
జమ్మూలో హోలీ వేడుకల్లో బీఎస్‌ఎఫ్ జవాన్ల సందడి
సాక్షి, జమ్మూ : దేశ భద్రతను కాంక్షిస్తూ నిత్యం సరిహద్దుల్లో పహారా కాసే సరిహద్దు భద్రతా దళ జవాన్లు గురువారం హోలీ సంబరాల్లో మునిగితేలారు. దేశాన్నికాపాడేందుకు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దీటుగా సేవలందించే జవాన్లు కొద్దిసేపు సేదతీరారు.
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్ జవాన్లు ఆటపాటలతో హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సరిహద్దులో సందడి చేశారు. మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆనందంగా రంగుల పండుగను జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment