను దాడి చేసే వారిని తీసుకెళ్లేందుకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. రవాణా, లాజిస్టిక్స్, ప్రణాళిక, దాడిని అమలు చేయడంలో సహకరించిన ఐదుగురు వర్గీకరించని గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందులో రెండు ప్రైవేట్ అంబులెన్సులు, ఒక బైక్, స్కూటీ ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. దాడికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి డీజీపీ అనుమతించారని తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ఉగ్రవాదులను బిజ్బెహారా నుంచి శ్రీనగర్‌లోని పాండచ్కు రవాణా చేయడానికి అంబులెన్స్ నంబర్ జేకే01ఏడీ 0915ను ఉపయోగించారు అన్నారు. అంతేకాక గాయపడిన జవాన్ల నుంచి ఆయుధాలను దోచుకున్న తరువాత.. వాటిని దాడి చేయడానికి, తప్పించుకోవడానికి బైక్ నంబర్ జేకే01ఏహెచ్ 2989, స్కూటీ నంబర్ జేకే01వీ 8288 ఉపయోగించారు. శ్రీనగర్ నుంచి ఉగ్రవాదులను తిరిగి బిజ్బెహారాకు రవాణా చేయడానికి అంబులెన్స్ జేకే01ఏఎఫ్ 9417ను ఉపయోగించారు అని తెలిపారు. -
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
ఛత్తీస్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
పర్ణశాల(దుమ్ముగూడెం): ఛత్తీస్‌గఢ్‌లోని మావో యిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పర్తాపౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముగించుకుని వస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు బర్కోట్ గ్రామ సమీపంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లోకేందర్ సింగ్, ముఖ్తియార్ సింగ్ అనే కానిస్టేబుళ్లు మృతి చెందగా సందీప్ దేవ్ అనే జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించి, పరారైన మావోల కోసం గాలింపు చేపట్టారు. గాయపడిన సందీప్ దేవ్‌ను వెంటనే హెలికాప్టర్లో రాయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మృతదేహాలను పఖన్‌జోర్‌లోని 114 బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
సాక్షి, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలోని అటవీప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఒక జవాన్ గాయపడ్డారు. గాయపడిన జవాన్‌ను హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్‌గఢ్ నిఘా వర్గాల సమాచారం ప్రకారం సంఘటనాస్థలంలో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. కొద్దిసేపు కాల్పులకు విరామం ఇచ్చిన మావోయిస్టులు మళ్లీ మెరుపుదాడులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు దంతెవాడ జిల్లాలోనూ మవోయిస్టులు హింసకు దిగారు. పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఓ గ్రామ సర్పంచ్‌ను హతమార్చారు. -
బుద్ధి మార్చుకోని పాకిస్థాన్
-
హోలీ సంబరాల్లో జవాన్లు
-
హోలీ సంబరాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు
సాక్షి, జమ్మూ : దేశ భద్రతను కాంక్షిస్తూ నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే సరిహద్దు భద్రతా దళ జవాన్లు గురువారం హోలీ సంబరాల్లో మునిగితేలారు. దేశాన్నికాపాడేందుకు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా సేవలందించే జవాన్లు కొద్దిసేపు సేదతీరారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సరిహద్దులో సందడి చేశారు. మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆనందంగా రంగుల పండుగను జరుపుకున్నారు. -
పీఓకేలో ముగ్గురు ‘రా’ ఏజెంట్ల అరెస్ట్
ఇస్లామాబాద్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ముగ్గురు అనుమానిత రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్లను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిని రావల్కోట్లో మీడియా ముందు ప్రవేశపెట్టినట్లు పాక్ వార్తా పత్రిక డాన్ పేర్కొంది. వారు పీఓకేలోని అబ్బాస్పూర్ తారోటి గ్రామానికి చెందిన వారని తెలిపింది. ప్రధాన అనుమానితుడు ఖలీల్ 2014 నవంబర్‌లో పూంచ్‌లో పర్యటించి రా అధికారులతో పరిచయం పెంచుకున్నట్లు డీఎస్పీ సాజిద్ చెప్పారు. ఉగ్ర వ్యతిరేక చట్టం కింద ముగ్గురిపై కేసులు నమోదుచేశారు. పాక్‌తో భారత్ చర్చల రద్దు న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో పాక్‌తో ఢిల్లీలో సముద్ర భద్రతపై వచ్చే వారం జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకుంది. జాధవ్‌ను తమ దౌత్యవేత్తలు కలిసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఆందోళనకారుడి మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లోని బట్మలూ ప్రాంతంలో బీఎస్ఎఫ్ జవాన్లు ఆందోళనకారులపై శనివారం జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. బట్మలూ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) జవాన్లపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో జవాన్లు కాల్పులు జరపడంతో బారాముల్లా జిల్లాకు చెందిన సజ్జద్ అహ్మద్ (23) అనే యువకుడు మరణించాడు. -
బీఎస్ఎఫ్ జవాన్లకు పతంజలి ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఇప్పటికే యోగా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న బీఎస్ఎఫ్ దళాలు ఇకపై పతంజలి ఉత్పత్తులను వినియోగించనున్నాయి. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ క్యాంపులలో తొలి పతంజలి ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఎస్ఎప్ భార్యల సంక్షేమ సంఘం.. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డజనుకుపైగా బీఎస్ఎఫ్ క్యాంటీన్లలో పతంజలి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. -
బలగాలపై మావోయిస్టుల పంజా.. భారీ ప్రాణ నష్టం?
ఒడిశా: మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చి భారీ దాడికి దిగారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిదిమందికి పైగా బీఎస్ఎఫ్ జవాన్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పలువురు గాయాలపాలయినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సును లక్ష్యంగా ఎంచుకొని ముందాభూమి వద్ద కల్వర్ట్ను పేల్చివేయడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 25మంది వరకు గాయపడినట్లు సమాచారం. మృతులలో తులసి మది (డైవర్ హవిల్దార్), సోమనాథ్ సిసా(హవిల్దార్ మేజర్), సంజయ్ కుమార్ దాస్ ఉన్నట్లు గుర్తించారు. పేలుడు ధాటికి బస్సు తునాతునకలైంది. ఈ ఘటన కారణంగా విశాఖపట్నం-రాయ్ పూర్ మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య మొదలైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల జరిగిన భారీ ఎన్కౌంటర్ తర్వాత ఇంతపెద్ద స్థాయిలో మావోయిస్టులు విరుచుకుపడటం ఇదే తొలిసారి. ఆ సమయంలో పోలీసులు, కేంద్ర బలగాలు చేసిన దాడిలో 24మంది మావోయిస్టులు హతమయ్యారు. -
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
కుప్వారా: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు సైతం మృతి చెందినట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి
శ్రీనగర్: తీవ్రవాదులు బీఎస్ఎఫ్ సైనికుల కాన్వాయ్ పై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 10 రోజుల సెలవుల తర్వాత విధుల్లో చేరేందుకు 23 వాహనాల్లో జమ్ము నుంచి శ్రీనగర్ కు వెలుతున్న కాన్వాయ్ పై బిజ్బెహరా లోని జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది. మరణించిన జవాన్లను గిరీష్ కుమార్ శుక్లా, మహిందర్ రామ్, దినేష్ లుగా గుర్తించారు. మరో నలుగురిని ఆసుపత్రికి తరళించారు. ప్రభుత్వ ఆసుపత్రికి 52 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికిచేరుకున్న బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ పరిస్థితిని సమీక్షించారు.దాడికి పాల్పడింది ఇండియన్ ముజాహిదిన్ కు చెందిన ఉగ్రవాద సంస్థగా భావిస్తున్నారు. -
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్
అగర్తలా:ఓ దళిత యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను అదుపులోకి తీసుకున్నారు. 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆ జవాన్లను అరెస్ట్ చేశారు. సరిహద్దు గ్రామమైన సిమ్నాలో విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఆ బాలికను వేధించినట్లు ఫిర్యాదు నమోదు చేసుకున్న అధికారులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి ఆ బాలిక ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అంతకుముందు ఆ జవాన్లుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైయ్యారు. ఇదిలా ఉండగా ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితుడు ఓ మహిళపై అత్యాచారం పాల్పడటంతో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్‌లోని 3 బీఎస్ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల భారత్ వైపు ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. భారత్ - పాక్ దేశాల మధ్య ప్లాగ్ మీటింగ్ జరిగిన కొద్ది గంటలకే ఈ కాల్పులు జరగడం గమనార్హం. గత రెండు వారాల్లో ఇప్పటి వరకు పాక్ 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. -
40 భారత చెక్పోస్టులపై పాకిస్థాన్ కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. జమ్ము కాశ్మీర్‌లోని సాంబ జిల్లాలో పాక్ బలగాలు ఏకంగా 40 సరిహద్దు చెక్‌పోస్టుల మీద కాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ దళాలు ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నా, బీఎస్ఎఫ్ బలగాలు కూడా భారీగా వాళ్లమీద విరుచుకుపడటంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు చాలాసేపు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ రేంజర్లు చిన్న, ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు ప్రారంభించి, దాదాపు 35-40 చెక్‌పోస్టులు, పౌరుల నివాసాలపై మోర్టారు బాంబులు కూడా వేశారు. ఈ దాడి ఆదివారం రాత్రి 9.30 నుంచి మొదలై సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. సాంబా జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇదే మొదటిసారి. ఆర్నియా, ఆర్ పురా, కానాచక్, అఖ్నూర్ సబ్సెక్టార్లను పాక్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోయినా, బాంబు దాడి వల్ల ముగ్గురు పౌరులు మాత్రం గాయపడ్డారు. గడిచిన 15 రోజుల్లోనే 21 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. -
భద్రత కోసం వస్తూ...బలి
బీఎస్ఎఫ్ వాహనం బోల్తా, ధోబీ మృతి ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలు విశాఖ సెవెన్ హిల్స్‌కు క్షతగాత్రుల తరలింపు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు అప్పుడే తెల్లవారుతోంది.... ఇంకా మం చుపొరలు వీడలేదు. చాలా దూరం నుంచి వస్తున్న వారంతా మరో 15 నిమిషాల్లో గమ్యం చేరుకుంటారు. ముందువెళుతున్న మూడు వ్యాన్లు వెళ్లిపోయాయి. నాల్గో వ్యాన్ కల్వర్టు దగ్గరకు వచ్చేసరికి అకస్మాత్తుగా రోడ్డుపై గేదె ప్రత్యక్షమైంది. అంతే దాన్ని తప్పించబోయే యత్నంలో వ్యాన్ అదుపుతప్పింది. హాహాకారాలు మిన్నం టాయి. అంతలోనే తేరుకున్న వారంతా అప్రమత్తమయ్యారు. గాయాలతో బయటపడ్డారు. అయితే అలసి కునుకుతీసిన ఓ ధోబీ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాడు. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. బొండపల్లి, న్యూస్‌లైన్: బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఐదు గంటలకు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ధోబీ మృతి చెందగా ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ అహ్మద్ తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా లక్ష్మీపురం నుంచి బీఎస్ఎఫ్ 28వ బెటాలియన్ సిబ్బంది 51 మందిని నాలుగు వ్యాన్లలో విజయనగరానికి రప్పించారు. అయితే గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. విజయనగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో బొండపల్లి మండలం కనిమెరక రెవెన్యూ పరిధిలోని బొడసింగిపేట జాతీయ రహదారిపై గేదె అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఒక్కసారిగా వాహనం రోడ్డు పక్కనున్న కల్వర్టు గోడపైకి వెళ్లి, పక్కనున్న గొతిలోకి బోల్తా పడిపోయింది. గోతిలో దట్టమైన పొదలు ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే జవాన్లు అందరూ అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై గాయాలతో బయటపడ్డారు. అప్పటికే నిద్రపోతున్న బీఎస్ఎఫ్కు చెందిన ధోబీ మునీంద్ర కుమార్ (40)పై ఆయుధాల కిట్లు పడిపోవడంతో తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇద్దరు ఏఎస్ఐలు, ముగ్గురు హెచ్‌సీలు ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ వ్యానులో మొత్తం పన్నెండు మంది ఉన్నారు. మునీంద్రకుమార్ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లా జమునీయా గ్రామం. ఏఎస్ఐలు రాజేంద్రభారతి, విజయేంద్రసింగ్, హెచ్‌సీలు శైలింద్రకుమార్, అఖిలేష్చంద్, బోలారామ్లతో పాటు జవాన్లు ధీరేంద్రసింగ్, టీసీ దాస్, మనోజ్‌కుమార్, బిస్వాస్, గోపీనాథ్, హర్భజన్‌సింగ్ గాయాలపాలయ్యారు. వీరిని తొలుత 108 వాహనం సాయంతో విజయనగరం తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ సెవెన్‌హిల్స్‌కు తరలించారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్అహ్మద్, సీఐ చంద్రశేఖర్, బొండపల్లి ఎస్ఐ జె.తారకేశ్వరరావు, గజపతినగరం ఎస్ఐ సాయికృష్ణ, మానాపురం ఎస్ఐ యు.మహేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఏకే47 గన్లు, బుల్లెట్లు తదితర ఆయుధాలు ఉండడంతో వాహనం వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాశారు. ఎస్పీ సందర్శన ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గజపతినగరం ఆస్పత్రిలో ఉన్న ధోబీ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని విశాఖపట్నం విమానాశ్రయానికి బాక్స్‌లో తరలించారు. -
మాజీ సైనికుడి దారుణ హత్య
బొంరాస్‌పేట, నఊ్యస్లైన్: బీఎస్ఎఫ్కు చెందిన ఓ మాజీ సైనికుడు దారుణహత్యకు గురయ్యాడు. శవాన్ని ఓ పాడుబావిలో పూడ్చిపెట్టారు. చివరికి నిందితుడు పోలీసుల ఎదుట నే రం ఒప్పుకోవడంతో ఈ ఘటన 20రోజుల తరువాత సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనతో మండలంలోని చిల్మల్‌మైలారంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(48) బీఎస్ఎఫ్కు చెందిన మాజీ సైనికుడు. అనారోగ్యం కారణాల వల్ల ఉద్యోగం విడిచి ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన కులస్తుడైన అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బోరు నుంచి నీటిని తీసుకుని వ్యవసాయం చేసేవాడు. చంద్రశేఖర్‌రెడ్డిని తరుచూ తనవెంట తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఈనెల 10న రాత్రిపూట పొలం వద్ద నిద్రిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డిని హత్యచేసేందు కు పూనుకున్నాడు. పథకం ప్రకారం కర్రతో నర్సింహారెడ్డి అతని తలపై మోది చంపాడు. శవాన్ని పక్కనే ఉన్న పాడుబావిలో కంపచెట్లలో పూడ్చిపెట్టాడు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం వెతకసాగారు. ఆచూకీ లభించకపోవడంతో నర్సింహారెడ్డిపై అనుమానాలు వ్యక్తంచేశారు. చంద్రశేఖర్‌రెడ్డిని ఏం చేశాడో చెప్పాలని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. లేనిచో జైలుపాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో నర్సింహారెడ్డి ఎట్టకేలకు సోమవారం కొడంగల్ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రశేఖర్‌రెడ్డిని తానే హత్యచేసి బావిలో పూడ్చిపెట్టానని నర్సింహా రెడ్డి నేరం అంగీకరించాడు. దీంతో కొ డంగల్ సీఐ కాసాని రామారావు, ఎస్ఐ లక్ష్మీనర్సింహులు సమక్షంలో గ్రామాన్ని సందర్శించి విచారించారు. హత్యస్థలం లో మృతదేహాన్ని బయటికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నా రు. మృతునికి భార్య చంద్రకళ, కొడుకు లు శివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డిలు ఉన్నారు. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తాడనే.. నర్సింహారెడ్డికి చెందిన ట్రాక్టర్‌కు ఇటీవల కొందరు నిప్పంటించి తగులబెట్టా రు. ఈ సంఘటనలో తన భర్త ప్రమే యం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారని మృతుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య చంద్రకళ చెప్పారు. తన దాయాది భార్యకు నర్సింహారెడ్డికి వివాహేతర సం బంధం ఉన్నందున తన భర్త ప్రశ్నించి అడ్డుపడుతాడేమోననే అనుమానంతో హత్యకు పాల్పడినట్లు ఆమె బోరున విలపించారు. ఈ సంఘటనలో దాయాదుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. -
ఏవోబీలో మావోయిస్టుల దాడిః మందుపాతర పేలి నలుగురు జవాన్ల హతం
గౌరీశ్వరరావు (పాచిపెంట) ఆంధ్రా- ఒడిసా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి విజృంభించారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన బృందంపై విరుచుకుపడ్డారు. నలుగురు జవాన్ల ప్రాణాలు బలితీసుకున్నారు. మావోయిస్టులకు కంచుకోట లాంటి ఏవోబీ ప్రాంతం చాలాకాలంగా నిశ్శబ్దంగా ఉంటోంది. ఇటీవలి కాలంలో పెద్దగా ఎన్కౌంటర్లు గానీ, ఎదురు కాల్పులు గానీ జరిగిన దాఖలాల్లేవు. అలాంటిది ఒక్కాసారిగా మావోయిస్టులు ఇంత స్థాయిలో దాడి చేయడం, కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన జవాన్ల ప్రాణాలు బలిగొనడం పోలీసు బలగాలకు షాకిచ్చింది. 18 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లతో కూడిన కూంబింగ్ పార్టీ ఒడిసాలోని మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి బయల్దేరింది. నాలుగు వ్యాన్లలో వాళ్లంతా విశాఖ వెళ్తున్నారు. ఉదయం 9.30 ప్రాంతం అయ్యేసరికి ఒడిసా రాష్ట్రం సుంకి మండలం సమీపంలోని నారాయణపొదల్ గ్రామం వచ్చింది. అక్కడ మూడు వ్యాన్లు సురక్షితంగానే వెళ్లాయి. కానీ, నాలుగో వ్యాన్ వెళ్తుండేసరికి ఒక్కసారిగా మావోయిస్టులు ముందుగానే అమర్చిన మందుపాతరను పేల్చారు. అంతే.. ఒక్కసారిగా వ్యాన్ గాల్లోకి లేచింది. ఒక సబార్డినేట్ ఆఫీసర్, ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. వెంటనే భారీ సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులు దాదాపు గంట పాటు కొనసాగాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ కర్ణాటక, మహారాష్ట్రలకు చెందినవారు. పేలుడుకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆంబుష్ పార్టీకి చెందిన ఆయుధాలన్నీ సురక్షితంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అయితే... మృతులు, క్షతగాత్రుల విషయం పక్కన పెడితే, ఇదే సంఘటనలో ఇంకా చాలామంది జవాన్లు కనపడకుండా పోయారు!! ఈ విషయమే ప్రస్తుతం పోలీసు బలగాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాళ్లు కూడా మరణించారో.. లేదా అక్కడే ఏవైనా శిథిలాల కింద ఉన్నారో అనే విషయం మంగళవారం రాత్రి వరకు తెలియరాలేదు. మందుపాతర పేలిన తర్వాత ఆ సమాచారం తెలిసిన కోబ్రా దళాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. అదృశ్యమైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చిన సంఘటన నేపథ్యంలో ఏవోబీ మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సాలూరు, పాచిపెంట తదితర సరిహద్దు ప్రాంతాల పోలీసులు అలర్ట్ అయ్యారు. పేలుడు విషయమై సమాచారం అందడంతో పాచిపెంట ఎస్ఐ స్వామినాయుడు క్షతగాత్రులకు దగ్గరుండి మంచినీళ్లు పంపి, వారిని పి.కోనవలస చెక్‌పోస్టు వద్దనుంచి సాలూరు తీసుకెళ్లి, అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం 108 అంబులెన్సులో విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడిలో సుమారు 200 మంది మావోయిస్టులకు వరకూ పాల్గొని ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.