మాజీ సైనికుడి దారుణ హత్య | former soldier killed | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుడి దారుణ హత్య

Dec 31 2013 4:10 AM | Updated on Aug 21 2018 5:44 PM

బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు దారుణహత్యకు గురయ్యాడు. శవాన్ని ఓ పాడుబావిలో పూడ్చిపెట్టారు. చివరికి నిందితుడు పోలీసుల ఎదుట నే రం ఒప్పుకోవడంతో ఈ ఘటన 20రోజుల తరువాత సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

  బొంరాస్‌పేట, నఊ్యస్‌లైన్:
 బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మాజీ సైనికుడు దారుణహత్యకు గురయ్యాడు. శవాన్ని ఓ పాడుబావిలో పూడ్చిపెట్టారు. చివరికి నిందితుడు పోలీసుల ఎదుట నే రం ఒప్పుకోవడంతో ఈ ఘటన 20రోజుల తరువాత సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనతో  మండలంలోని చిల్మల్‌మైలారంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి(48) బీఎస్‌ఎఫ్‌కు చెందిన మాజీ సైనికుడు. అనారోగ్యం కారణాల వల్ల ఉద్యోగం విడిచి ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, తన కులస్తుడైన అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బోరు నుంచి నీటిని తీసుకుని వ్యవసాయం చేసేవాడు. చంద్రశేఖర్‌రెడ్డిని తరుచూ తనవెంట తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఈనెల 10న రాత్రిపూట పొలం వద్ద నిద్రిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డిని హత్యచేసేందు కు పూనుకున్నాడు.
 
 పథకం ప్రకారం కర్రతో నర్సింహారెడ్డి అతని తలపై మోది చంపాడు. శవాన్ని పక్కనే ఉన్న పాడుబావిలో కంపచెట్లలో పూడ్చిపెట్టాడు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి ఆచూకీ కోసం వెతకసాగారు. ఆచూకీ లభించకపోవడంతో నర్సింహారెడ్డిపై అనుమానాలు వ్యక్తంచేశారు. చంద్రశేఖర్‌రెడ్డిని ఏం చేశాడో చెప్పాలని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. లేనిచో జైలుపాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో నర్సింహారెడ్డి ఎట్టకేలకు సోమవారం కొడంగల్ పోలీసులకు లొంగిపోయాడు. చంద్రశేఖర్‌రెడ్డిని తానే హత్యచేసి బావిలో పూడ్చిపెట్టానని నర్సింహా రెడ్డి నేరం అంగీకరించాడు. దీంతో కొ డంగల్ సీఐ కాసాని రామారావు, ఎస్‌ఐ లక్ష్మీనర్సింహులు సమక్షంలో గ్రామాన్ని సందర్శించి విచారించారు. హత్యస్థలం లో మృతదేహాన్ని బయటికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నా రు. మృతునికి భార్య చంద్రకళ, కొడుకు లు శివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డిలు ఉన్నారు.
 
 వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తాడనే..
 నర్సింహారెడ్డికి చెందిన ట్రాక్టర్‌కు ఇటీవల కొందరు నిప్పంటించి తగులబెట్టా రు. ఈ సంఘటనలో తన భర్త ప్రమే యం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారని మృతుడు చంద్రశేఖర్‌రెడ్డి భార్య చంద్రకళ చెప్పారు. తన దాయాది భార్యకు నర్సింహారెడ్డికి వివాహేతర సం బంధం ఉన్నందున తన భర్త ప్రశ్నించి అడ్డుపడుతాడేమోననే అనుమానంతో హత్యకు పాల్పడినట్లు ఆమె బోరున విలపించారు. ఈ సంఘటనలో దాయాదుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement