ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి | 3 BSF jawans killed after terrorists ambush their convoy in South Kashmir | Sakshi
Sakshi News home page

ఉగ్ర దాడి.. నలుగురు సైనికులు మృతి

Published Fri, Jun 3 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

3 BSF jawans killed after terrorists ambush their convoy in South Kashmir

శ్రీనగర్: తీవ్రవాదులు బీఎస్ఎఫ్ సైనికుల కాన్వాయ్ పై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇందులో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  10 రోజుల సెలవుల తర్వాత విధుల్లో చేరేందుకు 23 వాహనాల్లో జమ్ము నుంచి శ్రీనగర్ కు వెలుతున్న కాన్వాయ్ పై బిజ్బెహరా లోని జాతీయ రహదారిపై  ఈ దాడి జరిగింది.  మరణించిన జవాన్లను  గిరీష్ కుమార్ శుక్లా, మహిందర్ రామ్, దినేష్ లుగా గుర్తించారు. మరో నలుగురిని ఆసుపత్రికి తరళించారు. ప్రభుత్వ ఆసుపత్రికి  52 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
 
విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికిచేరుకున్న బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ పరిస్థితిని సమీక్షించారు.దాడికి పాల్పడింది ఇండియన్ ముజాహిదిన్ కు చెందిన ఉగ్రవాద సంస్థగా భావిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement